దర్గాహ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసంలో ఒకటి కంటే ఎక్కువ సమస్యలున్నాయి. దీన్ని మెరుగుపరచడంలో తోడ్పడండి. లేదా ఈ సమస్యల గురించి చర్చ పేజీలో చర్చించండి. (ఈ మూస సందేశాలను తీసెయ్యడం ఎలాగో తెలుసుకోండి)
|
సూఫీ తత్వము, తరీకా |
---|
పోర్టల్ |
దర్గాహ్, (పర్షియన్ : درگه) (తెలుగులో సాధారణంగా 'దర్గా' అని వ్యవహరిస్తారు), ఒక సూఫీ క్షేత్రము, లేదా సూఫీ సమాధి, లేదా ఔలియా సమాధి. వీటికి ఖాన్ ఖాహ్ అనీ ఆస్తానా అనీ పిలుస్తారు. వీటిలో సాధారణంగా మస్జిద్, మదరసా పొందుపరచబడియుంటుంది. ఇంకనూ వైద్యశాలలు, సామాజిక సౌకర్యాలను కలుగజేసే సంస్థలూ వుంటాయి. ఈ ఖాన్ ఖాహ్ యొక్క అధిపతిని (పీఠాధిపతిని) సజ్జాదా అని వ్యవహరిస్తారు. ఈ క్షేత్రాలను దర్శించుటను జియారత్ అని అంటారు.దర్గాహ్ అనే పదానికి మూలం పర్షియన్ భాషా పదం 'దర్గాహ్', అర్థం 'గృహం' లేదా 'నివాసం' లేదా 'గృహద్వారం'. సాధారణంగా తవస్సుల్ (తసవ్వుఫ్ సిద్ధాంతం) ప్రకారం, సమాధులలో నిదురించేవారి (ఔలియాల) ఆశీస్సులు పొందడం కోసం, వారి సమాధుల వద్ద జియారత్ చేయడం ఓ ఆనవాయితీ. ఈ దర్గాహ్ లు భారతదేశంలోనే గాక ప్రపంచంలోని పెక్కు ముస్లిం దేశాలలోనూ, ముస్లింలు గల ఇతరదేశాలలోనూ కానవస్తాయి. ఇరాక్ లోని అలీ ఇబ్న్ అబీ తాలిబ్ సమాధి, హుసేన్ ఇబ్న్ అలీ సమాధి, బాగ్దాదు లోని అబ్దుల్ ఖాదిర్ జీలాని సమాధి, పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ లోనూ, 'పర్షియన్ ప్రభావంగల ఇస్లామిక్ దేశాలలో' "ఔలియాల సమాధులు" ఎక్కువగా కానవస్తాయి.దక్షిణాసియా దేశాలలోనూ, ఆఫ్రికా దేశాలలోనూ 'దర్గాహ్'లు కానవస్తాయి. ఈ ఔలియాల జయంతి ఉత్సవాలను ఉర్సు లేదా మీలాద్ రూపంలో జరుపుకుంటారు. ఈ ఔలియాల ద్వారా అల్లాహ్ అనేక కరామత్లు చూపిస్తాడు.
దర్గాహ్ ల జియారత్ (సందర్శన)
[మార్చు]ఇస్లాంలో సమాధులను సందర్శించడం నిషేధం కాదు. అందులోనూ పుణ్యపురుషుల సమాధుల సందర్శన నిషేధంగాదు.సమాధులను సందర్శించే అసలు కారణం మానవులలో 'మరణం' భావన తీసుకు రావడం. లేదనగా మానవుడు ఈ లోకంలోనే అనంతమైన జీవితం గడపాలనే ఆలోచనతో ప్రపంచం వైపు పరుగెత్తి, అధర్మాల పాలవుతాడు. ఏనాటికైనా మనమందరమం మరణిస్తామనే ఆలోచన రేకెత్తిస్తే, అతడి జీవితం కుదుటపడి, న్యాయ ధర్మమార్గాన్ని ఆచరించుటకు ప్రయత్నిస్తాడు. మానవులు 'పుట్టుట గిట్టుట కొరకే' అన్న సత్యాన్ని గ్రహించినపుడు, పాప కర్మములనుండి దూరంగా వుంటూ సత్యమైన జీవితాన్ని గడుపుటకు ఉద్యుక్తుడౌతాడు. అల్లాహ్ను గ్రహిస్తాడు. ధర్మమార్గాన వచ్చి తీరుతాడు.ఔలియాల దర్గాహ్ ల సందర్శన అసలు కారణం ధార్మిక చింతన పెంపొందించడం, పెద్దవారి చరిత్రలను గుర్తుంచుకొని, వారు నడచిన ధార్మిక మార్గాలలో నడచి అల్లాహ్ను ప్రసన్నం చేసుకోవడం, మగ్ ఫిరత్ (మోక్షం) పొందడం.