Jump to content

ఉదయగిరి

అక్షాంశ రేఖాంశాలు: 14°52′41.77″N 79°17′58.88″E / 14.8782694°N 79.2996889°E / 14.8782694; 79.2996889
వికీపీడియా నుండి
(ఉదయగిరి @ కొండాయపాలెం నుండి దారిమార్పు చెందింది)
ఉదయగిరి
ఉదయగిరి దుర్గం
ఉదయగిరి దుర్గం
పటం
ఉదయగిరి is located in ఆంధ్రప్రదేశ్
ఉదయగిరి
ఉదయగిరి
అక్షాంశ రేఖాంశాలు: 14°52′41.77″N 79°17′58.88″E / 14.8782694°N 79.2996889°E / 14.8782694; 79.2996889
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలంఉదయగిరి
విస్తీర్ణం42.68 కి.మీ2 (16.48 చ. మై)
జనాభా
 (2011)[1]
15,870
 • జనసాంద్రత370/కి.మీ2 (960/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు8,011
 • స్త్రీలు7,859
 • లింగ నిష్పత్తి981
 • నివాసాలు3,814
ప్రాంతపు కోడ్+91 ( 08620 Edit this on Wikidata )
పిన్‌కోడ్524236
2011 జనగణన కోడ్591640


ఉదయగిరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం లోని గ్రామం, ఇది మండల కేంద్రం. ఇది శాసనసభ నియోజకవర్గానికి కూడా కేంద్రం . ఇది సమీప పట్టణమైన బద్వేలు నుండి 56 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3814 ఇళ్లతో, 15870 జనాభాతో 4268 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8011, ఆడవారి సంఖ్య 7859. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2463 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 546. గ్రామ లొకేషన్ కోడ్ 591640.[2]

ఉదయగిరి నెల్లూరుకు వాయవ్యాన 96 కి.మీ దూరములో ఉంది. 14వ శతాబ్దంలో విజయనగర రాజులు కట్టించిన కోట శిథిలాలకు ప్రసిద్ధి. ఇక్కడ 938 మీ ఎత్తైన సంజీవ కొండ వైద్య సంబంధిత వనమూలికలకు ప్రసిద్ధి. ఈ గిరిలో 365 దేవస్థానాలు 101 కోనేరులు ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఉదయగిరిలో పల్లవుల, చోళుల కాలం నాటి దేవాలయాలు ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

చరిత్రలో ఉదయగిరి పట్టణ తొలి ప్రస్తావన 14వ శతాబ్దంలో కనిపిస్తుంది. ఒడిషా గజపతుల సేనాని అయిన లాంగుల గజపతి ఉదయగిరిని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు. 1512లో ఉదయగిరి కృష్ణదేవరాయల పాలనలోకి వచ్చింది. కోట చాలా దిశలనుండి శత్రు దుర్భేద్యమైనది. దీన్నీ తూర్పు వైపున ఉన్న అడవి బాట ద్వారా లేదా పశ్చిమం వైపున ఉన్న కాలిబాట ద్వారానే ముట్టడించే అవకాశమున్నది. సంవత్సరకాలం పాటు జరిగిన కోట దిగ్భంధనం ఫలితంగా ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరి కోటను కోల్పోయాడు.

గజపతుల పాలనలోనూ ఆ తర్వాత విజయనగర పాలనలోనూ కోటను విస్తరించాడు. మొత్తం పట్టణాన్ని, దానిని ఆనుకుని ఉన్న వెయ్యి అడుగుల ఎత్తున్న కొండ చుట్టూ పటిష్ఠమైన గోడకట్టించారు. కోటలో మొత్తం నిర్మాణాలు ఉన్నాయి. అందులో 8 కొండపైన, 5 దిగువన ఉన్నాయి. కోటలో అనేక ఆలయాలు, తోటలు కూడా ఉండేవి.

ఈరాజ్యమొకప్పుడు భోగభాగ్యములతో తులతూగుతూ ఉండేది. పండితులు, కవులు, గాయకులు పలువురు ఈరాజ్యానికి వన్నె తెచ్చారు. ఇప్పుడు పూర్వవైభవమంతాపోయింది. పూర్వవైభవాన్ని సంరింపజేసే ఉదయగిరికొండ, ఉదయగిరిదుర్గము మాత్రమూ ఉన్నాయి. కలివి కర్రతో చక్కని చెంచాలూ, చిన్నవీ పెద్దవీ, నేడు ఈకడి శిల్పులు తయారుచేస్తున్నారు. చేతికర్రలు, పాంకోళ్ళు, కవ్వాలు, గరిటెలు-అన్నీ కర్రవే ఇప్పటికీ తయారు చేస్తున్నారు.

విజయనగర సామ్రాజ్యము స్థాపించినప్పటినుంచీ అనగా 14వశతాబ్దము మొదటిభాగంనుంచీ ఉదయగిరి రాజప్రతినిధి ఉండే స్థలముగా ఏర్పాటైనది. ఉదయగిరి రాజ్యములో నేటి నెల్లూరు కడప జిల్లాలు చేరాయి. ఉదయగిరి రాజ్యమునకే ములికనాడు అని పేరు. అనాటి కవులూ, వారు వ్రాసిన కావ్యాలూ పెక్కు ఉన్నాయి. సమిరకుమారవిజయం రచించిన పుష్పగిరి తిమ్మన్న ఆత్మకూరుతాలూకావాడు. విక్రమార్క చరిత్రం వ్రాసిన వెన్నలకంటి సిద్ధనకు జక్కన కవి కృతి ఇచ్చెను. ఈ సిద్ధనమంత్రి ఉదయగిరి రాజ్యమున మత్రిగా ఉండెను.

