పిళ్లా రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిళ్లా రామారావు భారత స్వాతంత్ర్య సమరయోధులు. ఆర్.ఎస్.ఎస్.ప్రముఖులు. అతను భారతీయ విద్యాకేంద్రం (బి.వి.కె) విద్యాసంస్థలకు వ్యవస్థాపక సభ్యులు.

జీవిత విశేషాలు[మార్చు]

శ్రీరామారావు 1935 నుండి 1944 మధ్య కాలంలో ఎ.వి.ఎన్ ఉన్నత పాఠశాల, పాఠశాల, ఎ.వి.ఎన్ కళాశాలలలో పాఠశాల విద్య, కళాశాల విద్యలనభ్యసించారు. విజయనగరం మహారాజా కళాశాలలో బీఎస్సీ (భౌతికశాస్త్రం), ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సిని 1956లో పూర్తిచేశారు. అతను 1942లో ఏవీఎన్‌లో డెమాన్‌స్ట్రేటర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1956-72 వరకు అక్కడే భౌతికశాస్త్ర అధ్యాపకునిగా తన సేవలనందించారు. అతను 1972లో బి.వి.కె జూనియర్ కాలేజీకి వ్యవస్థాపక ప్రిన్సిపాల్ తదుపరి బి.వి.కె కళాశాలకు వ్యవస్థాపక ప్రధానాధ్యాపకునిగా చేరి 1983 వరకు పనిచేసారు. అతను విజ్ఞాన విహార, గుడిలోవాకు 1980లో వ్యవస్థాపక సభ్యునిగా వ్యవహరించారు. అతను ఆంధ్రా విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా కూడా పనిచేసారు.[1] ఓ వైపు ఉద్యోగం చేస్తూనే 1957లో ఆర్.ఎస్.ఎస్. సూచన మేరకు భారత్‌ ట్యుటోరియల్స్‌ ప్రారంభించారు. అక్కడే భారతీయ విద్యా కేంద్రం (బీవీకే) ను ఏర్పాటు చేశారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో[మార్చు]

అతను మహాత్మా గాంధీ పిలుపుమేరకు జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా వెంకటప్పయ్య నాయకత్వంలో పాల్గొని మూడునెలలు జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత ఆర్.ఎస్.ఎస్.లో చేరి నాగపూర్‌లో శిక్షణ పొందాడు. 1947లో నెల్లూరులో ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ గా తన సేవలనందించారు[1]. 1942లో విశాఖపట్నంలో ఆర్.ఎస్.ఎస్. శాఖను ప్రారంభించారు. అతను 2019 ఫిబ్రవరి 4న తన 95వ యేట కన్నుమూశారు[2]. అతని కుమారుడు వెంకటరమణ మూర్తి.

కుమారుడు కూడా తండ్రి అడుగుజాడులలోనె సామాజిక అవగాహనకలవారు, తండిృకి సేవలుచేస్తూ నగరంలో పలు సేవాకార్యక్రమాలలో పాల్గొని ఆంధ్ర ప్రభుత్వవాగ్గేయకారునిగా మంచి పేరు తేచ్చుకున్నారు.విశేషంగా 95 సార్లు రక్తదానం చేసారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Freedom fighter Pilla Rama Rao passes away". The Hindu (in Indian English). Special Correspondent. 2019-02-04. ISSN 0971-751X. Retrieved 2019-02-04.{{cite news}}: CS1 maint: others (link)
  2. "స్వాతంత్ర్య సమరయోధుడు పిళ్లా కన్నుమూత". 2019-02-04.[permanent dead link]