కె. లక్ష్మణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. లక్ష్మణ్
కె. లక్ష్మణ్


ఎమ్మెల్యే
పదవీ కాలము
1999 - 2004, 2014 - ప్రస్తుతం
నియోజకవర్గము ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 3, 1956
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జీవిత భాగస్వామి ఉమా
సంతానము ఇద్దరు కుమార్తెలు (శ్వేతా, శృతి), ఒక కుమారుడు (రాహుల్)
నివాసము అశోక్ నగర్, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

కె. లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ శాసనసభ ప్లోర్ లీడర్.[1][2]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

కె. లక్ష్మణ్ 1956, జూలై 3న హైదరాబాద్ లో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని పి.సి. సెంటర్ నుండి ఎం.ఎస్సీ మరియు జియోలజీ శాఖలో పిహెచ్.డి. పూర్తిచేశాడు.

వివాహం[మార్చు]

లక్ష్మణ్ కు ఉమాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు (శ్వేతా, శృతి), ఒక కుమారుడు (రాహుల్).[3]

రాజకీయ జీవితం[మార్చు]

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలోనే భారతీయ జనతా పార్టీ అనుబంధమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ లో చేరాడు. 1980లో బిజెపిలో చేరి, హైదరాబాద్ నగరంలో వివిధ పదవులను నిర్వర్తించి, 1995 నుండి 1999 వరకు హైదరాబాద్ బిజెపి శాఖకు అధ్యక్షులుగా పనిచేశాడు.

1994 లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో ఓడిపోయాడు. 1994 లో అదే నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2004 మరియు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[4]

మూలాలు[మార్చు]