మండలము 1 (ఋగ్వేదం)

వికీపీడియా నుండి
(మండలము 1 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఒకటవ పరిచ్ఛేదం: ఋక్సంహిత

  • ఋక్ అనే శబ్దానికి స్తుతి అని అర్ధము. దేనిచేత దేవత స్తుతింపబడునో అదియే ఋక్. యజ్ఞాల నిర్వహణము కోసము ఏర్పడిన ఋక్కులు అనేక చోట్ల ఉన్న్ వాటిని ఒకే చోట చేర్చి, కూర్చ బడిన కూర్పుల సమూహనే ఋక్సంహిత అంటారు. ఋక్ అనగా వృత్త బంధం, పాద బంధముతో అర్ధ యుక్తముగా ఉన్నటువంటి ''మంత్రము'' అని అర్ధము.
  • ఋగ్వేదంలో మొదటి మండల ("సంహిత") 191 శ్లోకాలు ఉన్నాయి. ఋగ్వేదసంహిత (ఋక్సంహిత) యొక్క తాజా భాగాన్ని చాలా శాస్త్రీయంగా 10 మండలాలుగా విభజింప బడింది. దాని కూర్పు అనేది ప్రారంభ ఇనుప యుగం నాటిది. చరిత్రాత్మకమైన విలువ కలిగినది. ప్రతి మండలంలోను సూక్తం ఉంటుంది.[1]
  • ఋగ్వేదం యొక్కమొదటి మండల పరిచ్ఛేదం లో 191 శ్లోకాలు ఉన్నాయి. భారతీయుల సంప్రదాయము అనుసరించి, నిత్యము, సత్యము అయిన ఈ శబ్దరాశి మంత్రద్రష్ట లయిన మహర్షులకు దృగ్గోచరమయినది మాత్రమే కాని వారు మంత్ర రచయితలుగా రచించినది మాత్రము కాదు.[2]

ప్రారంభం[మార్చు]

  • ఈ ఋక్సంహిత అగ్నిమీడే పురోహితం అను అగ్ని సూక్తంతో ప్రారంభ మవుతుంది, సమానీవ ఆకూతి: అనే సంజ్ఞాన మంత్రముతో పూర్తి అవుతుంది. మిగిలినవి స్తుతి ప్రధానంగా ఆగ్ని, ఇంద్రుడు చిరునామాలు ప్రధానముగా కలిగి ఉంటాయి.
  • ఒక్కొక్క ఋషి దర్శించిన సూక్తాలను ఒక్క సముదాయముగా మొదటి మండలంలో 14 సూక్త సముదాయములు కూర్చబడ్డాయి. ఈ సూక్త సముదాయములలో సూక్తాలను అమర్చడం కూడా ఆయా సూక్తాల్లో స్తుతింపబడే దేవతలననుసరించే చేయబడింది.
  • మొదటి సూక్త సముదాయములో 11 సూక్తాలు ఉన్నాయి. మొదటి సూక్తం అగ్నిని, రెండవ సూక్తం వాయువు ని, మూడవది అశ్వినీదేవతలును, నాలుగవ సూక్తం నుండి 11వ సూక్తం వరకు ఇంద్రుడులను స్తుతిస్తున్నాయి.[2]

అందరికీ వందనాలు[మార్చు]

నమో మహాద్భ్యో నమో అర్భకేభ్యో నమో యువభ్యో నమ ఆశినేభ్యః |
యజామ దేవాన్ యది శక్నవామ మా జ్యాయసః శంసమ్ ఆ వృక్షి దేవాః || 1-027-13 [3]


పెద్దలకు, పిన్నలకు, యువకులకు, వృద్ధులకు నమస్కారము.
యజ్ఞములచేత దేవతలకు ప్రీతి కలిగించి నప్పటికీ,
పెద్దలకు, మనకన్నా గొప్పవారికి గౌరవాన్ని ఇవ్వడంలో
మాత్రము ఏమరుపాటు లేకుండా ఉందాం.[2]

అందరికీ ఆహ్వానము[మార్చు]

సుగః పన్థా అనృక్షర ఆదిత్యాస ఋతం యతే |
నాత్రావఖాదో అస్తి వః || 1-041-04 [3]
ఈశ్వరుని అన్వేషించడానికి ముళ్ళు, ఎత్తుపల్లాలు లేని రాజమార్గం
ఓ ! అన్వేషులారా ఈ వైదికవిజ్ఞాన మార్గములోకి రండి[2]

.

