అప్పిరెడ్డి హరినాథరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అప్పిరెడ్డి హరినాథరెడ్డి
జననం
అప్పిరెడ్డి హరినాథరెడ్డి

(1980-06-20) 1980 జూన్ 20 (వయసు 44)
విద్యఎం.ఎ. (తెలుగు); పి.హెచ్.డి.
వృత్తిఉపాధ్యాయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, పరిశోధకుడు
తల్లిదండ్రులు
  • ఎ.రాఘవరెడ్డి (తండ్రి)
  • ఎ.ఉత్తమ్మ (తల్లి)
నోట్సు

అప్పిరెడ్డి హరినాథరెడ్డి అనంతపురం జిల్లాకు చెందిన సాహిత్య పరిశోధకుడు, రచయిత. ఇతని గ్రంథం సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రికకు 2014లో కేంద్రసాహిత్య అకాడమీ వారి యువ పురస్కారం లభించింది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు అనంతపురం జిల్లా, గాండ్లపెంట మండలానికి చెందిన తాళ్ళకాల్వ గ్రామంలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో 1980, జూన్ 20వ తేదీన రాఘవరెడ్డి, ఉత్తమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని ప్రాథమిక, ఉన్నత విద్య అంతా ప్రభుత్వ పాఠశాలల లోనే గడిచింది. డిగ్రీ కదిరిలో పూర్తి చేసి కర్నూలు సిల్వర్ జూబ్లి కళాశాలలో తెలుగు పండిత శిక్షణ చేశాడు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ.చేశాడు. కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం నుండి బూదాటి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో రాయలసీమ ముఠాకక్షలు -సాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందాడు. ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా అనంతపురం జిల్లా గ్రామాలలో పనిచేస్తున్నాడు. ఇతడు సాహిత్య, సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నాడు. వెలుగులోకి రాని శిలాశాసనాలు, తాళపత్రగ్రంథాలు, ఆదిమానవులనాటి రేఖాచిత్రాలు, పురాతన కట్టడాలు మొదలైన వాటిపై కృషిచేస్తున్నాడు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 2016, జూలై 1-3 తేదీలలో నిర్వహించనున్న మహాసభలలో ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకొని రాయలసీమ కథాసాహిత్యం - ప్రాంతీయ జీవితం అనే అంశంపై కీలకోపన్యాసం చేయనున్నాడు.[1]

రచనలు

[మార్చు]

ఇతడు వివిధ అంశాలపై సుమారు 100కు పైగా పరిశోధన వ్యాసాలు వ్రాసి అనేక పత్రికలలో ప్రకటించాడు. వివిధ జాతీయ సదస్సులలో పాల్గొని పత్రసమర్పణ చేశాడు. ఇతడు వెలువరించిన పుస్తకాలు:

  1. శ్రీ సాధన కవిత్వం
  2. సీమ సాహితీ స్వరం - శ్రీ సాధనపత్రిక
  3. మొదటి తరం రాయలసీమ కథలు (1882 -1944)
  4. శ్రీకృష్ణదేవరాయ జయంత్యుత్సవ ఉపన్యాసాలు - వ్యాసాలు (1929-1936)
  5. అనంతపురం జిల్లాలో స్వాతంత్ర్యోద్యమం (అముద్రితం)
  6. టి.శివశంకరం పిళ్లే ఇంగ్లాండు యాత్ర (అముద్రితం)
  7. రాయలసీమ పాటలు (అముద్రితం)
  8. థామస్ మన్రో జీవిత చరిత్ర (అముద్రితం)
  9. రాయలసీమ కక్షలు - సాహిత్య విశ్లేషణ్ (సిద్ధాంత గ్రంథం - అముద్రితం)
  10. అలనాటి సాహిత్య వ్యాసాలు (1926 -1970) (అముద్రితం)
  11. అనంతపురం జిల్లా కైఫీయత్‌లు (అముద్రితం)

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "అప్పిరెడ్డికి అమెరికా ఆటా ఆహ్వానం". Archived from the original on 2016-06-21. Retrieved 2016-06-27.
  • సీమసాహితికి సమున్నత గౌరవం - అక్షరన్యూస్ మాసపత్రిక ప్రథమవార్షికోత్సవ ప్రత్యేక సంచిక - అక్టోబరు 2014
  • యువసాహితికి గుర్తింపు - తెలుగువెలుగు మాసపత్రిక - అక్టోబరు 2014
  • కదిలించే కలాలు - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి - నేటినిజం దినపత్రిక - 2015 నవంబరు 12