పెదతుమ్మిడి
పెదతుమ్మిడి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | బంటుమిల్లి |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 6,112 |
- పురుషులు | 3,042 |
- స్త్రీలు | 3,070 |
- గృహాల సంఖ్య | 1,818 |
పిన్ కోడ్ | 521329 |
ఎస్.టి.డి కోడ్ | 08674. |
పెదతుమ్మిడి, కృష్ణా జిల్లా, బంటుమిల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం 521 329., ఎస్.టి.డి.కోడ్ నం. 08674.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
పెడన, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం
సమీప మండలాలు[మార్చు]
ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, కైకలూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
అల్లూరు, సింగరాయపాలెం, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 71 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల;- ఈ పాఠశాల పూర్వ విద్యార్థిశ్రీ కంచర్ల వెంకటనాగులు, ప్రస్తుతం ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్.లో పనిచేస్తున్నారు. ఈయన చిన్నప్పటినుండి క్రీడలపై మక్కువ. ఈయన ఈ పాఠశాలలో చదువుచున్నప్పటినుండి, ఖొ-ఖొ. క్రికెట్, కబడ్డీ, అథ్లెటిక్స్ లో విశేష ప్రతిభ కనబరచుచూ, పలు పతకాలు సాధించారు. ఆ తరువాత విద్యుత్తు సంస్థలో పని చేయుచున్నప్పటినుండి గూడా, పరుల పోటీలలో పలు పతకాలు సాధించారు. తాజాగా ఈయన, 2014, జూలై-25 నుండి 27 వరకు, కురుక్షేత్రలో జరిగిన పరుగు పందేలలో పాల్గొని, 800 మీ. పందెంలో స్వర్ణ పతకం, 200 మీ. పందెంలో రజిత పతకం, 1500 మీ. పందెంలో కాంస్యపతకం సాధించడమే గాక, 15,000 రూపాయల నగదు బహుమతిని గూడా కైవసం చేసుకొని, తన మాతృ సంస్థ అయిన ఏ.పి.ఎస్.పి.డి.సి.ఎల్ కు పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. [2] ఆర్.ఆర్.ఎడ్యుకేషనల్ అమాడెమి, కె.చి.హెచ్.విద్యానికేతన్, పెదతుమ్మిడి
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
త్రాగునీటి సౌకర్యం[మార్చు]
స్థానిక ఉన్నత పాఠశాల రహదారిలో ఉన్న బావి, 110 సంవత్సరాలుగా గ్రామస్థులకు నీటిని అందించుచున్నది. త్రాగడానికి ఈ నీరు అనుకూలంగా లేకపోయినప్పటికీ మిగతా అవసరాలకు గ్రామస్థులు ఈ నీటిని ఉపయోగించుచున్నారు. ఈ బావి స్వరూపాన్ని చూసిన ఎడల, ఈ బావిని ఏర్పరచినవారు ఎంతో ముందుచూపుతో ఈ బావిని నిర్మించినారని తెలియుచున్నది. పాత బావులన్నిటిలో మట్టివరలే కనిపించుచున్నవి. ఈ బావిని అడుగుభాగాన్ని ఇటుకలతో నిర్మించారు. ఇటీవలికాలంలోని బావులన్నిటికీ సిమెంటు వరలనే ఉపయోగించుచున్నారు. కానీ ఈ పురాతన బావిలో అడుగునుండి ఇటుకల కట్టుబడి కనిపించుచున్నది. నీటి ఊట (జల) బయటకు వచ్చేటందుకు అక్కడక్కడా ఖాళీలు ఉన్నాయి. ఏ క్షణాన తోడినా చల్లని నీరు బయటకు వస్తుంది. బొల్లావారికి చెందిన ఈ బావి ఇప్పటికీ చెక్కుచెదరకుండా నీటిని అందించుచున్నది. ఇటీవల బొల్లా ఛారిటబుల్ ట్రస్ట్ వారు, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేసి ఈ బావినీటిని శుద్ధిచేసి అందించుచున్నారు. ఈ నీరు సరిపోకపోవడంతో దీని అంచున ఒక బోరువేసి, ఆ బోరునీటిని బావిలో నిలువచేసి, శుద్ధిచేసి అందించుచున్నారు. [7]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం[మార్చు]
స్థానికంగా పునఃప్రతిష్ఠించిన ఈ ఆలయంలో 2015, ఫిబ్రవరి-8, ఆదివారం నాడు, విగ్రహాల పునఃప్రతిస్ఠా కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ, అత్యంత వైభవంగా నిర్వహించారు. వేలాదిమంది భక్తుల "హరహర మహాదేవ" అను నినాదాల మధ్య, స్వామి అమ్మవారి విగ్రహాలతోపాటు, వీరభద్రుడు, భద్రకాళి, మాఘబంధం, ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహాలతోపాటు, నవగ్రహాలను గూడా ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనం సందడిగా సాగినది. అర్చకుల వేదఘోష మధ్య, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, బంటుమిల్లి మండలంతోపాటు, పరిసర మండలాలకు చెందిన వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. [3] ఈ ఆలయంలోని లింగాకారస్వామివారికి రజత జటాజూటం సమకూరినది. స్థానిక ప్రముఖులు శ్రీ మట్టా నాగబాబు, విజయలక్ష్మి దంపతులు 4 కిలోగ్రాముల వెండితో దీనిని తయారుచేయించి, 2015, నవంబరు-16వ తేదీ సోమవారంనాడు, స్వామివారికి సమర్పించారు. శివుని ఆకారం, దానిపైన నాగసర్పంతో కూడిన జటాజూటాన్ని తయారుచేయించి సమర్పించారు. [5] ఈ ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాలు, 2016, ఫిబ్రవరి-24వ తేదీ నుండి 26వ తేదీ వరకు వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ మూడు రోజులూ ప్రత్యెక పూజాకార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా 26వ తేదీ శుక్రవారంనాడు స్వామివారి శాంతికళ్యాణం నిర్వహించెదరు. [6]
శ్రీ కళ్యాణ కోదండరామాలయం[మార్చు]
గ్రామంలోని సత్యనారాయణపురంలోని ఈ పురాతన ఆలయం శిథిలమవడంతో, దానిని తొలగించి నూతన ఆలయాన్ని నిర్మించారు. పునర్నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2015, మార్చ్-23వ తేదీ సోమవారం నాడు, పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. 25వ తేదీ బుధవారం ఉదయం 11-36 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. [4]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, చేపల పెంపకం.
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కలెక్టర్ శ్రీ కాంతిలాల్ దండే.
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 6,112 - పురుషుల సంఖ్య 3,042 - స్త్రీల సంఖ్య 3,070 - గృహాల సంఖ్య 1,818
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6909.[2] ఇందులో పురుషుల సంఖ్య 3491, స్త్రీల సంఖ్య 3418, గ్రామంలో నివాస గృహాలు 1807 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Bantumilli/Pedatummidi". Archived from the original on 16 నవంబర్ 2015. Retrieved 3 July 2016. Check date values in:
|archive-date=
(help); External link in|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు విజయవాడ; 2014, ఆగస్టు-19; 9వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015, ఫిబ్రవరి-9; 3వ పేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015, మార్చ్-26; 5వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015, నవంబరు-17; 5వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-26; 5వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2016, ఏప్రిల్-6; 3వపేజీ.