పెదప్రోలు (మోపిదేవి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదప్రోలు (మోపిదేవి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి నాదెళ్ళ రమాదేవి
జనాభా (2011)
 - మొత్తం 3,769
 - పురుషులు 1,900
 - స్త్రీలు 1,869
 - గృహాల సంఖ్య 1,184
పిన్ కోడ్ 521125
ఎస్.టి.డి కోడ్ 08671

పెదప్రోలు, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 125. యస్.టీ.డీ.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, పెడన, తెనాలి

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, ఘంటసాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.[మార్చు]

  1. వ్యవస్థాపకులు:- శ్రీమతి కొర్రపాటి లలితాంబ, శ్రీ దుర్గా పెద రామచంద్రరావు, శ్రీ కేసాని వెంకటరావు.
  2. ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, ఉన్నత స్థితికి చేరి, ఉద్యోగవిరమణ చేసిన పూర్వ విద్యార్థులు, ఈ పాఠశాలకు రెండు లక్షల రూపాయలను విరాళంగా అందజేసినారు. ఈ మొత్తాన్ని బ్యాంకులోవేసి, ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీసొమ్ముతో, ఆరు నుండి 10వ తరగతి చదివే, ఈ పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేయుటకు నిర్ణయించారు. [6]
  3. ఈ పాఠశాల 13వ వార్షికోత్సవం, 2015,ఫిబ్రవరి-10వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. [7]
  4. ఈ పాఠశాలలో 2016-17 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన బడుగు వెన్నెల అను విద్యార్థిని, పదవ తరగతి వార్షిక పరీక్షలలో 9.7 జి.పి.ఏ సాధించడమేగాక, ఒంగోలులోని ఐ.ఐ.ఐ.టిలో 2017-18 సంవత్సరంలో ప్రవేశానికి అర్హత సాధించింది. [13]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.[మార్చు]

ఈ పాఠశాల మట్టావాని ఎస్.సి.వాడలో, 9వ నంబరు కాలువ అంచున ఉంది.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

అంగనవాడీ కేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామపంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి నాదెళ్ళ రమాదేవి ఎన్నికయినది. ఉపసర్పంచిగా శ్రీ కృత్తివెంటి సీతారామయ్య ఎన్నికైనారు.[2] & [6]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ భూనీలా సమేత చెన్నకేశవస్వామి ఆలయం;- ఈ ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుపుతారు. [4]
  2. శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయం:- పెదప్రోలు గ్రామదేవత శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి వార్షిక గ్రామోత్సవం, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో 10 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [5]
  3. గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం:- 2014, ఆగష్టు-8, రెండవ శ్రావణ శుక్రవారం నాడు, భక్తబృందం వారు, అమ్మవారికి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు మేళతాళాలతో ఇంటింటికీ వెళ్ళి పూజలందుకున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా గ్రామస్థులు అమ్మవారికి నైవేద్యాలు, నూతనవస్త్రాలు సమర్పించారు. వర్షాలు కురిసి, పంటలు బాగా పండి, పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. [7]
  4. శ్రీరామ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 8వ వార్షికోత్సవం, 2014, ఆగష్టు-21, గురువారం నాడు, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాకు ప్రత్యేక పుష్పాలంకరణ చేసారు. అనంతరం బాబాకు పూలపల్లకీలో, మేళతాళాలతో, గ్రామోత్సవం నిర్వహించారు. గోమాతకు విశేషపూజలు నిర్వహించారు. [8]
  5. శ్రీ సీతా, రామ, లక్ష్మణ, శ్రీ సువర్చలా సమేత అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. [10]
  6. శ్రీ రామాలయం:- తిరుమల తిరుపతి దేవస్థానంవారి సహకారంతో, సమరసతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, పెదప్రోలు చైతన్యనగర్‌లోని హరిజనవాడలో ఐదులక్షల రూపాయల అంచనావ్యయంతో నిర్మించు ఈ ఆలయ నిర్మాణానికి, 2017,జూన్-8వతేదీ గురువారంనాడు శంకుస్థాపన నిర్వహించారు. [12]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

