విశ్వోదయ కళాశాల
స్థాపితం | 1950 |
---|---|
స్థానం | కావలి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | పట్టణ ప్రాంతం |
విశ్వోదయ కళాశాల కావలి పట్టణంలోని ప్రసిద్ధి వహించిన విద్యాసంస్థ. 1950లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం ఇంజనీరింగ్, వైద్యం, మేనేజ్ మెంట్, ఔషధ విజ్ఞానశాస్త్రం వంటి వివిధ వైద్యసంస్థలకు మూలసంస్థగా భాసిస్తోంది.
నేపథ్యం
[మార్చు]దొడ్ల రామచంద్రారెడ్డి లలిత కళలకు పూర్వఔన్నత్యం తీసుకురావాలని, అన్యాయాలను, అక్రమాలను అరికట్టాలని, మానవత్వపు విలువలు పెంచాలని ఆశయాలు కలిగిన వ్యక్తి. ఈ ఆశయాలకు చేయూతగా సమాజంలో ఉత్తమ విలువలు, ఆదర్శాలు కలిగిన విద్యావంతులు తయారుకావాలని, దానికి విద్యాసంస్థ స్థాపన తొలిమెట్టుగా భావించి విశ్వోదయ ప్రారంభించారు. ఈ సంస్థ ఏర్పాటు, సంస్థ ఆశయాల రూపకల్పనలో పాకాల వెంకట రాజమన్నారు, బెజవాడ రామచంద్రారెడ్డి, టాంపో, పుచ్చలపల్లి హరిశ్చంద్రారెడ్డి, తిక్కవరపు రామిరెడ్డి, దొడ్ల వెంకటరామిరెడ్డి వంటి వారు ఉన్నారు. డి.రామచంద్రారెడ్డికి ప్రజావైద్యుడు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి(డాక్టర్ రామ్), కవి, పండితుడు ఎస్.వి.భుజంగరాయశర్మ వంటి వారు సంస్థ ఏర్పాటు విషయంలో ప్రోత్సాహించారు.[1] సంస్థ ఏర్పాటు వెనుకనున్న ఆశయాలను, లక్ష్యాలను కవిగా భుజంగరాయశర్మ ఇలా కవితారూపాన్నిచ్చారు:
మానవుని మనస్సుకు హద్దులు చెరపాలనీ
పగగొన్న కోడెత్రాచు కోరలనుండి అమృతం పిండాలనీ
గాయపడిన గుండెలకు చందనం పూయాలనీ
గాలినిండా కళల పరిమళం పూరించాలనీ
ఏవో ఆశలు, ఏవేవో మధురాశలు!
చరిత్ర
[మార్చు]1950 మార్చి నెలలో దొడ్ల రామచంద్రారెడ్డి(డి.ఆర్.) విశ్వోదయ కళాశాలను ప్రారంభించారు.
మూలాలు
[మార్చు]- ↑ నా జ్ఞాపకాలు:వకుళాభరణం లలిత:ఎమెస్కో బుక్స్:2012