బి.బాలభాస్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమెరికా ఆర్థిక దౌత్యవేత్తగా తొలి తెలుగు వ్యక్తి. హైదరాబాద్‌లో ప్రాంతీయ పాసుపోర్టు అధికారిగా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖలో లాటిన్ అమెరికన్, కరేబియన్ తదితర 39 దేశాలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పలు దేశాల్లో భారతీయ ఉప కార్యదర్శిగా పనిచేశారు. గతంలో బాలభాస్కర్ గల్ఫ్ దేశాల్లో పనిచేసిన కాలంలో అక్కడి తెలుగువారికి ఎన్నో విషయాల్లో అండగా నిలిచారు. వాణిజ్య సంబంధాలను మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషించారు. 1997లో జెడ్డాలోని భారత రాయబార కార్యాలయ కమర్షియల్ కౌన్సిలర్‌గా వెళ్లినపుడు ఆ దేశంలో అమల్లో ఉన్న భారతీయ ఔషధాలపై నిషేధాన్ని ఎత్తివేయించటంలో కీలక పాత్ర పోషించారు. ఆ దేశంలోకి భారతీయ ఫార్మా కంపెనీలకు అనుమతి వచ్చేలా కృషి చేశారు. సౌదీలో ఉండే సుమారు 10 లక్షల మంది భారతీయుల సౌలభ్యం కోసం 'ఇండియా న్యూస్' అనే పత్రికను భారత రాయబార కార్యాలయంలో ప్రారంభించడమే గాకుండా దానికి మూడేళ్లు ఎడిటర్‌గా పనిచేశారు. వివిధ కారణాల వల్ల అక్కడి జైళ్లలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావటంలో అక్కడి న్యాయవ్యవస్థతో పోరాటం చేశారు. 2000 సంవత్సరం పాలస్తీనా రాయబారిగా పనిచేస్తున్న కాలంలో ఒకసారి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో చిక్కుకున్నారు. అరాఫత్‌ తోపాటు ఒక రోజంతా బంకర్‌లో గడపాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో పాస్‌పోర్టు అధికారిగా పనిచేసిన కాలంలో దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతివారం పారుపోర్టు అదాలత్ ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లా కావలి ఆయన స్వస్థలం.

మూలాలు[మార్చు]