అందరికీ తండ్రి[మార్చు]

ఉద్ యంయమీతి సవితేవ బాహూ ఉభే సిచౌ యతతే భీమ ఋఞ్జన్ |
ఉచ్ ఛుక్రమ్ అత్కమ్ అజతే సిమస్మాన్ నవా మాటృభ్యో వసనా జహాతి || 1-095-07 [3]


ఈశ్వరుడు భూలోకద్యులోకాలలో ఉండే సమస్త ప్రాణులను
తండ్రిలా ఉద్దరించడానికి రెండు చేతులనూ చాచుతున్నాడు
ఈ రెండు లోకాలను కాపాడటమే అతని ధ్యేయం,
ఎవరు ఎలా భావిస్తే అతను అలాగే కనిపిస్తాడు[2]

కాలచక్రం[మార్చు]

ద్వాదశారం నహి తజ్ జరాయ వర్వర్తి చక్రమ్ పరి ద్యామ్ ఋతస్య |
ఆ పుత్రా అగ్నే మిథునాసో అత్ర సప్త శతాని వింశతిశ్ చ తస్థుః || 1-164-11 [3]
కాలమనే నిత్యమైన చక్రానికి
పన్నెండు ఆకులు (నెలలు) ఉన్నాయి.
నిరంతరం తిరుగుతూ ఉన్న ఈ చక్రానికి
ఏడువందలఇరవై మంది కుమారులు
(360 (పగళ్ళు) + 360 (రాత్రులు)=720) ఉన్నారు[2]

దేవుడు - జీవుడు[మార్చు]

ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షమ్ పరి షస్వజాతే |
తయోర్ అన్యః పిప్పలం స్వాద్వ్ అత్త్య్ అనశ్నన్న్ అన్యో అభి చాకశీతి || 1-164-20 [3]


రెండు పక్షులు (జీవాత్మ, పరమాత్మ) ఎల్లప్పుడూ ప్రేమగా
ఒక చోటనే ఒక చెట్టు (దేహము)నే ఆశ్రయించి నివసిస్తున్నాయి.
ఒకటి ఆ చెట్టున కాసిన ఫలాన్ని (కర్మఫలాన్ని) ఆస్వాదిస్తే
మరియొకటి (పరమాత్మ) తినకుండానే (కర్మఫలం
అనుభవము లేకుండానే) స్వప్రకాశమై భాసిస్తున్నద[2]

ఆత్మతత్వం[మార్చు]

ఋచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధుః |
యస్ తన్ న వేద కిమ్ ఋచా కరిష్యతి య ఇత్ తద్ విదుస్ త ఇమే సమ్ ఆసతే || 1-164-39 [3]


ఆత్మతత్వం నుంచే విశ్వంలోని దేవతలు, సమస్తము పుడుతున్నారు.
ఆత్మతత్వం తెలియని వారికి ఋగ్వేదం వల్ల ప్రయోజనమేమి ?
ఆత్మతత్వం తెలిసిన వారికే నిజమైన ఆనందం[2]

శృతి[మార్చు]

గౌరీర్ మిమాయ సలిలాని తక్షత్య్ ఏకపదీ ద్విపదీ సా చతుష్పదీ |
అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ || 1-164-41 [3]


తస్యాః సముద్రా అధి వి క్షరన్తి తేన జీవన్తి ప్రదిశశ్ చతస్రః |
తతః క్షరత్య్ అక్షరం తద్ విశ్వమ్ ఉప జీవతి || 1-164-42


ఈశ్వరుడు అన్ని చోట్ల వ్యాపించినట్లు ఒకటి మొదలు అనంతములైన
శబ్దాలున్న శ్రుతినించే సమస్త పవిత్ర గ్రంథాలుద్భవించాయి.
శృతివల్లనే నాలుగు దిక్కులు ప్రకాశవంతమై
సమస్తజగత్తుకు కారణభూతుడైన ఈశ్వరుడు ఏర్పడుతున్నాడు.
ఈ జగత్తు అంతా శ్రుతివల్లననే జీవిస్తున్నది.[2]

స్తుతి జాబితా[మార్చు]

