ఎన్.వి.కృష్ణయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్.వి.కృష్ణయ్య

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989 - 1994
ముందు చెన్నమనేని రాజేశ్వరరావు
తరువాత చెన్నమనేని రాజేశ్వరరావు
నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1930
యాటలూరు గ్రామం,వెంకటగిరి మండలం,తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2006 సెప్టెంబర్ 13[1]
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)
సంతానం ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు

నిదిగళ్లు వెంకట కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989లో సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఎన్.వి.కృష్ణయ్య 1930లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, ,వెంకటగిరి మండలం, యాటలూరు గ్రామంలో జన్మించాడు. ఆయన వెంకటగిరిలో పాఠశాల విద్యను పూర్తి చేసి, నెల్లూరులో వీఆర్ కాలేజీలో చేరి విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 1952 లో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా చేరాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎన్.వి.కృష్ణయ్య భారత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తరపున నిలిచి నెల్లూరు పట్టణ కమిటీ కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పని చేసి 1964లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికయ్యాడు. ఆయన 1967లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో నెల్లూరు నియోజకవర్గం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనసంఘ్ అభ్యర్థి ఎంఆర్ అన్నదాత చేతిలో 11951 ఓట్లతో ఓడిపోయాడు.[4]

ఎన్.వి.కృష్ణయ్య 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సిరిసిల్ల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. "Red Salutes to Comrade NVK". Archived from the original on 28 November 2006. Retrieved 27 October 2006.
  2. Mana Telangana (9 November 2018). "సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో గులాబీ హాట్రిక్". Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.
  3. "Sircilla Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". 2018. Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.
  4. List Of Political Parties Archived 2007-09-30 at the Wayback Machine