నల్లగారి రామచంద్ర
నల్లగారి రామచంద్ర కథా రచయిత, కవి, నవల, నాటక రచయిత. గ్రామీణ నేపథ్యమన్నా, కర్షకుల జీవితాలన్నా ఆయనకు ఎంతో ఇష్టం. తన రచనలలో కర్షకుల కష్టాలను, గ్రామీణ నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు రచించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను వై.ఎస్.ఆర్ జిల్లాలోని రామిరెడ్డిపల్లెలో 1939 నవంబరు 12న బాలమ్మ, గంగిరెడ్డి దంపతులకు జన్మించాడు. ప్రొద్దుటూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రీడర్‌గా ఉద్యోగంలో చేరిన అతను వివిధ ప్రాంతాల్లో పనిచేసి 1997లో పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత రచనా రంగంవైపు దృష్టి సారించి కథారచయితగా మంచి గుర్తింపు పొందారు. యువకవులను, రచయితలను ప్రోత్సహించడానికి సాహితీ మిత్రమండలిని స్థాపించి అనేక కవి సమ్మేళనాలు, సాహితీ కార్యక్రమాలు నిర్వహించాడు. అతనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు[1].
రచనలు
[మార్చు]అతనికి సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియల్లో ప్రావీణ్యం ఉంది. రేనాడు, నూర్జహాన్ (చారిత్రక నవల)[2], మాపల్లె ముచ్చట్లు, మాసీమ కథలు పుస్తకాలు ఈయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. పారిజాతాపహరణం, శ్రీకృష్ణమాయ అనే పౌరాణిక పద్యనాటకాలు సైతం రాశాడు. 25కు పైగా పుస్తకాలు వెలువరించాడు. అతని సాహతీకృషికి గాను అనేక బిరుదులు, బహుమతులు వరించాయి.
మరణం
[మార్చు]అతను 2019, జూన్ 30న ప్రొద్దుటూరు నాగేంద్రనగర్‌లోని వారి స్వగృహంలో మరణించాడు.