Jump to content

వయ్యా సామేలు

వికీపీడియా నుండి

వయ్యా సామేలు ప్రముఖ కవి, రచయిత, గాయకుడు. అతను తెలంగాణ సాయుధ పోరాటంలో బాల కొరియర్‌గా పనిచేసాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన స్వగ్రామం ఉమ్మడి వరంగల్‌ జిల్లా దేవరుప్పల. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రజాగాయకుడిగా పేరుపొందిన రాజారామానికి ఆయన స్వయానా తమ్ముడే. అన్న ప్రోద్బలంతో బాల్యంలోనే రైతాంగ పోరాటానికి మద్దతుగా నిలిచి కొరియర్‌గా మారాడు. అనేక సంవత్సరాల పాటు అభ్యుదయ రచయితల సంఘం నగర అధ్యక్షుడిగా సేవలందించాడు. మానవుడు[1], వయ్యారి పాటలు, జన గర్జన, గళగర్జన, ప్రజావాణి నాబాణి, పోరుగీతం, హరితహారం, ప్రజాకంటకులు[2] అనే పలు పుస్తకాలు రాశాడు[3]. అతను కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతూ 2019 జనవరి 10న జగద్గిరిగుట్టలోని స్వగృహంలో కన్నుమూశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Manavudu (మానవుడు) by Vayya Samelu (వయ్య సామేలు) - Telugu Poetry (kavitalu) Books… | Telugu Poetry Books on our Website - Popular, Interesting, Latest | Pinterest | Poetry books, Books and Poetry". Pinterest (in ఇంగ్లీష్). Retrieved 2019-01-14.
  2. ""ప్రజాకంటకులు పుస్తకావిష్కరణ". deccantv.in (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-07-20. Retrieved 2019-01-14.[permanent dead link]
  3. "సాయుధ పోరాట 'బాల కొరియర్‌' ఇకలేరు". www.andhrajyothy.com. 2019-01-11. Retrieved 2019-01-14.[permanent dead link]

బయటి లంకెలు

[మార్చు]