Jump to content

రాగమాలిక

వికీపీడియా నుండి
భారతీయ సంగీతం
వ్యాసముల క్రమము
సాంప్రదాయక సంగీతం

కర్ణాటక సంగీతము  · హిందుస్థానీ సంగీతము
భారత ఫోక్ సంగీతం  · తుమ్రి · దాద్రా · గజల్ · ఖవ్వాలీ
చైతీ · కజ్రీ · సూఫీ

ఆధునిక సంగీతము

భాంగ్రా · చలన చిత్ర సంగీతము
పాప్ సంగీతం · రాక్ సంగీతం · బ్లూస్ సంగీతం
 · జజ్ సంగీతం · ట్రాన్స్ సంగీతం

వాగ్గేయకారులు, సంగీత విద్వాంసులు

హిందుస్థానీ సంగీత విద్వాంసులు
కర్ణాటక సంగీత విద్వాంసులు

గాయకులు

హిందుస్థానీ సంగీత గాయకులు
హిందుస్థానీ సంగీత గాయకులు

సంగీత వాద్యాలు

సంగీత వాద్యపరికరాల జాబితా
సంగీత వాయిద్యాలు

భావనలు

రాగము · తాళము · పల్లవి
తాళదశ ప్రాణములు
షడంగములు · స్థాయి · స్వరము
గీతము · కృతి · వర్ణము
రాగమాలిక · పదము · జావళి · తిల్లాన
మేళకర్త రాగాలు · కటపయాది సంఖ్య
జానపదము

సంగీత ధ్వనులు

స్థాయి · తీవ్రత · నాదగుణము
ప్రతిధ్వని · అనునాదము
సహాయక కంపనము
గ్రామఫోను · రేడియో

సంగీత పద నిఘంటువు

సంగీత పదాల పర్యాయ పదములు

భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము
కర్ణాటక సంగీతము

మాలిక అనగా మాల లేదా హారము అని అర్థము. హారము రంగు రంగుల పుష్పములచే అందముగా కట్టబడి యుండును. చూచుటకు కన్నులకు సొంపుగా నుండును.అదే రీతిన రాగమాలిక కూడా రాగముల యొక్క హారము. ఒక్కొక్క అంగము (పల్లవి, అనుపల్లవి మొదలగునవి) ఒక్కొక్క రాగములో రచించబడి రచన యొక్క నడకను గానీ భావమును గాని చెడపక, సౌందర్యమును పెంపొందించునట్లు రచింపబడిన రచన రాగమాలిక

లక్షణము

[మార్చు]

రాగమాలిక అనునది ప్రత్యేక సంగీత రచన. తాళము మారక రాగము మాత్రము అంగ అంగమునకు మారుచుందు రచన రాగమాలిక. పల్లవి, అనుపల్లవి, కొన్ని చరణములుండును. నాలుగు రాగముల కంటే తక్కువ రాగములతో రాగమాలిక ఉండుట అరుదు. అనగా కనిష్ఠము రాగమాలికకు నాలుగు రాగములుండవలెను. కొన్ని రాగమాలికలలో అనుపల్లవి లేకుండుటయు ఉంది. ఒక్కొక్క రాగము తరువాత ఆ రాగ చిట్టస్వరమును, తరువాత పల్లవిని అందుకొనుటకు వీలుగా నుండుట కొరకు పల్లవి రాగములోని చిట్టస్వరములోని కొంత భాగము నుండుట ఉంది. కాబట్టి ప్రతి రాగమును పాడిన తరువాత ఈ వంతెన చిట్టస్వరము వల్ల పల్లవిని అందుకొని పాడుట సులువగుచున్నది. కొన్ని రాగమాలికలలో చిట్టస్వరము లేకుండా యుండును. ఒక్కొక్క రాగము యొక్క పేరు సాహిత్యములోని పదములతో అర్థము చెడకుండా కూర్చి వారి నైపుణ్యమును చూపు రాగమాలికా రచయితలు కొందరు కలరు. కళ్యాణి రాగమయినపుడు "నిత్యాకళ్యాణీ నిగమాగమ సంచారిణీ" అని అర్థము చెడకుండా పొంకముగా నున్నది. కొన్ని రాగమాలికలలో రాగ నామములు సాహిత్యములో లేక యుండుట ఉంది. ఒక రాగము నుండి ఇంకొక రాగమునకు మారుట వల్ల రసములు మారినను, మార్పు చాల సునిశితముగా నుండునటుల రచయిత రచించును. ఒక్క రాగము నుండి ఇంకొక రాగమునకు మారునపుడు ఆ మార్పు మన చెవులకు ఎంతో క్రొత్త ఆనందమునిచ్చును. పెద్ద పెద్ద రాగమాలికలు కొన్ని భాగములుగా భాగింపబడి ఒక్కొక్క భాగము స్వతంత్రముగా ఉంచబడుచున్నవి. సాహిత్యము దైవ ప్రార్థనగాను రాజపోషకుని స్తోత్రముగాను లేక శృంగారముగాను ఉండవచ్చును.