ఇక్కడకు వచ్చిన భక్తులను, వారి బాధలను, ఆరోగ్య సమస్యలను భూత ప్రేత గ్రహబాధలను వీరు సమాధి నుండే తొలగించి రక్షిస్తారని ప్రజల విశ్వాసం. ఆరోగ్య సమస్యలు, పిచ్చిపట్టినవారు, మానసిక ప్రశాంతత లేనివారు ఇక్కడ కొన్ని రోజులు ఉన్నట్లయితే మంచివారుగా మారుతారని నమ్మకం.ఉరుసు ఉత్సవంలో ముస్లింలతో పాటు హిందువులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. హిందువులు ముస్లిం సోదరులచే నమాజు చదివించి బెల్లం, మిఠాయిలు, జిలేబీలు, గులాబీలు, మల్లెపూలు సమాధుల వద్ద సమర్పిస్తారు. దర్గాలోకి వెళ్లేవారు హిందువులైనా తలపై దస్తీ ధరించి, విభూతి బొట్టు పెట్టుకొని అచట పూజలు (నమాజు) నిర్వహిస్తూం టారు.దర్గాలో నిర్వహించే ఉరుసు ఉత్సవంలో గంధం తీసుకురావడం ఒక ప్రత్యేక కార్యక్రమం. సుగంధ పరిమళాలు, గులాబీలతో కలిపిన గంధాన్ని తీసుకుని వచ్చేటప్పుడు భక్తులు వేల సంఖ్యలో గుమిగూడతారు. పవిత్ర గ్రంథాన్ని మోసుకొని వస్తున్న వ్యక్తిని, అతని తలపై ఉన్న గంధాన్ని తాకడానికి అధిక సంఖ్యలో పోటీ పడతారు. గంధాన్ని స్పృజించిన భక్తులు పునీతులవుతారని నమ్మకం. గంధాన్ని తీసుకుని వచ్చేటప్పుడు గుర్రం చేసే నాట్యం అందరినీ ఆకర్షిస్తుంది. ముస్లింలు, హిందువులు ధరించిన రంగురంగుల దుస్తులు, వారు పూసుకున్న సెంట్, అత్తరుల వాసనలతో ఊరు ఊరంతా గుబాళిస్తుంది. ఔలియాల దర్గాల వద్దకు వెళ్ళినపుడు ఏమి ఆచరించవచ్చును? వేటి కొరకు నిషేధాలున్నవి? ఆచరణీయాలు:
- దర్గాహ్ లు ప్రశాంతతకు, ఆత్మపరమైన శాంతికి నిలయాలు. దర్గాహ్ ల (ఔలియాల సమాధుల) వద్దకు పిల్లలూ పెద్దలూ పురుషులూ అందరూ వెళ్ళవచ్చును.
- సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచవచ్చును.
- సమాధులలో ఉన్నవారి మగ్ ఫిరత్ కొరకు, అల్లాహ్తో 'దుఆ' (ప్రార్థన) చేయవచ్చును.
- సమాధులలో ఉన్నవారి పేర్ల దాన ధర్మాలు చేయవచ్చును.
- ఔలియాల 'మాధ్యమాల'తో అల్లాహ్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించనూ వచ్చు.
- హదీసుల ప్రకారం సమాధులలో ఉన్నవారికొరకు ఖురాన్ పఠించవచ్చును.
- ఔలియాలు గౌరవనీయులు, వారినీ వారి సమాధులనూ గౌరవించవలెను
- ఔలియాల సమాధులకు సాష్టాంగ ప్రమాణాలు చేయవచ్చు
- ఔలియాలతో (సమాధులలో వున్న పీర్లు) నోములు (మన్నత్ లు) నోచవచ్చు
- ఔలియాలతో ప్రార్థనలు చేయవచ్చు. అన్ని ప్రార్థనలు ఆలకించువాడు, తీర్చువాడు అల్లాహ్ ఒక్కడే.
- ఔలియా సమాధుల చుట్టూ 'తవాఫ్' (ప్రదక్షిణ) లు చేయవచ్చు
- ఔలియాల సమాధుల వద్ద స్తోత్తం చేస్తూ ఎల్లవేళలా మన్ ఖబత్లు పాడుకుంటూ వుండిపోవచ్చు.
- ఔలియాల సమాధులే మనకు సర్వస్వం, అల్లాహ్ ను పొందుటకు ఇవే గృహద్వారలు .
- ఔలియాల పేరున తావీజులు, తాయెత్తులు ధరించవచ్చు. కారణం ఔలియాలు అసలు ఇస్లాంను నెర్పిస్తారు. ఇలాంటి మూఢ, అంధవిశ్వాసాలను దూరం చేయడానికే 'ఔలియాలు' పనిచేశారు. తిరిగీ 'ఔలియా'ల పేరుతో ఈ మూఢవిశ్వాసాలను నెలకొల్పి, ఔలియాలకు చెడ్డపేరు తేకూడదు.