సూక్తము సూక్తము పేరు దేవతలు ఋషులు చందస్సు సూక్తము ప్రారంభము
1 1 అగ్ని సూక్తము అగ్ని మధుచ్ఛందా వైశ్వామిత్ర గాయత్రి అగ్ని మీడే పురోహితం
1 22 విష్ణు సూక్తము అశ్వినీ దేవతలు, ఇతరులు మేధాతిథి,కణ్వ గాయత్రి ప్రాతర్యుజా ని బోధయాశ్వినావేహ గచ్చతామ్
1 32 ఇంద్ర సూక్తము ఇంద్ర హిరణ్యస్తూప అంగిరస త్రిష్టుప్ ఇంద్రస్య ను వీర్యాణి ప్ర వోచం యాని చకార
1 89 శాంతి సూక్తము విశ్వేదేవతలు గోతమ రాహుగణ జగతి (త్రిష్టుప్) ఆ నో భద్రా క్రతవో యస్తు విశ్వతో
1 90 మధు సూక్తము విశ్వేదేవతలు గోతమ రాహుగణ గాయత్రి (అనుష్టుప్) ఋజునీతీ నో వరుణో మిత్రో
1 99 అగ్ని దుర్గా సూక్తము అగ్ని కశ్యప మరీచి త్రిష్టుప్ జాతవేదసే సునవామ సోమ
1 162 అశ్వమేధ సూక్తము అశ్వ దీర్ఘతముడు, ఔచథ్య త్రిష్టుప్ మా నో మిత్రో వరుణో ఆర్యమాయురిన్ద్ర

సూక్తముల, క్రమము, దేవతలు, శ్లోక (మంత్ర) ప్రారంభ జాబితా[మార్చు]

