పాలడుగు వెంకట్రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాలడుగు వెంకట్రావు
పాలడుగు వెంకట్రావు చిత్రం
జననం1940 నవంబర్ 11
మరణం2015 జనవరి 19
హైదరాబాదు
మరణ కారణంక్యాన్సర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కాంగ్రెస్ పార్టీ రాజకీయనాయకులు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు
శాసన మండలి సభ్యులు
రచయిత
దాత
జీవిత భాగస్వామిసుశీల
తల్లిదండ్రులుపాలడుగు లక్ష్మయ్య
నాగరత్నమ్మ

పాలడుగు వెంకట్రావు భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయనాయకుడు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా వ్యవహరించారు.రెండు సార్లు నూజివీడు ఎమ్మెల్యేగా పనిచేసారు.

జీవిత విశేషాలు

[మార్చు]

పాలడుగు వెంకట్రావు 1940 నవంబర్ 11న కృష్ణా జిల్లా మునలూరు మండలం గోగులంపాడులో జన్మించారు. తండ్రి వామపక్ష భావాలు కలిగి ఉన్నా వెంకట్రావు మాత్రం కాంగ్రెస్ వైపే ఆకర్షితులయ్యారు. 1968లో యువజన కాంగ్రెస్లో చేరడంతో ఆయన రాజకీయప్రస్థానం ప్రారంభమైంది. 1972లో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ఆరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. 1978లో నూజివీడు నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పాలడుగు అంజయ్య కేబినెట్లో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆ మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1989లో మళ్లీ నూజివీడు నుంచి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన నేదురుమల్లి జనార్ధనరెడ్డి కేబినెట్లో పౌరసరఫరాలమంత్రిగా పనిచేశారు. 2007 నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.[1]

సోషలిస్టు వాదిగా

[మార్చు]

కాంగ్రెస్ లో ఉన్న కొద్దిమంది సోషలిష్టు నేతల్లో పాలడుగు వెంకట్రావు ఒకరు. స్వతహాగా పాలడుగు ధనవంతుడు, భూస్వామి అయినప్పటికీ ఆ దర్పం ప్రదర్శించకుండా సామన్య జీవితం గడిపేవాడు. ప్రజలకు సేవచేయటంలోనే అసలైన ఆనందం ఉందని ఆస్తులను పక్కనబెట్టేశాడు. సోషలిస్టు విధానాలు పాటించే పాలడుగు పిల్లలను కూడా వద్దనుకుని జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. తన ఆస్తులు కూడా ప్రజలకే చెందేలా వ్యవహరించారు. ఇలాంటి మంచి మనిషి మరణం పట్ల కాంగ్రెస్ నేతలు విచారం వ్యక్తం చేశారు. –

రచయితగా

[మార్చు]

పాలడుగు వెంకట్రావు గారు "నాటి త్యాగం-నేటి స్వార్థం- రేపటి?" అనే పేరిట ఓ పుస్తకాన్ని రాశారు. ఉక్కు మనిషి కాకాని వెంకటరత్నం అడుగుజాడల్లో నడిచిన నిజమైన శిష్యుడు పాలడుగు. అంతేకాదు,, నైతిక విలువలను, నీతి నిజాయితీలను తన జీవితంలో ఆచరించి చూపిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారాయన. పాలడుగు విప్లవకారుడు కాకపోయినా విప్లవాభిమాని, పేదలకు భూ పంపిణీ చేయాలని ఎన్నో పోరాటాలు చేసిన పోరాటయోధుడనే చెప్పొచ్చు..

దాతగా

[మార్చు]

పాలడుగు వెంకట్రావు ఆయన నివాస గృహాన్ని ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి "రైతు సేవా కేంద్రం" (కిసాన్ భవన్) స్థాపించుటకు జనవరి 20 2009 న దానం చేసారు. ఆయన ఈ కిసాన్ భవనాన్ని (వ్యవసాయ పరిశోధనా కేంద్రం) ఆయన తల్లిదండ్రులైన పాలడుగు లక్ష్మయ్య, నాగరత్నమ్మ గార్ల కిసాన్ భవనంగా నామకరణం చేసారు.దీనిని పార్లమెంటు సభ్యులు సచిన్ పైలట్ ప్రారంభించారు.[2]

మరణం

[మార్చు]

ఆయన కేన్సర్ వ్యాధితో బాధపడుతూ 2015 జనవరి 19 న కన్నుమూసారు.[3]

మూలాలు

[మార్చు]
  1. Senior Congress leader Paladugu passes away
  2. "Paladugu donates house for Kisan Bhavan". G.V.R. Subba Rao. ద హిందూ. 2009-01-21.
  3. Congress leader Paladugu Venkata Rao passes away at 75

ఇతర లింకులు

[మార్చు]