బొబ్బర్లంక (మోపిదేవి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొబ్బర్లంక (మోపిదేవి)
—  రెవిన్యూ గ్రామం  —
బొబ్బర్లంక (మోపిదేవి) is located in Andhra Pradesh
బొబ్బర్లంక (మోపిదేవి)
బొబ్బర్లంక (మోపిదేవి)
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°56′N 80°53′E / 15.93°N 80.88°E / 15.93; 80.88
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 754
 - పురుషులు 373
 - స్త్రీలు 381
 - గృహాల సంఖ్య 237
పిన్ కోడ్ 521125.
ఎస్.టి.డి కోడ్ 08671

బొబ్బర్లంక, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 125., ఎస్.టి.డి. కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో మోపిదేవి, మోపిదేవిలంక, అవనిగడ్డ, పాగొలు, వెంకటాపురం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, ఘంటసాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మోపిదేవి, చల్లపల్లి నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 61 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ఓ.డి.ఎఫ్.గ్రామం:- 650 కుటుంబాలు ఉన్న ఈ గ్రామం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 2016,ఏప్రిల్ నుండి ప్రారంభించి, ఆరు నెలలలోనే, 2016,అక్టోబరు-2 నాటికి, మరుగు దొడ్డి లేని ప్రతి ఇంటికీ మరుగు దొడ్డి నిర్మించుకుని, ఓ.డి.ఎఫ్. గ్రామంగా ఎంపికైనది. ఈ విజయాన్ని పురస్కరించుకుని, తిరుపతిలో నిర్వహించిన సభలో ఈ గ్రామ సర్పంచి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా స్వచ్ఛ భారత్ పురస్కారాన్ని అందుకున్నారు. 100% మరుగుదొడ్లు నిర్మించుకున్నందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామానికి ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తుంది. [9]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. శ్రీ కోనేరు వీరభద్రయ్య, ఈ గ్రామానికి తొలి సర్పంచిగా పనిచేసారు.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కోనేరు వెంకట బసవ సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు 2015,ఆగస్టు-16వ తేదీనాడు, కృష్ణా జిల్లా సర్పంచుల సంఘం కార్యదర్శిగా నియామక పత్రం అందుకున్నారు. [3]&[7]
  3. 2014, ఆగస్టు-23వ తేదీన ఈ గ్రామ పంచాయతీ 57వ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నది. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో దసరా పండుగ సందర్భంగా, శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [5]
  2. శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం:- ముమ్మనేని వంశస్తుల దేవత శ్రీ వీరభద్రస్వామివారి ఉత్సవాలు, 2015,మార్చ్-1,2 తేదీలలో నిర్వహించెదరు. దూరప్రాంతాలలో ఉన్న ముమ్మనేని వంశస్థులు ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా విచ్చేసి, స్వామివారికి పూజలు నిర్వహించెదరు. [6]
  3. శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ మాసం (మే నెల) లో, మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [8]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామం 100% అక్షరాస్యత గ్రామంగా ఎంఫికై, పురస్కారం అందుకున్నది. ప్రభుత్వ పథకాలల అమలులోనూ ఈ గ్రామం అందరికంటే ముందుంటుంది. [9]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 834.[2] ఇందులో పురుషుల సంఖ్య 401, స్త్రీల సంఖ్య 433, గ్రామంలో నివాస గృహాలు 225 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 769 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 754 - పురుషుల సంఖ్య 373 - స్త్రీల సంఖ్య 381 - గృహాల సంఖ్య 237

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Bobbarlanka". Archived from the original on 17 ఏప్రిల్ 2017. Retrieved 26 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మే-8; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జూన్-26; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగస్టు-23; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,సెప్టెంబరు-26; 1వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మార్చ్-2; 2వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగస్టు-18; 3వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2016,మే-13; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,నవంబరు-30; 1వపేజీ.