బేసి సంఖ్యలు
(బేసి సంఖ్య నుండి దారిమార్పు చెందింది)
2 చే భాగించినపుడు శేషం ఒకటి వచ్చే సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు[1]. ఈ సంఖ్యలను 'O' తో సూచిస్తారు. బేసి సంఖ్యలు ఋణాత్మకంగా కూడా ఉండవచ్చు. ఉదాహరణకు −5, 3, 29, 73.
k ఒక పూర్ణ సంఖ్య అయిన బేసిసంఖ్య n = 2k + 1 (లేదా 2k - 1) రూపంలో ఉంటుంది[2].
బేసి సంఖ్యా సమితిని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు[3].
బేసి సంఖ్యలు
దశాంశ మానంలో ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 1,3,5,7,9 ఉంటే అది బేసి సంఖ్య అవుతుంది.
లక్షణాలు
[మార్చు]- ఏ రెండు వరుస బేసి సంఖ్యల మొత్తమైనా ఒక సరిసంఖ్య[4].
- ఏ రెండు వరుస బేస సంఖ్యల భేదమైనా రెండు.
- ఏ రెండు బేసి సంఖ్యల భేదమైనా ఒక సరిసంఖ్య.
- రెండు బేసి సంఖ్యల లబ్ధం ఒక బేసి సంఖ్య.
- ఒక సరిసంఖ్య, ఒక బేసి సంఖ్య ల మొత్తమైనా ఒక బేసి సంఖ్య.
- ఒక సరి సంఖ్య, ఒక బేసి సంఖ్య ల లబ్ధమైనా ఒక సరిసంఖ్య.
- 'n' వరుస బేసి సంఖ్యల మొత్తం = n2
- బేసి సంఖ్య యొక్క సాధారణ రూపం = 2n-1, ఇందులో n అనునది సహజ సంఖ్య.
మూలాలు
[మార్చు]- ↑ Bóna, Miklós (2011), A Walk Through Combinatorics: An Introduction to Enumeration and Graph Theory, World Scientific, p. 178, ISBN 9789814335232.
- ↑ Bassarear, Tom (2010), Mathematics for Elementary School Teachers, Cengage Learning, p. 198, ISBN 9780840054630.
- ↑ Sidebotham, Thomas H. (2003), The A to Z of Mathematics: A Basic Guide, John Wiley & Sons, p. 181, ISBN 9780471461630.
- ↑ Vijaya, A.V.; Rodriguez, Dora, Figuring Out Mathematics, Pearson Education India, pp. 20–21, ISBN 9788131703571.