పొదలకూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పొదలకూరు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో పొదలకూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో పొదలకూరు మండలం యొక్క స్థానము
పొదలకూరు is located in ఆంధ్ర ప్రదేశ్
పొదలకూరు
ఆంధ్రప్రదేశ్ పటములో పొదలకూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°22′00″N 79°44′00″E / 14.3667°N 79.7333°E / 14.3667; 79.7333
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము పొదలకూరు
గ్రామాలు 36
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 68,148
 - పురుషులు 34,215
 - స్త్రీలు 33,933
అక్షరాస్యత (2011)
 - మొత్తం 61.36%
 - పురుషులు 70.21%
 - స్త్రీలు 52.39%
పిన్ కోడ్ {{{pincode}}}

పొదలకూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524 345., ఎస్.టి.డి.కోడ్ = 08621.

ఇక్కడి నుంచి నెల్లూరు 29 కీ.మీ, సైదాపురం 25 కీ.మీ, రాపురు 30 కీ.మీ, కలువాయి 40 కీ.మీ. సంగం నుంచి 25 కి.మి.

దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ కామాక్షీతాయి సమేత తామలింగేశ్వరస్వామివారి దేవాలయం:- 16వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మించబడిన ఈ దేవాలయంలో, మహాశివరాత్రి ఉత్సవాలు, శివరాత్రి ముందురోజున ప్రారంభమగును. ఆ రోజు అంకురార్పణ, ధ్వజారోహణ, రావణసేవతో కార్యక్రమాలు మొదలగును. శివరాత్రి రోజు నందిసేవ, మహాశివరాత్రి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించెదరు. ఈ ఆలయం పూర్తిగా శిథిలమైనది. రు. ఒక కోటి అంచనా వ్యయంతో పునర్నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయశాఖవారే గాక, దాతలు, భక్తుల నుండి గూడా నిధులు సమకూర్చుకొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. [1] & [8]
  2. శ్రీరామమందిరం:- పొదలకూరు పట్టణం నడిబొడ్డున ఉన్న రామమందిరం వద్ద, ఎన్నో సంవత్సరాలుగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలు, ఈ సంవత్సరం, 2014,ఏప్రిల్-8, మంగళవారం నుండి ప్రారంభమైనవి. 14వ తేదీ, సోమవారం నాడు, శ్రీ సీతారాముల కళ్యాణం, అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు, ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు, పొదలకూరు పట్టణ ప్రజలేగాక, చుట్టుప్రక్కల గ్రామాల నుండి గూడా, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. [2]
  1. శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం:- పొదలకూరు మారుతినగరులో వెలసిన ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి వేడుకలు (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. స్వామివారికి ఆకుపూజ, హోమాలు, భజనలు నిర్వహించెదరు. అర్చకులు సహస్రనామార్చన, రుద్రాభిషేకాలు, లక్ష తమలపాకు అర్చనలు మొదలైనవి వేడుకగా నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. రాత్రికి స్వామివారి గ్రామోత్సవం నిర్వహించెదరు. ఈ ఆలయంలో 2014, జూలై-8, మంగళవారం నాడు, పట్టణ కమ్మజనసేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదానం ఏర్పాటుచేసారు. హనుమజ్జయంతి జరిగిన తరువాత ప్రతి మంగళవారం, పది వారాలపాటు, ఒక్కో సామాజికవర్గం వారు, స్వామివారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుచున్నది. ఈ కార్యక్రమానికి సోమవారం నుండియే, ఆలయ ప్రాంగణంలో రకరకాల విద్యుద్దీపాలతో అలంకరణ, భారీ కటౌట్లు ఏర్పాటు చేసారు. పోటాపోటీగా చేసే వీరాంజనేయస్వామివారి ఉత్సవాలలో కమ్మజనసేవాసమితి ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఈ కార్యక్రమానికి పట్టణప్రజలేగాక, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు భారీగా తరలివచ్చారు. [3] & [5]
  2. గంగమ్మ దేవాలయం:- పొదలకూరులోని శివాలయం వీధిలో, ఈ దేవాలయం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. [6]
  3. పొదలకూరులోని శివాలయం వీధిలో ఒకే ప్రాంగణంలో శివాలయం, వెంకయ్యస్వామి ఆలయం, అయ్యప్పస్వామి ఆలయం, పోలేరమ్మ ఆలయం, సిద్ధేశ్వరస్వామి ఆలయం ఉండటంతో ఆధ్యాత్మికత ఉట్టిపడుచున్నది. [7]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 68,148 - పురుషులు 34,215 - స్త్రీలు 33,933

మూలాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తెనాలి నిర్మలమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

కోడ్స్[మార్చు]

వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:-

గ్రామాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[5] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, జూలై-9; 2వ పేజీ. [6] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014,జులై-11; 2వపేజీ. [7] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, జూలై-17; 1వ పేజీ. [8] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, ఆగస్టు-8; 1వ పేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=పొదలకూరు&oldid=2122957" నుండి వెలికితీశారు