Jump to content

బిరుదు రాజమల్లు

వికీపీడియా నుండి
బిరుదు రాజమల్లు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1994 – 1999
ముందు గీట్ల ముకుందారెడ్డి
తరువాత గుజ్జుల రామకృష్ణారెడ్డి
నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1950
సుల్తానాబాద్‌, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం 2024 ఫిబ్రవరి 5
హైదరాబాద్‌
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ
నివాసం సుల్తానాబాద్‌, కరీంనగర్
వృత్తి రాజకీయ నాయకుడు

బిరుదు రాజమల్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1994లో పెద్దపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

బిరుదు రాజమల్లు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అవీచి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన సుల్తానాబాద్ పీఏసీఎస్‌ చైర్మన్‌గా పనిచేసి[2] 1989లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆయన 1994లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి 39677 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత కరీంనగర్ ఉమ్మడి జిల్లా టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పని చేసి తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018లో టీడీపీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.[3][4] బిరుదు రాజమల్లు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

మరణం

[మార్చు]

బిరుదు రాజమల్లు వృద్ధాప్య సంబంధిత సమస్యలతో కొంతకాలంగా బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 2024 ఫిబ్రవరి 5న మరణించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (8 November 2018). "పెద్దపల్లి పెద్దన్నలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. Namasthe Telangana (7 January 2022). "సహకారంలో ఆదర్శం సేవల్లో ఘనం". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  3. Mana Telangana (12 September 2018). "టిఆర్ఎస్ లో చేరిన బిరుదు రాజమల్లు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  4. Andhra Jyothy (25 September 2021). "పార్టీలు మారినా దక్కని ఫలితం" (in ఇంగ్లీష్). Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  5. V6 Velugu (5 February 2024). "పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత". Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)