నాగాయతిప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగాయతిప్ప
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ వేములపల్లి రవిచంద్ర
జనాభా (2011)
 - మొత్తం 1,643
 - పురుషులు 857
 - స్త్రీలు 786
 - గృహాల సంఖ్య 531
పిన్ కోడ్ 521125
ఎస్.టి.డి కోడ్ 08671

నాగాయతిప్ప, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 125. యస్.టీ.డీ.కోడ్ నం. 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, పెడన, తెనాలి

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, ఘంటసాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 64 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

పాలశీతలీకరణ కేంద్రo:- ఈ గ్రామంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన పాలశీతలీకరణ కేంద్రాన్ని, 2016, ఫిబ్రవరి-13న ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఒక రోజుకి ఒక వేయి లీటర్ల పాలను శీతలీకరణ చేయవచ్చు. [6]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

పోచిగానిలంక, నాగాయితిప్ప గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

2013, జూలైలో నాగాయితిప్ప గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ వేములపల్లి రవిచంద్ర సర్పంచిగా ఎన్నికైనారు. అనంతరం వీరు మోపిదేవి మండల సర్పంచిల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనారు. [3]&[4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ గ్రామంలో గరికపాటి వంశస్థుల ఇలవేలుపు అయిన శ్రీ అంకమ్మ తల్లి వార్షిక జాతర మహోత్సవాలు, 2016, మే-21వ తేదీ శనివారం, వైశాఖ పౌర్ణమినాడు ప్రారంభమైనవి. అమ్మవార్ని మేళతాళాలతో కృష్ణానది వద్దకు తీసుకొని వచ్చి, పుణ్యస్నానాలు ఆచరింపజేసినారు. సుదూర ప్రాంతాల నుండి తరలి వచ్చిన సుమారు 500 మంది గరికపాటి వంశస్థులు, ఈ సందర్భంగా, కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవారిని గ్రామంలోని ఇంటింటికీ తీసికొని వచ్చి మంగళ హారతులందించారు. [7]

శ్రీ ఆదిపేరంటాలమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం, 2017, మే-7వతేదీ ఆదివారంవారంనాడు వైభవంగా నిర్వహించెదరు. ఈ జాతరలో భాగంగా అమ్మవారు రెండురోజులపాటు గ్రామంలో ఇంటింటికీ తిరిగి గ్రామస్థుల నుండి పూజలందుకున్నది. అనంతరం ఆలయ ప్రవేశం కల్పించారు. భక్తులు నైవేద్యాలు సమర్పించి, మొక్కుబడులు తీర్చుకున్నారు. [8]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, చేపలు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

(1) ఈ గ్రామవాసులయిన శ్రీ చలసాని వెంకట సుబ్బారావు గారు ఉపాధ్యాయులు, హేతువాద కవితలూ, పుస్తకాల రచయిత. ఆయన రచించిన "భగవతీగీత" అను పుస్తకం సాహితీ విమర్శకుల ప్రశంసలనందుకుంది. ఆయన ఆగష్టు 13, 2013 నాడు మేడ్చెల్ లో అనారోగ్యంతో మృతిచెందినారు. మరణానంతరం ఆయన నేత్రాలను హైదరాబాదులోని యల్.వీ.ప్రసాద్ కంటి ఆసుపత్రికీ, శరీరాన్ని పరిశోధనలకోసం హైదరాబాదులోని మల్లారెడ్డి వైద్యకళాశాలకూ దానం చేశారు. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

ఘంటసాల కృషి విఙాన కేంద్ర శాస్త్రజ్ఞులు, శైలజ, శ్రీలతాహర్షవ్ర్ధన్ లు, నాగాయతిప్ప గ్రామాన్ని దత్తత తీసుకొని, రైతులకు అన్న వేళలా అందుబాటులో ఉంటూ, సూచనలు, సలహాలు అందించుటకు ముందుకు వచ్చారు. [5]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1795.[2] ఇందులో పురుషుల సంఖ్య 890, స్త్రీల సంఖ్య 905, గ్రామంలో నివాస గృహాలు 504 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 235 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,643 - పురుషుల సంఖ్య 857 - స్త్రీల సంఖ్య 786 - గృహాల సంఖ్య 531

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Nagaitippa". Retrieved 26 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013, ఆగష్టు-15; 6వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ, 2013, ఆగష్టు-4; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ, 2013, అక్టోబరు-23; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-19; 40వపేజీ. [6] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఫిబ్రవరి-12; 2వపేజీ. [7] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-22; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, మే-8; 3వపేజీ.