ఉదయగిరి దుర్గమునేలే బసవరాజు మంత్రియైన గంగన్నకు దుగ్గనకవి తాను రచించిన నాసికేతూపాఖ్యానము కృతి ఇచ్చెను. ఈకాలమున ఉదయగిరి దుర్గము విజయనగరరాజుల చేతులలో నుండి గజపతుల చేతులలో పడెను. బసవరాజే గజపతుల తరుపున ఉదయగిరి దుర్గమును స్వాధీనము చేసుకొని తన యేలుబడిలో నుంచుకొనెనట. ప్రబోధచంద్రోదయమును రచించిన మల్లనసింగనలు పై గంగన్నకే తన కావ్యమును కృతి ఇచ్చిరి. దూబగుంట నారాయణకవి తాను రచించిన పంచతంత్రమును పై బసవరాజుకు అంకితమిచ్చెను. ఉదయగిరి రాజ్యము సంగీతవిద్యలో కూడా పేరు తెచ్చుకొన్నది. అచ్యుతరాయ రామరాయల కాలములలో ఉదయగిరి రాజ్యమునకు రాజప్రతినిధగా రామామాత్యుడుండెను. ఇతడు సర్వమేళకళానిధి అనే ప్రసిద్ధ సంగీత గ్రంథంను రచించెను. దానిని రామరాయలకు అంకితమిచ్చెను. ఇతనికి వాగ్గేయకారతోడరుమల్లు అను బిరుదు ఉంది. అక్బరు కాలమున ఆర్థికమంత్రిగా నుండిన తోడరుమల్లు చూపిన ప్రతిభవంటి ప్రతిభను ఇతడు మంత్రిగానుండి చూపుటచేత, సర్వకళానిధి రచించుటవల్లనూ ఈబిరుదు ఇతనికి ఇచ్చిరట.ఉదయగిరి గ్రామమునకు కొండాయపాలెం అని పేరుకూడ.

ఉదయగిరి కొండమీద ఒక ఆలయమున్నది. దానికి వల్లభరాయ దేవాలయమని పేరు. వల్లభరాయడను మంత్రి దానిని నిర్మించెనట. దేవాలయము పక్కన చక్కని కోనేరు ఉంది. ఈ వల్లభరాయుడు శ్రీకృష్ణదేవ రాయల ప్రతినిధి యట. క్రీదాభిరామంశ్రీనాధుడు వల్లభరాయని పేర వ్రాసినట్లున్నూ, ఆ వల్లభరాయడు ఉదయగిరిసీమలోని మోపూరు గ్రామమున వెలసిన భైరవస్వామి భక్తుడనిన్నీ శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వ్రాసియున్నారు. ఈ ఇద్దరు వల్లభరాయలు ఒకరేనని పరిశోధకులు చెప్పుదురు.

రావూరుతాలూకా మొలకలపుండ్లకు కొద్ది దూరంలో ఒక కొండ ఉంది. దానిని సిద్ధులయ్యకొండ అంటారు. దానిపై గుహాలయమొకటి ఉంది. ఆలయములో మూడు ప్రతిమలున్నవి. ఒకప్రతిమ నవకోటిసిద్ధుల పేరను, రెండవ ప్రతిమ నవనాధసిద్ధుల పేరను, మూడవది సారంగధరుని పేరను ప్రసిద్ధిచెంది యున్నవి. పై సిద్ధులు కొండపై తపస్సు చేసుకొనుచుండగా సారంగధరుడు వారిని దర్సించుకోవడానికి పోయినాడట. ఈ సారంగధరుడొక సిద్ధుడు.

గ్రామ నామ వివరణ

[మార్చు]

ఉదయగిరి అనే గ్రామనామం ఉదయ అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. ఉదయ అన్న పదం సాదృశ్యబోధకసూచి[3]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ప్రభుత్వ ఆర్ట్స్/సైన్స్ డిగ్రీ కళాశాల

[మార్చు]

ఏ.ఆర్.ఆర్.ప్రభుత్వ జూనియర్ కళాశాల

[మార్చు]

ఇంకా గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 15, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఏడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ఉంది. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది.

సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నెల్లూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఉదయగిరిలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో9 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఐదుగురు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు, ఇద్దరు నాటు వైద్యులు ఉన్నారు. 10 మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఉదయగిరిలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఉదయగిరిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 1688 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 578 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 12 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 50 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 1633 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 25 హెక్టార్లు
  • బంజరు భూమి: 37 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 245 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 73 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 234 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఉదయగిరిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 142 హెక్టార్లు
  • చెరువులు: 92 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ఉదయగిరిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, సజ్జలు

ప్రముఖులు

[మార్చు]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  • శ్రీ కృష్ణ, ఆంజనేయస్వామి దేవాలయము.

ఉదయగిరి గ్రామ విశేషాలు

[మార్చు]

ఉదయగిరి ఐ.సి.డి.ఎస్.ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ ప్రాజెక్టులో ప్రతి సంవత్సరం లగానే, 2020-ఆగస్టు మొదటివారంలో నిర్వహించిన "తల్లిపాల వారోత్సవాల నిర్వహణ" కార్యక్రమంపై తీసిన డాక్యుమెంటరీ చిత్రాన్ని "బి.పి.ఎస్.ఐ" సంస్థకు పంపించగా, ఆ సంస్థ వారు, ఊదయగిరి కేంద్రాన్ని ఊత్తమ ఫీడింగ్ కేంద్రంగా గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం 3 కేద్రాలను ఉత్తమ కేంద్రాలుగా గుర్తించగా, వాటిలో ఉదయగిరి కేంద్రం ఒకటి. [1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 233. Retrieved 10 March 2015.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉదయగిరి&oldid=4280075" నుండి వెలికితీశారు