ముఖేష్ గౌడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూల ముఖేష్ గౌడ్
ముఖేష్ గౌడ్


మాజీ మంత్రి
పదవీ కాలం
25 నవంబర్, 2010 – 1 మార్చి, 2014
ముందు రాజాసింగ్
నియోజకవర్గం గోషామహల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1959-07-01)1959 జూలై 1
మరణం 2019 జూలై 29(2019-07-29) (వయసు 60)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి లక్ష్మీ
బంధువులు టి.దేవేందర్ గౌడ్ (మేనమామ)
సంతానం శిల్పా గౌడ్, విక్రమ్ గౌడ్[1], విశాల్ గౌడ్
మతం హిందు
వెబ్‌సైటు www.mukeshgoud.org

మూల ముఖేశ్ గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ పార్టీ 1989, 2004 లో మహారాజ్ గంజ్ నుంచి రెండుసార్లు శాసనసభ్యునిగా, 2009 గోషామహల్ శాసనసభ్యునిగా గెలుపొందాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ హయాంలో మార్కెంటింగ్ శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసాడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ముఖేశ్‌ గౌడ్‌ 1959, జూలై 1న హైదరాబాదులో జన్మించాడు. ఈయన తండ్రిపేరు నర్సింహా గౌడ్, భార్యపేరు లక్ష్మీ.

రాజకీయ జీవితం[మార్చు]

విద్యార్థి దశనుండే కాంగ్రెస్‌ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌యూఐలో పనిచేసి, యువజన కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించిన ముఖేష్ గౌడ్ 1986లో జాంబాగ్‌ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందాడు. 1989, 2004లో మహారాజ్‌గంజ్ నుంచి, 2009లో గోషామహల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో 2007లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, 2009లో మార్కెటింగ్ శాఖ మంత్రిగా ముఖేశ్ గౌడ్ బాధ్యతలు నిర్వహించాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2014, 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీచేసి, బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ చేతిలో ఓడిపోయాడు.[3]

మరణం[మార్చు]

క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ముఖేష్ ఆరోగ్యం 2019, జూలై 28 ఆదివారం రాత్రి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనన్ను జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ 29వ తేది సోమవారం మధ్యాహ్నం మరణించాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (11 January 2024). "పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్". Archived from the original on 11 January 2024. Retrieved 11 January 2024.
  2. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణ (29 July 2019). "మాజీ మంత్రి ముఖేశ్‌ గౌడ్‌ కన్నుమూత". ntnews.com. Archived from the original on 29 July 2019. Retrieved 29 July 2019.
  3. ఈనాడు, తెలంగాణ (29 July 2019). "మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ కన్నుమూత". www.eenadu.net. Archived from the original on 29 July 2019. Retrieved 29 July 2019.
  4. సాక్షి, తెలంగాణ (29 July 2019). "మాజీ మంత్రి ముఖేష్‌ గౌడ్‌ మృతి". Sakshi. Archived from the original on 29 July 2019. Retrieved 29 July 2019.