హిందుస్తానీ సంగీత గాయకులు - ఘరానాలు

వికీపీడియా నుండి
(హిందుస్థానీ సంగీత గాయకులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

హిందుస్థానీ సంగీత గాయకులు - ఘరానాలు : హిందుస్తానీ సంగీతంలో ఘరానాలు ఉంటాయి. ఒక్కొక్క ఘరానా ఒక్కొక్క శాస్త్రీయ గాన శైలి మరియు పోకడలను కలిగి ఉంటుంది.

గ్వాలియర్ ఘరానా[మార్చు]

ఇది అన్నిటిలోకెల్లా పురాతనమైనది.ఇందులోని సుప్రసిద్ధ గాయకులు

కిరాణా ఘరానా[మార్చు]

కురుక్షేత్ర్ లోని కిరాణా, కరీంఖాన్ స్వస్థలం. ఇందులోని ప్రసిద్ధ గాయకులు: అబ్దుల్ కరీంఖాన్, (1872 - 1937) హీరాబాయి బరోడేకర్, బేగం అఖ్తర్, భీమ్‌సేన్ జోషి, గంగూబాయి హంగల్ మరియు ప్రభా ఆత్రే లు.

అత్రౌలి - జయపూర్ ఘరానా

ఇందులో అల్లాదియా ఖాన్ (1855 - 1943), మల్లికార్జున్ మన్సూర్, కేసర్ బాయి కేర్కర్, కిషోరీ అమోంకర్, శ్రుతి సడోలికర్, పద్మా తల్వార్కర్, మోగుబాయి కుర్దికర్ మరియు అశ్విని భిడె దేశ్ పాండేలు ప్రముఖులు.

ఆగ్రా ఘరానా[మార్చు]

ఇందులో ఉస్తాద్ ఫయాజ్ ఖాన్ (1886 - 1950), సి.ఆర్.వ్యాస్, ఎస్.ఎన్.రతన్ జన్‌కర్, మరియు జితేంద్ర అభిషేకిలు ప్రసిద్దులు.

పటియాలా ఘరానా[మార్చు]

అలీ బక్ష్ (1850 - 1920), మరియు ఫతే అలీ ఖాన్ (1850 - 19090) ఈ ఘరానాకు ఆద్యులు. ఐతే ప్రజల్లోకి తీసికెళ్ళి, దీనికి బాగా ప్రాచుర్యం కలుగజేసిన వాడు ఉస్తాద్ బడేగులాం అలీఖాన్ (1901 - 1969). చాలా గొప్పగా పాడే పండిట్ అజయ్ చక్రవర్తి మరియు పర్వీన్ సుల్తానాలు ఈ ఘరానాకు చెందిన వారే.

రాంపూర్ - సహస్వాన్ ఘరానా[మార్చు]

దీనిని స్థాపించినవాడు ఉస్తాద్ ఇనాయత్ హుసేన్ ఖాన్ (1849 - 1919).

మేవాతి ఘరానా[మార్చు]

దీనికి మూలపురుషుడు ఘగ్గె నాజిర్ ఖాన్.ఇందులో ఎక్కువగా విష్ణుతత్వ భజనలను ఆలపిస్తారు. ఇందులోని సుప్రసిద్ధ గాయకులు పండిట్ జస్రాజ్, మరియు అతని శిష్యులు సంజీవ్ అభయంకర్, రత్తన్ శర్మ లు.

భూండీ బజార్ ఘరానా[మార్చు]

ఇందులోని ముఖ్య గాయకులు ఉస్తాద్ అమాన్ అలీ ఖాన్ మరియు అంజనీబాయి మాల్పేకర్ లు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]