Jump to content

గీతం (పాట)

వికీపీడియా నుండి
(గీతము నుండి దారిమార్పు చెందింది)
భారతీయ సంగీతం
వ్యాసముల క్రమము
సాంప్రదాయక సంగీతం

కర్ణాటక సంగీతము  · హిందుస్థానీ సంగీతము
భారత ఫోక్ సంగీతం  · తుమ్రి · దాద్రా · గజల్ · ఖవ్వాలీ
చైతీ · కజ్రీ · సూఫీ

ఆధునిక సంగీతము

భాంగ్రా · చలన చిత్ర సంగీతము
పాప్ సంగీతం · రాక్ సంగీతం · బ్లూస్ సంగీతం
 · జజ్ సంగీతం · ట్రాన్స్ సంగీతం

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

హిందుస్థానీ సంగీత విద్వాంసులు
కర్ణాటక సంగీత విద్వాంసులు

గాయకులు

హిందుస్థానీ సంగీత గాయకులు
హిందుస్థానీ సంగీత గాయకులు

సంగీత వాద్యాలు

సంగీత వాద్యపరికరాల జాబితా
సంగీత వాయిద్యాలు

భావనలు

రాగము · తాళము · పల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన
మేళకర్త రాగాలు · కటపయాది సంఖ్య
జానపదము

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము
గ్రామఫోను · రేడియో

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము
కర్ణాటక సంగీతము

గీతము సంగీత రచనలలో చాలా ముఖ్యమైనది. సంగీత ప్రపంచములో "గీతము" అను పదమునకు వేరు వేరు స్థానము గలదు. గీతము లోని సంగీతము చాలా ఇంపుగాను, సులభంగాను ఉండును. రాగ భావ ముట్టిపడుచుండును. లయ ఒకేరీతిన నడచును. గీతమునకు పల్లవి, అనుపల్లవి, చరణం అను భాగములు లేవు. సంగతులు ఉండవు. చాల కష్టమైన సంచారములుండవు. కాని రాగ స్వరూపము బాగుగా చెవులగట్టును. లయ సామాన్యము. స్వర భాగములోని ప్రతి స్వరమునకును సరియైన అక్షరము సాధారణముగా సాహిత్య భాగములో నుండును. సాహిత్య భాగము దైవ భక్తి, గీతమును ఆపక, మొదటి నుండి చివరి వరకు నిలుపక పాడుటయే గీతమును పాడు పద్ధతి.కొన్ని గీతములలో అర్థము లేని పదములు వాడములు కొన్ని వాడబడినవి. వీటివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాని గీత రచయితలు వీటిని తమ తమ గీతములలో వాడిన గీతము శోభించునను తలంపుతో వాడిరి.

వీటిని "గీతాలంకారములు" అని అనుటయు ఉంది. కొన్ని ప్రసిద్ధి సంస్కృత శ్లోకములకు గీతములుగా పరివర్తనము చేసి సంగీతములో వాడుకొనుట ఉంది. ఉదాః; భైరవ రాగములో "శ్రీ రామచంద్రా" యును, నాట రాగమునందు "అమరీ కబరీ" యును

గీతము భాష సాధారణముగా సంస్కృతము, కన్నడము, భాండీర భాష, వాగ్గేయకారూ సంస్కృతములో రచనలు రచించుచుండిరి. కాని కొంత కాలము తరువాత ప్రాకృతములో ఒక భేదమైన భాండీర భాషలో రచించుట మొదలు పెట్టిరి. ఇంకా కొద్ది కాలమునకు ఇతర భాషలలో రచనలు రచింపబడినవి. ఇతర భాషలలో రచనలు ప్రారంభమైన వెనుక భాండీర భాషలో తగ్గిపోయినవి.

గీతములు, స్వరావళులు జంట వరుసలు మొదలగుగా గల రచనలు అలంకారముల వలన చేర్చుకొనిన తరువాత, నేర్చుకొనదగినవి. గీతములు, సప్త తాళములు, వ్యాప్త రూపములలో కూడా రచింపబడినవి.

రకాలు

[మార్చు]

గీతములు రెండు తెగలు: (1) సామాన్య గీతములు (2) లక్షణ గీతములు

ఏ తెగకు చెందిన గీతమైనను పైన చెప్పబడిన లక్షణములనే కలిగి ఉండును. సామాన్య గీతమునకును, లక్షణ గీతములకును సాహిత్య భాగములో మాత్రము తేడాలుండును. సామాన్య గీతముల యొక్క సాహిత్యము ఏదో ఒక దైవముమి ప్రార్థించుటో, వర్ణించుటో నగును. కాని లక్షణ గీతములోని సాహిత్యము ఆ గీతము ఏ రాగములో రచించబడినదో ఆ రాగము యొక్క లక్షణమును తెలుపును.అనగా ఆ గీతము యొక్క రాగము మేళకర్త రాగమా లేదా జన్య రాగమా, దాని పేరు జన్య రాగమైనచో అది జనించిన మేళకర్త పేరు, ఉపాంగమా, భాషాంగమా, భాషాంగమైతే అన్యస్వరమెద్ది, వక్రమా, వర్జమా, న్యాస స్వరమెద్ది, జీవస్వరమెద్ది, ఔఢవమా, షాఢవమా, లేక సంపూర్ణమా అను మొదలగు ప్రతీ అంశమును సాహిత్యమునందు కాననగును.