  1. కాసుల పురుషోత్తమ కవి. వీరు తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో కృషిచేసారు. పెదప్రోలు గ్రామంలో ఏర్పాటుచేసిన వీరి విగ్రహాన్ని, 2012,ఏప్రిల్-28న, విజయవాడ మాజీ శాసనసభ్యులు శ్రీ కె.సుబ్బరాజు అవిష్కరించారు. శ్రీకాకుళం గ్రామంలోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ శ్రీకాకుళేశ్వరస్వామివారిని కీర్తించుచూ, వీరు రచించిన ఆంధ్రనాయకశతకం లోని 108 పద్యాలను, ఆలయప్రాంగణంలో రాతి శాసనాలరూపంలో భద్రపరచారు. ఈ పద్యాలను వారి వారసులు శ్రీ కాసుల కృష్ణంరాజు, రాజశ్రీధర్ లు, ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు గాయకులు శ్రీ శ్రీకృష్ణచే ఆలపింపజేసి, సీ.డీ.రూపంలో నిక్షిప్తం చేసారు. ఈ సీ.డీ.లను 2016,ఫిబ్రవరి-4వ తేదీనాడు ఆలయంలో ఆవిష్కరించారు. [11]
  2. కేంద్ర సాహిత్య అకాడమీలో అత్యున్నత పదవి అయిన కార్యదర్శి పదవిని చేపట్టిన తొలి తెలుగు తేజం శ్రీ కృత్తివెంటి శ్రీనివాసరావు గారు ఈ వూరు వారే[3]
  3. శ్రీ ఏలేశ్వరపు కృష్ణమూర్తి , స్వాతంత్ర్య సమరయోధులు.
  4. శ్రీ యార్లగడ్డ బాలగంగాధరరావు :- వీరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు. వీరు తెలుగు భాషలో గ్రామాలకు ఏర్పడిన నామా (పేర్లు)లను శోధించి, పుస్తకరూపంలో అందించారు.

గ్రామంలోని విశేషాలు[మార్చు]

  1. 106 సంవత్సరాల వయోవృద్ధుడైన ఈ గ్రామస్థుడు రాజేశ్వరరావు, ఇంతవరకూ 59 సార్లు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 60వ సారి 31-7-2013న జరిగే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో తన ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. తొలిసారి 1951లో లోక్ సభ ఎన్నికలలో తన ఓటు హక్కు వినియోగించుకున్న ఈయన రెండోసారి 1955లోనూ, 13 సార్లు శాసనసభకూ, 31 సార్లు పెదప్రోలు గ్రామ సహకార సంఘసభ్యునిగా, ఓట్లు వేశారు.[4] -->
  2. ఈ గ్రామంలో ప్రతి కుటుంబానికీ వాణిజ్య బ్యాంకులో ఖాతా కల్పించి, ప్రధానమంత్రి జనధన్ యోజనలో 100% లక్ష్యాన్ని సాధించారు. [9]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3506.[5] ఇందులో పురుషుల సంఖ్య 1739, స్త్రీల సంఖ్య 1767, గ్రామంలో నివాస గృహాలు 955 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 962 హెక్టారులు.

  • జనాభా (2011) - మొత్తం 3,769/ - పురుషుల సంఖ్య 1,900/ - స్త్రీల సంఖ్య 1,869/ - గృహాల సంఖ్య 1,184.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Pedaprolu". Archived from the original on 24 సెప్టెంబర్ 2015. Retrieved 26 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  2. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ ఆగష్టు 3, 2013. పేజీ-1.
  3. ఈనాడు 20-1-2013 ఆదివారం అనుబంధం, పేజీ-20
  4. ఈనాడు కృష్ణా జులై 12, 2013. 8వ పేజీ.
  5. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.

వెలుపలి లింకులు[మార్చు]

[4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,డిసెంబరు-21; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మార్చి-6; 3వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2014,జులై-2; 3వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగష్టు-9; 2వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగష్టు-22; 2వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,నవంబరు-29; 1వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-16; 1వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-5; 41వపేజీ. [12] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జూన్-9; 1వపేజీ. [13] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జులై-6; 1వపేజీ.