1.1 (1) అగ్ని అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్
1.2 (2) వాయు వాయవా యాహి దర్శతేమే సోమా అరంకృతాః
1.3 (3) అశ్వినీ దేవతలు ఆశ్వినా యజ్వరీరిషో ద్రవత్పాణీ
1.4 (4) ఇంద్రుడు సురూపకృత్ను మూతయే సుదుఘామివ
1.5 (5) ఇంద్రుడు ఆ త్వేత్వని షీదతేంద్రమఖి ప్ర గాయత
1.6 (6) ఇంద్రుడు యుంజంతి బ్రద్నమరుషం చరంతం
1.7 (7) ఇంద్రుడు ఇంద్రమిద్గాథినో బృహదింద్రమర్కే
1.8 (8) ఇంద్రుడు ఏంద్ర సానసిం రయిం సజిత్వానం
1.9 (9) ఇంద్రుడు ఇంద్రేహి మత్స్యన్దసో విశ్వేహిభి
1.10 (10) ఇంద్రుడు గయంతిత్వా గయత్రిణోర్చన్తర్య మర్కిణ
1.11 (11) ఇంద్రుడు ఇంద్రం విశ్వా అవీవృథంత్
1.12 (12) అగ్ని అగ్నం దూతం వృణీమహే
1.13 (13) అగ్ని సునవిద్దోన ఆవహదేవాగ్‌ం
1.14 (14) విశ్వేదేవతలు ఏభిరగ్నే దువోగిరో విశ్వేభి
1.15 (15) మరుత ఇంద్రుడు ఇంద్ర సోమం పిబ
1.16 (16) ఇంద్రుడు ఆ త్వావహంతు హరయో
1.17 (17) ఇంద్రుడు-వరుణ ఇంద్రావరుణయోరహం సమ్రాజోరవ
1.18 (18) బ్రాహ్మణస్పతి సోమానం స్వరణం కృణిహి
1.19 (19) అగ్ని మరుత్తులు ప్రతి త్యం చారుమద్వరం
1.20 (20) ఋభవ ఆయం దేవాయ జన్మనే స్తోమో
1.21 (21) ఇంద్రుడు-అగ్ని ఇహేంద్రాగ్నీ ఉప హ్వయే
1.22 (22) అశ్వనీ దేవతలు, ఇతరులు ప్రాతర్యుజా వి బోధయాశ్వినావేహ
1.23 (23) వాయు, ఇతరులు తీవ్రా సోమాన ఆ గహ్యాశీర్వంత
1.24 (24) వరుణ, ఇతరులు కస్య నూనం కతమస్యామృతానాం
1.25 (25) వరుణ యచ్చిద్ధి తే విశో యథా ప్ర దేవ వరుణ
1.26 (26) అగ్ని వసిష్యా హి మియేధ్య వస్త్రాణ్యూర్దాం
1.27 (27) అగ్ని అశ్వం న త్వా మారవంతం
1.28 (28) ఇంద్రుడు మొదలైనవారు యత్ర గ్రావ పృథుబుధ్న
1.29 (29) ఇంద్రుడు యచ్చిద్ధి సత్య సోమాపా
1.30 (30) ఇంద్రుడు ఆ వ ఇంద్రం క్రివిం యథా
1.31 (31) అగ్ని త్వమగ్నే పథమో అంగిరా
1.32 (32) ఇంద్రుడు ఇంద్రస్యను వీర్యాణి
1.33 (33) ఇంద్రుడు ఏతాయమోప గవ్యంత ఇంద్ర
1.34 (34) అశ్వనీ దేవతలు త్రిశ్చన్ నో అద్యా భవతంనవేదసా
1.35 (35) సవితా హ్వాయామ్యగ్నిం ప్రథమం స్వస్తయే
1.36 (36) అగ్ని ప్ర వో యహ్వం పూరూణాం
1.37 (37) మరుత్తులు క్రీళం వః శర్దో మారుతమసర్వాణం
1.38 (38) మరుత్తులు కద్ధ నూనం కథప్రియః
1.39 (39) మరుత్తులు ప్ర యదిత్త్ధా పరవాతః
1.40 (40) బ్రాహ్మణస్పతి ఉత్తిష్ట బ్రహ్మణస్పతే
1.41 (41) వరుణ, మిత్ర, ఆర్యమణ.] ఆదిత్య
1.42 (42) పూషా సం పూషన్నధ్వనస్థిర
1.43 (43) రుద్ర కద్ రుద్రాయ ప్రచేతసే
1.44 (44) అగ్ని అగ్నే వివస్వదుషనశ్
1.45 (45) అగ్ని త్వమగ్నే వసూగ్‌ంరిహ
1.46 (46) అశ్వనీ దేవతలు ఏషో ఉషా అపూర్వాః
1.47 (47) అశ్వనీ దేవతలు అయం వాం దధుదత్తమః
1.48 (48) ఉషస సహ వామేన న ఉష్ణో
1.49 (49) ఉషస ఉషో భద్రేభిరా గహి
1.50 (50) సూర్య ఉదు త్యం జాతవేదపం
1.51 (51) ఇంద్రుడు అభ్ త్యం మేషం పురుహుతమృగ్మియ
1.52 (52) ఇంద్రుడు త్యం సు మేషం మహాయా స్వర్విదం
1.53 (53) ఇంద్రుడు న్యూ షు వాచం ప్ర మహే భరామహే
1.54 (54) ఇంద్రుడు మా నో అస్మిన్ మఘవన్ పృత్స్వంహసి