కొన్ని రాగమాలికలు

[మార్చు]
  1. నిత్యకల్యాణి: ఎనిమిది రాగములు కగ రాగమాలిక. రచయిత సీతారామయ్య. ప్రతీ రాగపు చివర ఆయా రాగ చిట్టస్వరమును, దాని తరువాత రెండావర్తముల పల్లవి రాగ (కల్యాణీ) స్వరము ఉండుట వల్ల పల్లవి అందుకొనుట చాలా రమ్యముగా నుండును. ఎనిమిదవ రాగము భూపాలము అయిన తరువాత, పెద్ద చిట్టస్వరము ఉంది. ఆ చిట్ట స్వరములో మొదటి రాగము భూపాలము తరువాత రాగములు చివరి నుండి మొదటి రాగము వరకు రెండు రెండు ఆవర్తములుగా నుండి ఈ రాగమాలికకు అమితమైన శోభను కలిగించుచున్నది. ప్రతిరాగము యొక్క పేరును సాహిత్యములో నిమిడ్పబడియున్నది.
  2. అంబా నిన్ను నెరనమ్మితి: ఎనిమిది రాగముల రచన, చిట్టస్వరములు లేవు. శ్యామశాస్త్రులవారు రచించినట్లు తెలియుచున్నది.
  3. పన్నగేంద్రశయన: ఎనిమిది రాగముల రచన. స్వాతి తిరుణాళ్ గారు రచించింది.
  4. సానంతం: నాలుగు రాగముల రచన. చిట్టస్వరములు ఉన్నాయి. స్వాతి తిరుణాళ్ గారి రచన. రాగముల పేర్చు సాహిత్యమున కూర్చబడినవి.
  5. చతుర్దశ రాగమాలిక: 14 రాగముల రచన ముత్తుస్వామి దీక్షితులు గారు రచించింది.
  6. పక్షమాలిక: 15 రాగముల రచన.
  7. 72 మేళకర్త రాగమాలిక: మహావైద్యనాధయ్యర్ గారు రచించింది.
  8. 72 రాగాంగ రాగమాలిక: సుబ్బరామ దీక్షితులు, కృష్ణకవి గార్లు రచించింది.
  9. ఆరభిమానమ్‌ : తమిళము 16 రాగముల రచన. ట్రాక్విబార్ పంచనాదయ్య గారు రచించింది.
  10. శతరాగ రత్నమాలిక: త్యాగరాజులవారి అఖండ భిక్ష. 100 రాగములలో 100 కీర్తనలు.
  11. నక్షత్రమాలిక: శ్రీ స.చ.పార్థసారథి గారిచే రచింపబడింది. 72 రాగములచే అలంకరింపబడింది. లఘువు ఒక రాగములోను, రెండు దృతములు మరియొక రాగములోను రచింపబడింది.

రాగమాలిక రచననే కాక వర్ణములలోను, కీర్తనలలోను పలురాగములుండుట వలన రాగమాలికా వర్ణములు, రాగమాలికా కీర్తనలు అగుచున్నవి. జయ జయ గోకుల బాల అను తీర్థ నారాయణస్వామి గారి కీర్తన కురంజీ రాగములో సామాన్య మెట్టులో పూర్వులు పాడినప్పటికీ, ప్రస్తుతం రాగమాలికా కీర్తనగా పాడబడుచున్నది.

మనోధర్మ సంగీతములో కూడా మనము రాగమాలికను వినుచున్నాము. ఎట్లనగా శ్లోకములు పాడునపుడు రాగములను మార్చి గాయకుడు కొన్ని రాగములతో శ్లోకమును పెంచుచున్నాడు. ఇదియు రాగమాలికయే. తానమును ప్రస్తరించునపుడును, కల్పస్వరములు పాడునపుడును పలురాగములతో పాడిన యెడల అది రాగమాలిక యగుచున్నది.

తాళమాలిక

[మార్చు]

తాళము మారక రాగము మారి పలు రాగములతో నుండు రచన రాగమాలిగ. రాగము మారక తాళము అంగ అంగమునకు మారునది తాళమాలిక. ఇది మనో సంగీతములోనే సాధ్యము. కొన్ని పల్లవులను తిరుత్తియూర్ త్యాగయ్యరు గారు తాళమాలికగా పాడి తన సభా ప్రేక్షకులను ఆశ్చర్యింప జేయుచున్నారు.

రాగతాళమాలిక

[మార్చు]

ఒక్కొక్క అంగములోను తాళము, రాగము మార్పబదియుండు రచన రాగతాళమాలిక . దక్షిణ సంగీతములో రామస్వామి దీక్షితుల వారి 108 రాగతాళమాలిక ఒక్కటే యున్నది. ప్రతి భాగములోను సాహిత్యములో తాలము యొక్క యు రాగము యొక్కయు పేరు అతి సుందరముగా కూర్చబదినది. ఇటువంటి రచన రచించుట చాలా కష్టము.

సంగీత రచనలలో రాగమాలికా రచనము పొడుగు రచన.

యివి కూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాగమాలిక&oldid=3064273" నుండి వెలికితీశారు