ప్రతి ముస్లిం తన వంశంవారి సమాధులను సందర్శించి వారి కొరకు, తల్లిదండ్రుల కొరకు ప్రార్థనలు చేయడం, వారి పేర్ల మీద దాన ధర్మాలు చేయడం సముచితం.
దర్గాహ్ ల వద్ద కానవచ్చే ఆచారాలు
[మార్చు]సాధారణంగా క్రింది ఆచారాలు కానవస్తాయి. కొన్నిటిని అందరు ముస్లిములూ అంగీకరిస్తారు, కొన్నిటిని కొందరు అంగీకరిస్తారు. సూఫీ తరీకాను పాటించేవారు కూడా అన్ని ఆచారాలను అంగీకరించరు. దేవ్ బందీయులైనతే చాలా వాటికి నిరాకరిస్తారు.
- ఉర్సు - చూడండి ఉర్సు
- సందల్ - లేదా గంధం. ఉర్సుకు ఒక రోజు ముందు దర్గాలో ఆచరించే గంధపు ఆచారం. గంధాన్ని ఓ కలశంలో తీసుకెళ్ళి, దర్గాలోని సమాధిపై చల్లి శ్రద్ధాంజలి ఘటించడం.
- మన్నత్ - నోము నోయడం. అల్లాహ్ పేరుతోనే నోము నోయాలి. కానీ గురువుల ఆశీశ్శుల ద్వారా అల్లా వద్దకు తమ కోరికలను విన్నవించే ఒక సూఫీ ఆచార ప్రక్రియ.
- నియాజ్ - మన్నత్ లు పూర్తయితే, ధన్యవాదాలర్పిస్తూ తమ శ్రద్ధను చాటిచెప్పే ఒక సాంప్రదాయం.
- ఖవ్వాలీ - చూడండి ఖవ్వాలీ
- కందూరు : కందోరీ అని కూడా అంటారు, అనగా "నోము" లేదా "మొక్కుబడి" (నియాజ్ - మన్నత్) నోచి తీర్చుకునే సంబరం, లేదా వలీ (పీరు, సూఫీ గురువు) అల్లాహ్ సాన్నిధ్యాన్ని చేరుకునే సందర్భాన జరుపుకునే సంబరం.
- ఊదాని : ఊద్ (సాంబ్రాణి) ను బొగ్గు కణికలలో కాల్చి సుగంధాన్ని గాలిలో (వాతావరణంలో) వెదజల్లడం లేదా వదలడం. అనగా మనం సాంబ్రాణిలా కాలి ఇతరులకు సుగంధాన్ని, మంచి వాతావరణాన్ని, మంచి ఆలోచనలను కలుగ జేయాలి, ఇదొక సింబాలిక్ విషయం.
దర్గాల వద్ద ఉపయోగించే పదజాలము
[మార్చు]- ఉర్సు - చూడండి ఉర్సు
- సందల్ - గంధం
- పీర్ - గురువు
- ముర్షిద్ - గురువు
- ముజావర్ లేదా ముజావిర్ - దర్గాలలో సమాధుల వద్ద కూర్చుని ఫాతిహా ఖ్వానీ (చదివింపులు) చదివే వాడు.
- మజార్ - సమాధి - గోరీ, కబ్ర్
- గిలాఫ్ - సమాధిపై కప్పే ఒక దుప్పటి లాంటిది. దానిపై డిజైనులు, ఖురాను వాక్యాలు, వ్రాయబడి వుంటాయి.
- ఫాతిహా - ఖురాన్ లోని మొదటి సూరా సూరయే ఫాతిహా ఒకసారి, సూరయే ఇఖ్లాస్లు మూడు సార్లు చదువుతారు. ఆ తరువాత మంచి జరగాలని దుఆ (ప్రార్థనలు) చేస్తారు.
- తబ్రుక్ లేదా తబర్రుక్ - ఫాతిహా ఖ్వానీ ఐన తరువాత పంచబడే పదార్థాలు (ముఖ్యంగా తీపి పదార్థాలు౦౦
- ఆస్తానా - గురువుల కుటీరాన్ని గాని, గురు-శిష్యులు కూర్చునే ఇంటిని గానీ ఆస్తానా అని వ్యవహరిస్తారు.
- తరీకా - చిష్తియా, ఖాదరియా, నక్షబందీ, సుహార్వర్దీ తరీకాలు
- మోర్చల్ - నెమలి ఈకలతో తయారు చేయబడిన ఒక దండం.
- ఊద్ - సాంబ్రాణి
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- మూలాలు లేని వ్యాసాలు
- Wikipedia neutral point of view disputes from డిసెంబరు 2021
- All Wikipedia neutral point of view disputes
- మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు from డిసెంబరు 2021
- మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు
- Articles with multiple maintenance issues
- భారతదేశంలో ఇస్లాం
- సూఫీ తత్వము
- తసవ్వుఫ్
- దర్గాలు