1.55 (55) ఇంద్రుడు దివశ్చిదస్య వరిమా వి పప్రథ ఇన్ద్రం
1.56 (56) ఇంద్రుడు ఏష ప్ర పూర్వీరవ తస్య చమ్రిషో ऽత్యో న
1.57 (57) ఇంద్రుడు ప్ర మంహిష్ఠాయ బృహతే బృహద్రయే
1.58 (58) అగ్నినూ చిత్ సహొజా అమృతోని తున్దతే
1.59 (59) అగ్ని వయా ఇదగ్నే అగ్నయస్తే అన్యే త్వే
1.60 (60) అగ్ని వహ్నిం యశసం విదథస్య కేతుం
1.61 (61) ఇంద్రుడు అస్మా ఇదు ప్ర తవసే తురాయ ప్రయో న
1.62 (62) ఇంద్రుడు ప్ర మన్మహే శవసానాయ
1.63 (63) ఇంద్రుడు త్వమ్ మహాఇన్ద్ర యో హ
1.64 (64) మరుత్తులు వృష్ణే శర్ధాయ సుమఖాయ
1.65 (65) అగ్ని పశ్వా న తాయుం గుహా
1.66 (66) అగ్ని రయిర్ న చిత్రా సూరో న
1.67 (67) అగ్ని సిన్ధుర్ న క్షోదః ప్ర
1.68 (68) అగ్ని చిత్తిర్ అపాం దమే
1.69 (69) అగ్ని వి రాయ ఔర్ణోద్ దురః
1.70 (70) అగ్ని త్మనా వహన్తో దురో వ్య్
1.71 (71) అగ్ని సాధుర్ న గృధ్నుర్ అస్తేవ
1.72 (72) అగ్నిని కావ్యా వేధసః శశ్వతస్
1.73 (73) అగ్ని రయిర్ న యః పితృవిత్తో
1.74 (74) అగ్ని ఉపప్రయన్తో అధ్వరమ్
1.75 (75) అగ్ని జుషస్వ సప్రథస్తమం
1.76 (76) అగ్ని కా త ఉపేతిర్ మనసో వరాయ
1.77 (77) అగ్ని కథా దాశేమాగ్నయే కాస్మై
1.78 (78) అగ్ని అభి త్వా గోతమా గిరా
1.79 (79) అగ్ని హిరణ్యకేశో రజసో విసారే
1.80 (80) ఇంద్రుడు ఇత్థా హి సోమ ఇన్ మదే
1.81 (81) ఇంద్రుడు ఇన్ద్రో మదాయ వావృధే
1.82 (82) ఇంద్రుడు ఉపో షు శృణుహీ గిరో
1.83 (83) ఇంద్రుడు అశ్వావతి ప్రథమో గోషు గచ్ఛతి
1.84 (84) ఇంద్రుడు అసావి సోమ ఇన్ద్ర తే
1.85 (85) మరుత్తులు ప్ర యే శుమ్భన్తే జనయో న
1.86 (86) మరుత్తులు మరుతో యస్య హి క్షయే
1.87 (87) మరుత్తులు ప్రత్వక్షసః ప్రతవసో విరప్శినో
1.88 (88) మరుత్తులు ఆ విద్యున్మద్భిర్ మరుతః
1.89 (89) విశ్వేదేవతలు ఆ నో భద్రాః క్రతవో యన్తు
1.90 (90) విశ్వేదేవతలు ఋజునీతీ నో వరుణో మిత్రో
1.91 (91) సోమ త్వం సోమ ప్ర చికితో మనీషా
1.92 (92) ఉషా అశ్వినౌ ఏతా ఉ త్యా ఉషసః కేతుమ్
1.93 (93) అగ్ని-సోమఅగ్నీషోమావ్ ఇమం సు
1.94 (94) అగ్ని ఇమం స్తోమమ్ అర్హతే
1.95 (95) అగ్నిద్వే విరూపే చరతః
1.96 (96) అగ్ని స ప్రత్నథా సహసా
1.97 (97) అగ్ని అప నః శోశుచద్ అఘమ్
1.98 (98) అగ్ని వైశ్వానరస్య సుమతౌ
1.99 (99) అగ్ని జాతవేదసే సునవామ
1.100 (100) ఇంద్రుడు స యో వృషా వృష్ణ్యేభిః
1.101 (101) ఇంద్రుడు ప్ర మన్దినే పితుమద్
1.102 (102) ఇంద్రుడు ఇమాం తే ధియమ్
1.103 (103) ఇంద్రుడు తత్ త ఇన్ద్రియమ్ పరమమ్ పరాచైర్
1.104 (104) ఇంద్రుడు యోనిష్ ట ఇన్ద్ర నిషదే అకారి తమ్
1.105 (105) విశ్వేదేవతలు చన్ద్రమా అప్స్వ్ అన్తర్ ఆ సుపర్ణో ధావతే దివి |
1.106 (106) విశ్వేదేవతలు ఇన్ద్రమ్ మిత్రం వరుణమ్ అగ్నిమ్ ఊతయే
1.107 (107) విశ్వేదేవతలు యజ్ఞో దేవానామ్ ప్రత్య్ ఏతి సుమ్నమ్
1.108 (108) ఇంద్రుడు- అగ్ని య ఇన్ద్రాగ్నీ చిత్రతమో రథో వామ్
1.109 (109) ఇంద్రుడు- అగ్ని వి హ్య్ అఖ్యమ్ మనసా వస్య ఇచ్ఛన్న్
