అబ్బూరి ఛాయాదేవి
అబ్బూరి ఛాయాదేవి | |
---|---|
![]() | |
జననం | అబ్బూరి ఛాయాదేవి అక్టోబరు 13, 1933 రాజమహేంద్రవరం |
మరణం | జూన్ 28, 2019[1] |
వృత్తి | న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ |
ప్రసిద్ధి | తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత |
మతం | హిందూ |
భార్య / భర్త | అబ్బూరి వరదరాజేశ్వరరావు |
తండ్రి | మద్దాలి వెంకట చలం |
తల్లి | వెంకట రమణమ్మ |
అబ్బూరి ఛాయాదేవి (అక్టోబరు 13, 1933 - జూన్ 28, 2019) తెలుగు కథా రచయిత్రి, స్త్రీవాద రచయిత. ఈమె భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా తెలుగు రచయిత.
జీవిత విశేషాలు[మార్చు]
ఛాయాదేవి రాజమహేంద్రవరంలో1933 అక్టోబరు 13 లో సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.[2] 1951-53 మధ్య నిజాం కళాశాల నుండి ఎం.ఏ. చదివారు. 1953లో కాలేజీ మాగజైన్ లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ. అప్పటి నుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి, పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాసారు. కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగపిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్ సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురించబడింది.
ఛాయాదేవి వృత్తిరీత్యా న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గా పనిచేసి 1982లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.
1993లో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996లో మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహితీ పురస్కారాలు అందుకున్నారు. 2005 సంవత్సరంలో తనమార్గం అనే కథాసంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నది.
మూలాలు[మార్చు]
- కథాకిరణాలు : మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.
- ↑ ప్రజాశక్తి http://www.prajasakti.com/Article/TaajaVarthalu/2150931. Retrieved 28 June 2019. Missing or empty
|title=
(help) - ↑ Why do women write? - Telugu Writers' Workshop Archived 2008-11-04 at the Wayback Machine Women's WORLD
బయటి లింకులు[మార్చు]
- ఛాయాదేవి రచనలు : వ్యాసచిత్రాలు, వరదస్మృతి, బొమ్మలు చేయడం, TheJourney[permanent dead link]
- CS1 errors: missing title
- CS1 errors: bare URL
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1933 జననాలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు
- తెలుగు రచయిత్రులు
- తెలుగు కథా రచయితలు
- నిజాం కళాశాల పూర్వవిద్యార్ధులు
- కళాసాగర్ అవార్డు గ్రహీతలు
- ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్ధులు
- తూర్పు గోదావరి జిల్లా రచయిత్రులు
- 2019 మరణాలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయిత్రులు
- రాజమండ్రి వ్యక్తులు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ రచయిత్రులు