మేకా రంగయ్య అప్పారావు

వికీపీడియా నుండి
(ఎం.ఆర్. అప్పారావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఇదే పేరు గల ఇతర వ్యక్తుల కొరకు అయోమయనివృత్తి పేజీ అప్పారావు చూడండి.

మేకా రంగయ్య అప్పారావు
Sri Raja Rangayyapparao (SRR), Vijayawada (cropped).jpg
ఎస్.ఆర్.ఆర్.కళాశాలలో రాజా రంగయ్య అప్పారావు విగ్రహం
జననం21 మార్చి 1915
నూజివీడు, కృష్ణా జిల్లా
మరణం31 జనవరి 2003
నివాసంనూజివీడు
ఇతర పేర్లుఎం.ఆర్.అప్పారావు
తల్లిదండ్రులు
  • వెంకటాద్రి అప్పారావు (తండ్రి)
  • రామయ్యమ్మ (తల్లి)

ఎం.ఆర్. అప్పారావుగా ప్రసిద్ధిచెందిన నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన ఇతని పూర్తి పేరు మేకా రంగయ్య అప్పారావు విద్యావేత్త, మాజీ మంత్రి, శాసనసభ్యుడు.

ఇతను కృష్ణా జిల్లా నూజివీడు గ్రామంలో 1915 మార్చి 21 న రాజా మేకా వెంకటాద్రి అప్పారావు, రామయ్యమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం నూజివీడు, మచిలీపట్నం నోబుల్ కళాశాల, మద్రాసు క్రైస్తవ కళాశాల, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు లలో సాగింది.

ఇతను నూజివీడు శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా 1952, 1957, 1962, 1967 మరియు 1972లలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా గెలుపొందాడు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాలలో కొంతకాలం సాంస్కృతిక, అబ్కారీ శాఖామాత్యులుగా సేవలందించాడు. ఆ తరువాత రాజ్యసభకు ఎన్నికయ్యాడు. అప్పారావు, బెజవాడ గోపాలరెడ్డి, పి.వి.జి.రాజు ల సమకాలీకుడు. తొలిసారిగా 1952లో సి.పి.ఐ అభ్యర్థి దాసరి నాగభూషణరావును ఓడించి, శాసనసభకు ఎన్నికైన అప్పారావు, 1989లో ఒక్క సారి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి పాలడుగు వెంకట్రావు చేతిలో ఓడిపోయిన తరుణం తప్ప మరెన్నడూ ఎన్నికలలో ఓటమి చవిచూడలేదు.

అప్పారావు టెన్నిసు ఆటగాడు.ఇతని తండ్రి తెలుగులోకి అనువదించిన గీతా గోవిందాన్ని ఆంగ్లంలోకి మార్చాడు. ఉమర్ ఖయ్యాం, రుబాయిత్ లను గేయ రూపంలో రాశారు. చంద్రగుప్త, యాంటిగని నాటకాలు రాశాడు. అప్పారావు 1974 నుండి 1980 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశాడు.[1] నూజివీడులో ధర్మ అప్పారావు కళాశాలను ప్రారంభించాడు.[2]

ఎన్నో సాహిత్య, సాంస్కృతిక సంస్థలకు సాయమందించిన ఈయన జనవరి 31, 2003న పరమపదించారు.

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి

వెలుపలి లంకెలు[మార్చు]