Coordinates: 22°05′N 79°32′E / 22.08°N 79.53°E / 22.08; 79.53

సివ్‌నీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సివ్‌నీ
పట్టణం
సివ్‌నీ is located in Madhya Pradesh
సివ్‌నీ
సివ్‌నీ
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 22°05′N 79°32′E / 22.08°N 79.53°E / 22.08; 79.53
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాసివ్‌నీ
Area
 • Total40 km2 (20 sq mi)
Elevation
611 మీ (2,005 అ.)
 • Rank30th (MP)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
480661
టెలిఫోన్ కోడ్07692
ISO 3166 codeIN-MP
Vehicle registrationMP-22
Websitehttp://www.seoni.mp.gov.in/

సివ్‌నీ మధ్యప్రదేశ్ రాష్ట్రం, సివ్‌నీ జిల్లా లోని పట్టణం. గిరిజనులు మెజారిటీగా ఉన్న ఈ జిల్లా 1956 లో ఏర్పడింది. ఈ ప్రాంతం వాస్తవంగా వర్షారణ్యం కానప్పటికీ, రడ్‌యార్డ్ కిప్లింగ్ సివ్‌నీ పరిసరాల్లోని అడవులనే తన ది జంగిల్ బుక్, ది సెకండ్ జంగిల్ బుక్ (1894–1895) లోని మోగ్లీ కథలకు నేపథ్యంగా వాడుకున్నాడు. సివ్‌నీ, గోదావరి నదికి ఉపనది అయిన వైన్‌గంగ పుట్టిన ప్రదేశం. రహదారి, ప్రధాన ప్రక్కనే ఉన్న నగరాలు నాగ్‌పూర్, జబల్‌పూర్ ద్వారా సివ్‌నీ చేరుకోవచ్చు. జాతీయ రహదారి 44 ఉత్తర-దక్షిణ కారిడార్ సివ్‌నీ గుండా పోతుంది. సమీప విమానాశ్రయం 130 కి.మీ. దూరంలో నాగ్‌పూర్‌లో ఉంది. చార్టర్ విమానాలు / హెలికాప్టర్లు దిగడం కోసం సమీపంలోని సుఖ్తారా గ్రామం వద్ద ఒక చిన్న విమానాశ్రయం (ఎయిర్-స్ట్రిప్) అందుబాటులో ఉంది.

సివ్‌నీ 22°05′N 79°32′E / 22.08°N 79.53°E / 22.08; 79.53 వద్ద [1] సముద్ర మట్టం నుండి 611 మీటర్ల ఎత్తున ఉంది.

జనాభా వివరాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, సివ్‌నీ జనాభా 1,02,343. జనాభాలో పురుషులు 50.45%, మహిళలు 49.55%. సివ్‌నీ సగటు అక్షరాస్యత 90.46%, పురుషుల అక్షరాస్యత 94.71%, స్త్రీల అక్షరాస్యత 86.03%. 

పెంచ్ టైగర్ రిజర్వ్[మార్చు]

వైన్‌గంగా నది ముండారా గ్రామం వద్ద ఉద్భవిస్తుంది. ఇక్కడికి 10 కి.మీ. దూరంలో పేంచ్ టైగర్ రిజర్వ్ ఉంది. పేంచ్ నది మీదుగా దీనికి ఈ పేరు వచ్చింది, ఇది పార్క్ ద్వారా ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తుంది. ఈ నది ఎగువ ప్రాంతంలో మధ్యప్రదేశ్‌లోని సివ్‌నీ, చింద్వారా జిల్లాల సరిహద్దు గాను, దిగువ ప్రాంతంలో మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు సరిహద్దుగానూ ఉంది. 1992 లో ఈ ప్రాంతాన్ని భారతదేశపు 19 వ పులి సంరక్షణవనంగా ప్రకటించారు. పేంచ్ టైగర్ రిజర్వు మొత్తం వైశాల్యం 757.85 కిమీ 2

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సివ్‌నీ&oldid=3122078" నుండి వెలికితీశారు