జిన్నం మల్లారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జిన్నం మల్లారెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1962 – 1978
తరువాత గొట్టిముక్కుల రాజిరెడ్డి
నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1930
కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం కరీంనగర్
వృత్తి రాజకీయ నాయకుడు

జిన్నం మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పెద్దపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా మూడు పర్యాయాలు పనిచేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

జిన్నం మల్లారెడ్డి 1962లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి పర్వతాలు పై 11909 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1967లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బి.రాములు పై 19220 ఓట్ల మెజార్టీతో రెండోసారి, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి వేముల రమణయ్యపై 14,288 ఓట్ల మెజార్టీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబీకి ఎన్నికయ్యాడు. 1977లో దేశంలో ఎమర్జెన్సీ అమలు చేసిన సమయంలో శాసనసభ్యుల పదవీకాలన్ని ఏడాదిపాటు పొడగించడంతో ఆయన 16ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. Sakshi (8 November 2018). "పెద్దపల్లి పెద్దన్నలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. Sakshi (7 November 2018). "ఆ.. ముగ్గురు హ్యాట్రిక్‌ విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.