లక్షణ గీతములు

[మార్చు]

లక్షణ గీతములు చాలా రాగములలో రచింపబడినవి.ప్రసిద్ధ రాగములలో చాలా గలవు. అప్రసిద్ధ రాగములలో కొన్నింటిలో మాత్రము లక్షణ గీతములు రచించబడినవి.ప్రాచీన కాలమందు గురుకులాశ్రమమున శిష్యుడు విద్యనభ్యసించుచుండెను. తాలపత్రములలోకొంత విషయములు వ్రాసియున్నప్పటికీ యిప్పటి వలె వేలకు వేల గ్రంథములు తయారగుటకు యిప్పటి అచ్చు వసతులు లేవు. కనుకనే కొన్ని అంశములు అనగా సంస్కృత శబ్దములు, అమరము వంటివి గురువు శిష్యునికి నోటితో లక్ష్య లక్షణములు నేర్చుచూ వచ్చెను అదే రీతిన సంగీతమునందును రాగ లక్షణములు సంగీత విద్యార్థులకు లక్షణ గీతముల ద్వారా నేర్పబడినవి.

72 మేళకర్త రాగాలు, వాటి చట్టము తయారుచేసిన మహాశయుడు 72 రాగములలో లక్షణ గీతములు రచించి యున్నారు. ఇది సంగీత ప్రపంచమున అఖండసేవ. కాని ఇవి ప్రస్తుతం విలువ కోల్పోయినవి.

పై 72 రాగాంగ రాగ లక్షణ గీత మొక్కొక్కటిని మూడు భాగములుగా భాగించి వాటికి సూత్రఖండామనియు, ఉపాంగ ఖండమనియు, భాషాంగ ఖండమనియు వ్రాసెను. సూత్ర ఖండాములోని సాహిత్యము ఆ రాగాంగ రాగము యొక్క స్వరములు, వాటి వికృతి భేదములు, ఏ చక్రమునకు చెందినది, దాని వరుస సంఖ్య మొదలగు విషయములు మాత్రమే చర్చింపబడినవి. ఉపాంగ ఖండములో పై రాగాంగ రాగములో జన్మించు ఉపాంగ రాగముల పట్టిక వ్రాయబడింది. భాషాంగ ఖండమందు భాషాంగ రాగముల పట్టిక వ్రాయబదును. పై గీతములలో వ్రాయబడిన ఉపాంగ రాగములలో కొన్ని ఇప్పుడు భాషాంగములైనవి. కొన్ని రాగములు ఇపుడు ఉపయోగమునందు లేవు.

గీత రచయితలు

[మార్చు]

గీతములను రచించుట, గీతములు పాడుట ఒకప్పుడు చాల గొప్ప విద్వత్తుగా నెంచబడుచుండెను. పైడాల గురుమూర్తి శాస్త్రి అను వాగ్గేయకారులు 1000 గీతములు రచించినందున వెయ్యి గీతాల పైడాల గురుమూర్తి శాస్త్రి అను బిరుదును పొందెను. గీవింద దీక్షితులు, వెంకటముఖి, గోవిందాచార్యులు, రామామాత్యుడు, పురందరదాసు మున్నగు వారు గీతముల రచించిన మహాశయులు

పురందరదాసుల వారు ప్రారంభములో నేర్చుకొను పిళ్ళారీ గీతములు రచించారు. ఈ గీతములు విఘ్నేశ్వరునీ, మహేశ్వరునీ, విష్ణువును కొలుచు గీతములు. ఘన రాగ గీతములు అను నాట, గౌళ, ఆరభి, శ్రీ, వరాళి అను రాగములలో గీతములు రచింపబడినవి.

రాగమాల గీతమని కొన్ని రాగములలో రాగమాలికను పోలిన ఒక గీతమున్నది. ప్రబంధముల వలె రచింపబడిన గీతము గీత ప్రబంధము. గీత ప్రకరణములో లక్షణ గీతములు కూడా వ్రాయబడినవి.

యివికూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గీతం_(పాట)&oldid=3808846" నుండి వెలికితీశారు