గోపవరం (ముసునూరు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గోపవరం (ముసునూరు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముసునూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,252
 - పురుషుల సంఖ్య 3,186
 - స్త్రీల సంఖ్య 3,066
 - గృహాల సంఖ్య 1,697
పిన్ కోడ్ 521 207
ఎస్.టి.డి కోడ్ 08656


గోపవరం కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 207., యస్.టీ.డీ.కోడ్ = 08656. [1]

APvillage Gopavaram 1.JPG

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామానికి దగ్గరలో బలివే తిరుణాళ్ళు జరిగే ఊరు ఉన్నందున దీనిని బలివే గోపవరం (బలేగోపారం) అనికూడా అంటారు. పెదపాటివారి గూడెం దీని శివారు గ్రామము.

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 16 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో దేవరగుంట, తుక్కులూరు, కొర్లగుంట, మోర్సపూడి, రామన్నగూడెం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

నూజివీడు, అగిరిపల్లి, బాపులపాడు, లింగపాలెం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ధర్మాజీగూడెం, నూజివీడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 47 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు పాఠశాల.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫొన్ నం. 08656/227227.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ నందిగం శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను, అనకాపల్లి లోక్‌సభ సభ్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తన స్వంత నిధులతో నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, 2017,మే-7వతేదీ ఆదివారంనాడు, దాత శ్రీ శ్రీనివాసరావు దంపతులు, వారి కుటుంబసభ్యులు యఙం చేసారు. 8వ తేదీ సోమవారంనాడు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. [4]

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ఈ వూరిలో పుగాకు, మామిడి ప్రధానమైన పంటలు. ఇంకా కూరగాయలు, (కనకాంబరం)ఫూలు, వరి, కొబ్బరి, ప్రొద్దు తిరుగుడు వ్యవసాయం కూడా జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో పామాయిల్ సాగు పెరుగుతున్నది. చుట్టుప్రక్కల అడవి భూముల్లో జీడిమామిడి తోటలు బాగా ఉన్నాయి. వ్యవసాయం ప్రధానంగా కరెంటు బావులద్వారా జరుగుతున్నది. చెరువులక్రింద కొద్దిపాటి వ్యవసాయం ఉంది.

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

ఈ గ్రామవాసియైన శ్రీ కోటగిరి హనుమంతరావుగారు ఈ గ్రామ సర్పంచిగా 1966 నుండి 1981 వరకూ 17 ఏళ్ళు పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజాభిమానం మెండుగా ఉన్న ఆయన, 1983, 1985, 1989, 1994 లలో నూజివీడు శాసనసభ్యునిగా పోటీచేసి వరుసగా విజయం సాధించారు. [2]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 6,252 - పురుషుల సంఖ్య 3,186 - స్త్రీల సంఖ్య 3,066 - గృహాల సంఖ్య 1,697;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6134. ఇందులో పురుషుల సంఖ్య 3139, స్త్రీల సంఖ్య 2995, గ్రామంలో నివాసగృహాలు 1614 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1566 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Musunuru/Gopavaram". Retrieved 21 June 2016.  External link in |title= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013,జులై-12; 8వపేజీ. [3] ఈనాడు అమరావతి/నూజివీడు; 2016,డిసెంబరు-2; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2017,మే-9; 15వపేజీ.