1.110 (110) ఋభవ తతమ్ మే అపస్ తద్ ఉ తాయతే పునః
1.111 (111) ఋభవ తక్షన్ రథం సువృతం విద్మనాపసస్
1.112 (112) అశ్వినీ దేవతలు ఈళే ద్యావాపృథివీ పూర్వచిత్తయే
1.113 (113) ఉషోరాత్రీ ఉషా ఇదం శ్రేష్ఠం జ్యోతిషాం జ్యోతిర్ ఆగాచ్
1.114 (114) రుద్ర ఇమా రుద్రాయ తవసే కపర్దినే
1.115 (115) సూర్య చిత్రం దేవానామ్ ఉద్ అగాద్ అనీకం
1.116 (116) అశ్వనీ దేవతలు
1.117 (117) అశ్వనీ దేవతలు
1.118 (118) అశ్వనీ దేవతలు
1.119 (119) అశ్వనీ దేవతలు
1.120 (120) అశ్వనీ దేవతలు
1.121 (121) ఇంద్రుడు
1.122 (122) విశ్వేదేవతలు
1.123 (123) ఉషా
1.124 (124) ఉషా
1.125 (125) స్వనయస్య దానస్తుతి
1.126 (126) స్వనయోభావ యవ్య
1.127 (127) అగ్ని
1.128 (128) అగ్ని
1.129 (129) ఇంద్రుడు
1.130 (130) ఇంద్రుడు
1.131 (131) ఇంద్రుడు
1.132 (132) ఇంద్రుడు
1.133 (133) ఇంద్రుడు
1.134 (134) వాయు
1.135 (135) వాయు, ఇంద్రుడు-వాయు
1.136 (136) . మిత్రా-వరుణ
1.137 (137) మిత్రా-వరుణ
1.138 (138) పూషా
1.139 (139) విశ్వేదేవతలు
1.140 (140) అగ్ని
1.141 (141) అగ్ని
1.142 (142) ఇంద్ర
1.143 (143) అగ్ని
1.144 (144) అగ్ని
1.145 (145) అగ్ని
1.146 (146) అగ్ని
1.147 (147) అగ్ని
1.148 (148) అగ్ని
1.149 (149) అగ్ని
1.150 (150) అగ్ని
1.151 (151) మిత్రా, వరుణ
1.152 (152) మిత్రా-వరుణ
1.153 (153) మిత్రా-వరుణ
1.154 (154) విష్ణు
1.155 (155) విష్ణు-ఇంద్రుడు
1.156 (156) విష్ణు భవా
1.157 (157) అశ్వనీ దేవతలు
1.158 (158) అశ్వనీ దేవతలు వాసు
1.159 (159) ద్యావా పృథివీ, . పృథ్వీ
1.160 (160) ద్యావా పృథివీ
1.161 (161) ఋభవ
1.162 (162) అశ్వ
1.163 (163) అశ్వ
1.164 (164) విశ్వేదేవతలు
1.165 (165) ఇంద్రుడు. మరుత్తులు
1.166 (166) మరుత్తులు
1.167 (167) ఇంద్రుడు. మరుత్తులు
1.168 (168) మరుత్తులు
1.169 (169) ఇంద్రుడు
1.170 (170) ఇంద్రుడు. మరుత్తులు
1.171 (171) మరుత్తులు
1.172 (172) మరుత్తులు
1.173 (173) ఇంద్రుడు
1.174 (174) ఇంద్రుడు
1.175 (175) ఇంద్రుడు
1.176 (176) ఇంద్రుడు
1.177 (177) ఇంద్రుడు
1.178 (178) ఇంద్రుడు
1.179 (179) రతి
1.180 (180) అశ్వనీ దేవతలు
1.181 (181) అశ్వనీ దేవతలు
1.182 (182) అశ్వనీ దేవతలు
1.183 (183) అశ్వనీ దేవతలు
1.184 (184) అశ్వనీ దేవతలు
1.185 (185) ద్యావా పృథివ్యా
1.186 (186) విశ్వేదేవతలు
1.187 (187) అన్నం
1.188 (188) ఇద్మ
1.189 (189) అగ్ని
1.190 (190) బృహస్పతి
1.191 (191) అప్తృణసూర్యా
1.192 (192) సూర్య
1.193 (193) విషఘ్న
ఇతి ప్రథమ మండలం [3]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  • వికీసోర్స్:[1] ఋగ్వేదము - మండలం 1

మూలాలు[మార్చు]

  1. https://en.wikipedia.org/wiki/Mandala_1
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 "వికీసోర్స్". Archived from the original on 2013-07-29. Retrieved 2014-11-26.