జువ్వాడి నరసింగరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జువ్వాడి నరసింగరావు

జువ్వాడి నరసింగరావు కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.

రాజకీయ జీవితం[మార్చు]

అతని తండ్రి జువ్వాడి రత్నాకరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు.[1]

ఇతను 1962లో, 1972లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైనారు. ఆతర్వాత గ్రామ సర్పంచిగా ఎన్నికై గ్రామానికి సేవలందించారు. నరసింగరావు సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థకు రెండు సార్లు చైర్మెన్‌గానూ కొనసాగినారు. ఇతని భార్య స్వర్ణలత 1981లో గ్రామసర్పంచిగా విజయం సాధించింది.

అతను 1962 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఇండిపెండెంట్ ప్రత్యర్థి గుడ్ల లక్ష్మీనరసయ్య పై 9108 ఓట్ల అధిక్యతతో గెలుపొందాడు.[2] 1967 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి సి.పి.ఐ ప్రత్యర్థి చండ్ర రాజేశ్వరరావు చేతిలో 8332 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3] 1972 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప సి.పి.ఐ ప్రత్యర్థి చండ్ర రాజేశ్వరరావుపై 2686 ఓట్ల ఆధిక్యతతో తెలుపొందాడు.[4][5]

మూలాలు[మార్చు]

  1. "Gutta- Vivek- TRS | | Deccan Abroad". DeccanAbroad.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-06-14. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-12.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1962". Elections in India. Retrieved 2020-07-12.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1967". Elections in India. Retrieved 2020-07-12.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1972". Elections in India. Retrieved 2020-07-12.
  5. "ఆరేళ్ల అసెంబ్లీ ఇదొక్కటే!". Sakshi. 2018-10-28. Retrieved 2020-07-12.