చింతకుంట విజయరమణారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతకుంట విజయరమణారావు

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
ముందు గీట్ల ముకుందారెడ్డి
తరువాత దాసరి మనోహర్ రెడ్డి
నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1966
శివపల్లి, ఎలిగేడు మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు గోవింద రావు
జీవిత భాగస్వామి పావని
సంతానం గోపికృష్ణ & వైష్ణవి
నివాసం shivapalli,
వృత్తి రాజకీయ నాయకుడు

చింతకుంట విజయరమణారావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో పెద్దపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

చింతకుంట విజయరమణారావు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశాడు. అతను తెలుగుదేశం పార్టీ జూలపల్లి మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసి,1995లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరపున జూలపల్లి జడ్పీటీసీ సభ్యుడుగా గెలిచాడు. విజయరమణారావు 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి పై పై 23482వేల ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

చింతకుంట విజయరమణారావు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. అతను 2010 నుండి 2016 వరకు కరీంనగర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, 2016 నుండి 2017 వరకు పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, 2017లో టీడీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి 2018లో కాంగ్రెస్ తరపున పెద్దపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా పని చేసి, 2023 నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి  బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డిపై 55,108 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (8 November 2018). "పెద్దపల్లి పెద్దన్నలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. Sakshi (14 November 2018). "పాత ప్రత్యర్థుల..కొత్త పోరు." Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  3. Andhrajyothy (4 December 2023). "పెద్దపల్లి పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.