దాసరి నాగభూషణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దాసరి నాగభూషణ రావు కమ్యూనిస్టు నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

మార్క్సిజం ప్రభావితుడై విప్లవ రాజకీయాలకు జీవితం అంకితం చేసిన దాసరి నాగభూషణరావు 1925 సంవత్సరంలో నూజివీడు తాలూకా దిగవల్లి గ్రామంలో జన్మించాడు. అతను విద్యార్థి దశ నుంచే విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేసేవారు. అనంతరం వామపక్ష పార్టీల భావాలకు ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీల సంఘాల్లో చేరి చురుకుగా పని చేశాడు. అతని నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో భూపోరాటం నిర్వహించి పేదలకు భూములు పంచడం జరిగింది.

అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిరుపేదల పక్షాన నిలిచి భూపోరాటాల ద్వారా విజయం సాధించిన గొప్ప విప్లవ యోధుడు. అఖిల భారత విద్యార్థి సంఘానికి, ప్రపంచ విద్యార్థి సమాఖ్యకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాడు. నూజివీడు తాలూకా కమ్యూనిస్టు కార్యదర్శిగా పనిచేస్తూ ఆ ప్రాంతంలో 20వేల ఎకరాలకు పైగా భూమిని దళితులు, బీసీలకు పంపిణీ చేయడంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించాడు. [2]

కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు, మాలెంపాటి బాలభాస్కరరావు ఆధ్వర్యాన చల్లపల్లి జమిందార్‌ భూములను పేదలకు పంచాలని చేసిన భూపోరాటంలో దాసరి నాగభూషణరావు కూడా అగ్రభాగాన నిలిచాడు. అతను రాజ్యసభ సభ్యునిగా ఉన్నకాలంలో అన్ని ప్రాతాలకు నిధులు కేటాయించిన నాయకునిగా కీర్తింపబడ్డాడు. [3]

కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్న పరిపూర్ణను ఇష్టపడి రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకుడుగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన దాసరి నాగభూషణరావు కోరి చేసుకొన్నపెళ్లిచేసుకున్నాడు.[4]

అతను 2008 ఏప్రిల్ 27న మరణించాడు. అతను 1997లో వీలునామా రాసాడు. దానిలో స్వగ్రామంలో తనకు గల రెండు ఎకరాల భూమిలో సిపిఐ రాష్ట్ర సమితికి, చండ్ర రాజశ్వేరరావు ఫౌండేషన్ కు చెరో ఎకరం చొప్పున రాసిచ్చాడు. మార్గదర్శిలో డిపాజిట్ చేసిన లక్ష రూపాయలను తెలంగాణ అమర వీరులకు, మరో సంస్థకు చెరి సగం చొప్పున రాశాడు.[5]

సంస్మరణ

[మార్చు]

విజయవాడ నగరంలోని హనుమాన్‌పేటలో నిర్మితమవుతున్న ఐదు అంతస్థుల నగర, జిల్లా సమితి నూతన కార్యాలయ భవనానికి అమరజీవి దాసరి నాగభూషణరావు భవన్‌గా నామకరణం చేయాలని సి.పి.ఐ విజయవాడ నగర కార్యదర్శివర్గం నిర్ణయించింది. [6]

మూలాలు

[మార్చు]
  1. "దాసరి నాగభూషణరావు సతీమణి కన్నుమూత - Eenadu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-07-02.
  2. "భూపోరాట యోధుడు దాసరి | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Retrieved 2020-07-02.
  3. admin (2019-04-28). "పోరాట యోధుడు 'దాసరి'". TodayNewsHub (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-02.
  4. "బతుకు దారిలో వెలుగు చూసిన నంబూరి పరిపూర్ణ (వ్యాసం )-కాత్యాయనీ విద్మహే |". vihanga.com. Retrieved 2020-07-02.
  5. Staff (2008-04-29). "సిపిఐ నేత 'దాసరి' అంత్యక్రియలు". telugu.oneindia.com. Retrieved 2020-07-02.
  6. "Visalaandhra Daily Telugu News Paper -విజయవాడలో సి.పి.ఐ నూతన కార్యాలయానికి 'దాసరి నాగభూషణరావు భవన్‌' గా నామకరణం". 54.243.62.7. Archived from the original on 2020-08-14. Retrieved 2020-07-02. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)