సైదాపురం (సైదాపురం)
Jump to navigation
Jump to search
సైదాపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°10′00″N 79°44′00″E / 14.1667°N 79.7333°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు |
మండలం | |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 524407 |
ఎస్.టి.డి కోడ్ |
సైదాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సైదాపురం మండల కేంద్రం.ఇది రెవెన్యూయేతర గ్రామం
ఉనికి[మార్చు]
సైదాపురం 14.16670 ఉత్తర రేఖాంశం, 79.73330 తూర్పు అక్షాంశం వద్ద ఉంది..
ప్రత్యేకతలు[మార్చు]
- సైదాపురం మండల కేంద్రం. ఈ మండలంలో 80 కి పైగా గ్రామాలు గలవి.
- సైదాపురంలో ఉన్నత విద్యకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సి.ఎ.ఎం.ఉన్నత పాఠశాల ఉంది.
- ఉన్నత విద్య అభ్యసించుటకు ఇండర్మీడియట్ కాలేజ్, బి.యి.డి కాలేజ్ ఉన్నాయి.
- ఈ ప్రాంతం మైకా గనులకు భారతదేశంలో ప్రసిద్ధి చెందింది.
- ఈ ప్రాంతమునకు దగ్గరగా ఉన్న పట్టణాలు గూడూరు, పొడలకూర్, రాపూర్, వెంకటగిరి.
- ఈ మండలం వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం పరిధిలోనిది.
- ఈ గ్రామంలో జనాభా సుమారు పది వేలకు పైగా ఉంటుంది. అందులో చాలా మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం .
- సైదాపురం దగ్గరలో కైవల్యా నది ప్రవహిస్తున్నది.
- సిద్ధార్థ మందిరం సైదాపురానికి 2 కి.మీ దూరంలో గలదు. ప్రతి సంవత్సరం నవంబరు నెలలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.
- ఇక్కడ అంజాద్, అఫ్సర్, చిన్నతనంలో చదువుకున్నారు. ఇక్కడి నుంచి నెల్లూరు 50 కీ.మీ, పొదలకూరు 25 కీ.మీ,రాపురు 22 కీ.మీ, గూడూరు 13 కీ.మీ. సైదాపురం దగ్గర కైవల్య నది వున్నది, ఇక్కడ వర్షం బాగా కురిసినప్పుడు వరద ప్రవహం వల్ల ఇతర ఉళ్ళకు ప్రయనించటం కష్టం.