Jump to content

గుండా రామిరెడ్డి

వికీపీడియా నుండి
గుండా రామిరెడ్డి
గుండా రామిరెడ్డి
జననం1919
గుండ్లపల్లి, మట్టంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా
మరణంమే 7, 2019
హైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లుతెలంగాణ రామిరెడ్డి
భార్య / భర్తఅచలాదేవి
పిల్లలుఇద్దరు కుమార్తెలు (సునయన), ఇద్దరు కుమారులు (శ్రీనివాసరెడ్డి)
తండ్రినర్సిరెడ్డి
తల్లిఅచ్చమ్మ

గుండా రామిరెడ్డి (1919మే 7, 2019) తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు. 1956 ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 1958, జనవరి 27న వాణిజ్య పన్నుల అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ పోరాటంలో పాల్గొని, తన పేరును తెలంగాణ రామిరెడ్డిగా మార్చుకున్నాడు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

ఇతడు 1919లో నర్సిరెడ్డి, అచ్చమ్మ దంపతులకు సూర్యాపేట జిల్లా, మట్టంపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో జన్మించాడు. హైదరాబాద్‌లో బీఎస్సీ పూర్తిచేశాడు.

వివాహం - ఉద్యోగం

[మార్చు]

ఇంటర్‌ చదివే రోజుల్లోనే అచలాదేవితో వివాహమైంది. 1945లో కొడంగల్లో తాలూకా కార్పొరేషన్‌ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరిన రామిరెడ్డి, 1949లో హైదరాబాదు కార్పొరేషన్‌ ఆఫీసర్‌గా, 1951–54 వరకు డిస్ట్రిక్‌ కార్పొరేషన్‌ ఆఫీసర్‌గా, 1954–56 వరకు మహబూబ్‌నగర్‌లో సెల్స్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా, 1957–58 వరకు హైదరాబాద్‌ సీటీఓగా పనిచేశాడు.[2]

తెలంగాణ ఉద్యమం

[మార్చు]

1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడంతో కమర్షియల్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగిందని 1958, జనవరి 27న తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. అప్పట్నుంచే అతని పేరు గుండా రామిరెడ్డి నుండి తెలంగాణ రామిరెడ్డిగా మారింది.[3][4]

భాతరదేశ మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సహధ్యాయి అయిన రామిరెడ్డి, తాను తెలంగాణను చూస్తానని అప్పట్లో పీవీతో సవాల్‌ విసిరాడు. 1968లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికైన రామిరెడ్డి, అప్పట్నుంచి రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు సహకారాన్ని అందించాడు.

ఇతర వివరాలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తరఫున మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు సాయి సప్తగిరి కాలనీలో ఉన్న రామిరెడ్డి ఇంటికి వెళ్ళి రూ. 10లక్షల చెక్కుతో అతడిని సన్మానించారు.[2][5]

మరణం

[మార్చు]

2019, మే 6 సోమవారంనాడు అస్వస్థతకు గురైన రామిరెడ్డిని చికిత్స నిమిత్తం మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ 2019, మే 7 మంగళవారం ఉదయం మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఈనాడు, తెలంగాణ రాష్ట్ర వార్తలు (8 May 2019). "తెలంగాణ రామిరెడ్డి కన్నుమూత". Archived from the original on 9 May 2019. Retrieved 9 May 2019.
  2. 2.0 2.1 సాక్షి, తెలంగాణ - హైదరాబాదు (8 May 2019). "తెలంగాణ రాంరెడ్డి కన్నుమూత". Archived from the original on 9 May 2019. Retrieved 9 May 2019.
  3. నమస్తే తెలంగాణ, తాజావార్తలు (24 July 2016). "కృష్ణా తీరం... ఉద్యమ ప్రవాహం". Archived from the original on 9 May 2019. Retrieved 9 May 2019.
  4. పోరు తెలంగాణ, తెలంగాణ మొనగాళ్ళు (4 April 2012). "రాజీకాని రామిరెడ్డి". www.porutelangana.in. Archived from the original on 9 మే 2019. Retrieved 7 జనవరి 2020.
  5. The Hans India, Khammam (30 May 2018). "Telangana Ram Reddy 100, alive and kicking". Archived from the original on 9 May 2019. Retrieved 9 May 2019.