పెదపాటివారి గూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదపాటివారి గూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముసునూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 505213
ఎస్.టి.డి కోడ్

పెదపాటివారి గూడెం, కృష్ణా జిల్లా, ముసునూరు మండలం కి చెందిన ఒక చిన్న గ్రామము. [1] ఇది గోపవరం గ్రామం దగ్గరలో, గోపవరం, వేల్పుచెర్ల మధ్యలో, రహదారికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.

APvillage Pedapatigudem 1.JPG

వ్యవసాయం ఇక్కడ ముఖ్యమైన వృత్తి. వూరిలో కొంతభాగం సారవంతమైన 'పాటి నేల' (నల్లటి నేల) అయినందున బహుశా ఈ వూటికి ఈపేరు వచ్చి ఉండవచ్చును. పాటినేలలో పుగాకు బాగా పండుతుంది. ఆ వూరి పుగాకు చాలా నాణ్యమైనదని ఆ వూరివారు చెప్పుకుంటారు. తక్కిన భాగం ఇసుక పొర ఉన్న ఎర్రనేల. ఇక్కడ కూరగాయలు, మామిడి, జీడిమామిడి, కొబ్బరి పండిస్తారు. కొద్దిపాటి వరి సాగు ఉంది. ఒక చిన్న చెరువు ఉంది కాని భూగర్భజలాలే ప్రధాన నీటివనరు. ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]