కాసుల పురుషోత్తమ కవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాసుల పురుషోత్తమ కవి వ్యాజస్తుతి రూపంలో కావ్యాలు రాసిన కవి. క్రీస్తుశకం 1791 లో కృష్ణాజిల్లా దేవరకోట రాజు రాజా అంకినీడు బహుద్దూర్ దగ్గర ఆస్థాన కవిగా పనిచేసేవారు)పురుషోత్తమ కవికి పుల్లమరాజు అనే మరొక పేరు కూడా ఉండేది. ఈయన రచనలు అర్ధాంతర న్యాస అలంకారాలతో ఉంటూ రచనలకు వన్నె తెచ్చాయి.

వీరు జన్మించిన పెదప్రోలు గ్రామంలో, వీరి విగ్రహాన్ని, 2012, ఏప్రిల్-29నాడు ఆవిష్కరించారు. [ఈనాడు కృష్ణా; 2012, ఏప్రిల్-29; 16వ పేజీ]

ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామములో వేంచేసియున్న శ్రీ ఆంధ్రమహావిష్ణువు ఆలయం ప్రాంగణంలో, శ్రీ కాసులపురుషోత్తమ కవి విగ్రహాన్ని, 2016, ఫిబ్రవరి-11వ తేదీనాడు ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని శ్రీ కాసుల పురుషోత్తమ కవి వంశీకులైన శ్రీ జాడల్రిజా సాగర్ రాజు, శ్రీ కాసుల కృష్ణంరాజు, శ్రీ కాసుల శ్రీధరరాజు ఏర్పాటు చేసారు. [ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఫిబ్రవరి-12; 1వపేజీ]

రచనలు[మార్చు]

విజయనగర సామ్రాజ్య ప్రాభవంలో వెలిగిన ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం, తరువాత సరైన పాలన లేక నిర్లక్ష్యానికి గురి అయ్యిందిట. అప్పుడు కాసుల పురుషోత్తమ కవి ఈ స్వామి పై నిందాస్తుతిగా ఆంధ్ర నాయక శతకాన్ని రచించాడుట. ఇది విని అప్పట్లోని జమీందారు ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాడని చెప్పుకుంటారు.

ఆంధ్రనాయక శతకం:- ఈ శతకం సీస పద్యాలతో రచించ బడింది. అద్భుతమైన ధార, ఆకట్టుకునే శైలి ఈ కవి సొత్తు. మీరు ఈ శతకాన్ని ఇక్కడ చదివి ఆనందిచవచ్చు. శ్రీకాకుళం గ్రామములోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ శ్రీకాకుళేశ్వరస్వామివారిని కీర్తించుచూ రచించిన ఆంధ్రనాయకశతకం లోని 108 పద్యాలను, ఆ ఆలయప్రాంగణంలో రాతి శాసనాలరూపంలో భద్రపరచారు. ఈ పద్యాలను వారి వారసులు శ్రీ కాసుల కృష్ణంరాజు, రాజశ్రీధర్ లు, ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు గాయకులు శ్రీ శ్రీకృష్ణచే ఆలపింపజేసి, సీ.డీ.రూపంలో నిక్షిప్తం చేసారు. ఈ సీ.డీ.లను 2016, ఫిబ్రవరి-4వ తేదీనాడు ఆలయంలో ఆవిష్కరించారు. [ఈనాడు అమరావతి; 2016, ఫిబ్రవరి-5; 41వపేజీ] ఆంధ్ర నాయక శతకం https://web.archive.org/web/20140117022408/http://www.andhrabharati.com/shatakamulu/AMdhranAyaka/index.html

  • హంసలదీవి వేణుగోపాల శతకం

విశేషాలు[మార్చు]

దేవరకోటను పాలించిన చల్లపల్లి జమీందారు అంకినీడు ఆస్థాన కవిగా ఉంటూ అప్పటికే శిథిలస్థితిలో ఉన్న శ్రీకాకుళ ఆంధ్రమహా విష్ణు దేవాలయాన్ని మరల నిర్మింపజేసేడు.