అలెగ్జాండర్ గ్రాహంబెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలెగ్జాండర్ గ్రాహంబెల్
Alexander Graham Bell.jpg
అలెగ్జాండర్ గ్రహంబెల్ చిత్రపటం. 1910
జననంమార్చి 3 1847
మరణం1922 ఆగస్టు 2(1922-08-02) (వయస్సు 75)
మరణ కారణంపెర్నీషియస్ అనీమియా
విద్యఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం
టొరంటో విశ్వవిద్యాలయం
వృత్తిశాస్త్రవేత్త, రూపకర్త
సుపరిచితుడుటెలీఫోను కనుగొన్న శాస్త్రవేత్త
జీవిత భాగస్వామిమాబెల్ హబ్బార్డ్
(married 1877–1922)
పిల్లలు(4) ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు, కొడుకులు చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయారు.
తల్లిదండ్రులుAlexander Melville Bell
Eliza Grace Symonds Bell
బంధువులుGardiner Greene Hubbard (father-in-law)
Gilbert Hovey Grosvenor (son-in-law)
Melville Bell Grosvenor (grandson)

అలెగ్జాండర్ గ్రాహంబెల్ (3 మార్చి 18472 ఆగష్టు 1922) అమెరికాకు చెందిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు, టెలీఫోనును కనిపెట్టాడు.

Dileep dj Ñ

బాల్యము[మార్చు]

గ్రహంబెల్ 1847 మార్చి 3 న స్కాట్‌లాండ్ లోని ఎడిన్‌బర్గ్లో జన్మించడం జరిగింది. ఆయన బాల్య జీవితమంతా బ్రిటీష్ పౌరుడిగానే గడిచింది. ఆయనకు ఇద్దరు సోదరులు మెల్విలే జేమ్స్ బెల్, ఎడ్వర్డ్ చార్లెస్ బెల్. వీరిరువురూ క్షయ వ్యాధితో మరణించారు. ఆయన తండ్రి ప్రొఫెసర్ అలెగ్జాండర్ మెల్విలే బెల్. తల్లి పేరు ఎలీజా గ్రేస్.

Art by dileep

టెలిఫోన్ ఆవిష్కరణ[మార్చు]

గ్రాహంబెల్‌ తాత, తండ్రి వక్తృత్వం, సంభాషణల విషయాలపై పరిశోధన చేస్తుండేవారు. ప్రాథమిక విద్యను తండ్రి వద్దే అభ్యసించిన గ్రాహంబెల్‌ ఎడింబరోలోని రాయల్‌ హైస్కూల్లో చదువుకుని, పదహారేళ్లకల్లా అక్కడే వక్తృత్వం, సంగీతాలను నేర్పించే పనిలో చేరాడు. తల్లి క్రమేణా వినికిడి శక్తిని కోల్పోవడంతో ఆమెతో మాట్లాడే క్రమంలో సంజ్ఞలతో భావ వ్యక్తీకరణలో ఆరితేరాడు. ఆమె నుదిటి ఎముకకు దగ్గరగా ఒక రకమైన ఉచ్ఛారణతో మాట్లాడే ప్రయత్నంలో ధ్వని శాస్త్రాన్ని (Acoustics) అర్థం చేసుకున్నాడు.

ఆపై ఎడింబరో విశ్వవిద్యాలయంలో ధ్వని, వినికిడి శాస్త్రాలు చదివి అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయంలో 'గాత్ర సంబంధిత శరీర శాస్త్రం' (వోకల్‌ ఫిజియాలజీ)లో ప్రొఫెసర్‌గా చేరాడు. భార్య సైతం వినికిడి శక్తిని కోల్పోవడంతో బధిరుల కోసం పరిశోధనలు చేసి, వారు వినగలిగే శబ్ద పరికరాలను రూపొందించాడు. పగలంతా బోధిస్తూ, రాత్రంతా మేలుకుని ప్రయోగాలు చేసేవాడు. ఆ కృషి కారణంగానే తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగే టెలిఫోన్‌ను కనిపెట్టగలిగాడు. దీనిపై 1876లో ఆయనకు లభించిన పేటెంట్‌ అమెరికాలోనే శాస్త్రరంగంలో మొదటిది. ఆపై ఆప్టికల్‌ టెలికమ్యూనికేషన్స్‌, హైడ్రోఫాయిల్స్‌, ఏరోనాటిక్స్‌ రంగాల్లో కూడా అనేక ఆవిష్కరణలు చేశాడు. నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ వ్యవస్థాపకుల్లో గ్రాహంబెల్‌ కూడా ఒకరు.

ఇతర ఆవిష్కరణలు[మార్చు]

గ్రహంబెల్ ను చాలామంది టెలిఫోన్ ఆవిష్కర్తగా గుర్తుంచుకున్నా ఆయన వివిధ రంగాలలో ఆసక్తిని కనబరచాడు.

పురస్కారాలు, సన్మానాలు[మార్చు]

1880 వ సంవత్సరంలో టెలిఫోన్ ఆవిష్కరణకు గాను ఫ్రెంచి ప్రభుత్వం ప్రధానం చేసే వోల్టా పురస్కారాన్ని గెలుచుకున్నాడు. దీని విలువ 50,000 ఫ్రాంకులు ( సుమారు 10,000 డాలర్లు).

Mullalu

ఇతర లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

పేటెంట్స్[మార్చు]

U.S. patent images in TIFF format

Improvement in Transmitters and Receivers for Electric Telegraphs, filed March 1875, issued April 1875 (multiplexing signals on a single wire)
Improvement in Telegraphy, filed February 14, 1876, issued March 7, 1876 (Bell's first telephone patent)
Improvement in Telephonic Telegraph Receivers, filed April 1876, issued June 1876
Improvement in Generating Electric Currents (using rotating permanent magnets), filed August 1876, issued August 1876
Electric Telegraphy (permanent magnet receiver), filed January 15, 1877, issued January 30, 1877
Apparatus for Signalling and Communicating, called Photophone, filed August 1880, issued December 1880
Aerial Vehicle, filed June 1903, issued April 1904

మల్టీమీడియా[మార్చు]

  • Alexander Graham Bell at The Biography Channel
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో The Story of Alexander Graham Bell (1939)
  • Alexander Graham Bell portrayed by John Bach (1992). The Sound and the Silence (Television production). Canada, New Zealand, Ireland: Atlantis Films.
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో The Animated Hero Classics: Alexander Graham Bell (1995)
  • Gray, Charlotte (May 2013). "We Had No Idea What Alexander Graham Bell Sounded Like. Until Now". Smithsonian Magazine. Archived from the original on 2013-12-28. Retrieved 2014-03-03.