బర్వానీ
బర్వానీ | |
---|---|
పట్టణం | |
Coordinates: 22°02′N 74°54′E / 22.03°N 74.9°E | |
దేశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | బర్వానీ జిల్లా |
విస్తీర్ణం | |
• Total | 27 కి.మీ2 (10 చ. మై) |
Elevation | 178 మీ (584 అ.) |
జనాభా (2011) | |
• Total | 55,504 |
• జనసాంద్రత | 2,100/కి.మీ2 (5,300/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 451551 |
టెలిఫోన్ కోడ్ | 07290 |
Vehicle registration | MP-46 |
బర్వానీ మధ్యప్రదేశ్, బర్వానీ జిల్లాలోని పట్టణం. ఇది నర్మదా నది ఎడమ ఒడ్డున ఉంది. ఇది బర్వానీ జిల్లాకు ముఖ్యపట్టణం. పూర్వపు సంస్థానమైన బర్వానీకి రాజధాని కూడా. బర్వానీకి రోడ్డు సౌకర్యం మాత్రమే ఉంది, రైలు మార్గం లేదు.
భౌగోళికం
[మార్చు]బర్వానీ 22°02′N 74°54′E / 22.03°N 74.9°E వద్ద [1] సముద్ర మట్టం నుండి 178 మీటర్ల ఎత్తున ఉంది. నర్మదా నది బర్వానీ పట్టణ కేంద్రం నుండి 5 కి,మీ. దూరంలో ప్రవహిస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో బర్వానీ గరిష్ట ఉష్ణోగ్రత 48°C కు చేరుకుంటుంది. ఇది మధ్య భారతదేశంలోని అత్యంత వేడిగా ఉండే ప్రదేశాలలో ఒకటి.
రవాణా
[మార్చు]రైల్వేలు
[మార్చు]బర్వానీకి నేరుగా రైలు మార్గం లేదు పట్టణానికి సమీప స్టేషన్ ఇండోర్ లో ఉంది. 180 కి.మీ. దూరం లోని ఖాండ్వా వద్ద కూడా రైల్వే స్టేషన్ ఉంది. [2]
రోడ్లు
[మార్చు]బర్వానీ నుండి వివిధ ప్రదేశాలకు జాతీయ, రాష్ట్ర రహదారుల ద్వారా రవాణా సౌకర్యం ఉంది. పట్టణం నుండి 51 కి.మీ. దూరంలో పోతున్న ఆగ్రా-బొంబాయి జాతీయ రహదారి నంబర్ మూడును కలిపేందుకు ఖాండ్వా-బరోడా ఇంటర్ స్టేట్ హైవే నెం. 26 నిర్మించారు. బర్వాని`నుండి ఇండోర్, ఖండ్వా, ఉజ్జయినీ, దేవాస్, ధార్, రత్లాం, ఖర్‌గోన్, హర్దా, ముంబై, అహ్మదాబాద్, వడోదర తదితర నగరాలకు బస్సు సౌకర్యాలున్నాయి.
జనాభా వివరాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] బర్వానీ జనాభా 55,504, ఇందులో 28,437 మంది పురుషులు (51%), 27,067 మంది మహిళలు (49%) ఉన్నారు.
ఆరేళ్ళ లోపు పిల్లలు 6,961 (12.54%). బర్వానీ పట్టణంలో స్త్రీ-పురుష లింగ నిష్పత్తి 952:1000. పిల్లల్లో స్త్రీ-పురుష లింగ నిష్పత్తి 919:1000. బర్వానీ పట్టణ అక్షరాస్యత 82.10%. పురుషుల అక్షరాస్యత 87.17%, స్త్రీల అక్షరాస్యత రేటు 76.80%.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- ప్రముఖ అణు భౌతిక శాస్త్రవేత్త, భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్, భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ విభాగం కార్యదర్శి అయిన డాక్టర్ అనిల్ కాకోద్కర్ బర్వానీలో జన్మించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Falling Rain Genomics, Inc - Barwani
- ↑ 2.0 2.1 "Census of India 2011: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Retrieved 2015-06-18.