అక్షాంశ రేఖాంశాలు: 24°36′02″N 80°49′56″E / 24.6005°N 80.8322°E / 24.6005; 80.8322

సాత్నా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాత్నా
సాత్నా
సాత్నా is located in Madhya Pradesh
సాత్నా
సాత్నా
మధ్య ప్రదేశ్ పటంలో నగర స్థానం
Coordinates: 24°36′02″N 80°49′56″E / 24.6005°N 80.8322°E / 24.6005; 80.8322
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాసత్నా
విస్తీర్ణం
 • నగరం71 కి.మీ2 (27 చ. మై)
 • Metro111 కి.మీ2 (43 చ. మై)
Elevation
315 మీ (1,033 అ.)
జనాభా
 (2011)[2]
 • నగరం2,80,222
 • Rank8th (in state)
 • జనసాంద్రత3,900/కి.మీ2 (10,000/చ. మై.)
Time zoneUTC+05:30 (IST)
PIN
485001
టెలిఫోన్ కోడ్(+91) 07672
Vehicle registrationMP-19
అధికారికహిందీ[3]

సాత్నా మధ్యప్రదేశ్ రాష్ట్రం, సత్నా జిల్లా లోని నగరం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. సత్నా జిల్లా బగేల్‌ఖండ్ ప్రాంతంలో భాగం. దీనిలో ఎక్కువ భాగం రీవా పాలనలో ఉండేది. సత్నాలో కొంత భాగాన్ని భూస్వామ్య ప్రభువులు పాలించారు, వారి రాజ్యాలను బ్రిటిష్ రాజ్ కింద ఉంచారు.

పట్టణం పేరు సత్నా నది మీదుగా వచ్చింది. ఇది పన్నా జిల్లాలోని సారంగ్పూర్ గ్రామానికి సమీపంలో ఉన్న సారంగ్ ఆశ్రమం (సుతీక్ష్ణ ఆశ్రమం) వద్ద ఉద్భవించింది. గతంలో, సత్నా రైల్వే స్టేషను, రఘురాజ్ నగర్ అనే పట్టణానికి చెందినదిగా ఉండేది. క్రమంగా ఈ స్టేషను పేరే పట్టణానికి కూడా వచ్చింది.

1872 లో బ్రిటిష్ వారు సత్నాలో బగేల్‌ఖండ్ ఏజెన్సీని స్థాపించారు దీన్ని 1931 లో రద్దు చేసారు. కల్నల్. DWK బార్ 1882–88 సంవత్సరాలలో సత్నాను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేశాడు. సర్ డోనాల్డ్ రాబర్ట్‌సన్ 1888–94లో ఆ ప్రణాళికల ప్రకారం రోడ్లు, ఇతర సౌకర్యాల నిర్మాణాలు కావించాడు.

భౌగోళికం

[మార్చు]
పరస్మణీయ కొండలు

సత్నా 24°20′N 80°29′E / 24.34°N 80.49°E / 24.34; 80.49 వద్ద, సముద్ర మట్టం నుండి 315 మీటర్ల ఎత్తున ఉంది..[4]

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సత్నా మొత్తం జనాభా 2,80,222, వీరిలో 1,47,874 మంది పురుషులు, 1,32,348 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 32,774. సత్నాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 209,825, ఇది జనాభాలో 74.9%, పురుషుల అక్షరాస్యత 79.5%, స్త్రీల అక్షరాస్యత 69.7%. సత్నాలో ఏడేళ్ళపైబడినవారిలో అక్షరాస్యత 84.8%. అందులో పురుషుల అక్షరాస్యత 90.1%, స్త్రీల అక్షరాస్యత 78.9%. షెడ్యూల్డ్ కులాల జనాభా 38,978, షెడ్యూల్డ్ తెగల జనాభా 9,381. 2011 లో సత్నాలో 54,699 గృహాలున్నాయి. [2]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, సత్నా జనాభా 2,25,468 ఉంది, వీరిలో 1,20,203 మంది పురుషులు, 1,05,265 మంది మహిళలు ఉన్నారు. నగర అక్షరాస్యత 69.6%, ఇందులో పురుషుల అక్షరాస్యత 76.2%, స్త్రీల అక్షరాస్యత 62.1%. 2001 లో సత్నాలో ఆరేళ్ళ లోపు పిల్లలు 33,205 మంది ఉన్నారు.[5]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

సత్నా భారతదేశంలోని సున్నపురాయి విరివిగా దొరికే ప్రాంతంలో ఉంది. ఫలితంగా, భారతదేశపు మొత్తం సిమెంటు ఉత్పత్తిలో 8% –9% వరకు ఇక్కడి నుండే వస్తుంది. ఈ ప్రాంతంలో డోలమైట్, సున్నపురాయి పుష్కలంగా లభిస్తాయి. సత్నా నగరంలో పది సిమెంట్ కర్మాగారాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు సిమెంటును ఎగుమతి చేస్తున్నాయి. సత్నాలోని విద్యుత్తు కేబుళ్ళ తయారీ కంపెనీ యూనివర్సల్ కేబుల్స్, దేశంలోని మార్గదర్శకులలో ఒకటి. సత్నా నగరాన్ని బగేల్‌ఖండ్ ప్రాంతపు వాణిజ్య రాజధానిగా పిలుస్తారు. దేశంలోని ప్రఖ్యాత పారిశ్రామిక సంస్థలు నెలకొల్పిన అనేక కొత్త పరిశ్రమల కారణంగా ఈ నగరం మధ్యప్రదేశ్ లో ఉజ్వలమైన భవిష్యత్తున్న నగరాలలో ఒకటయింది. ఈ నగరం ఆర్థిక సరళీకరణ అనంతర కాలంలో (1993 తరువాత) చురునైన వృద్ధిని సాధించింది. నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో, సరిపోని విద్యుత్, రహదారి పరిస్థితులు, సిమెంట్ కర్మాగారాలనుండి వెలువడే వ్యర్ధాల వలన ఏర్పడిన వాయు కాలుష్యం ముఖ్యమైనవి. సత్నాను భారతదేశ సిమెంట్ నగరంగా పిలుస్తారు. [6] [7] [8]

శీతోష్ణస్థితి

[మార్చు]

సట్నాలో తేమతో కూడిన ఉపఉష్ణమండల శీతోష్ణస్థితి ( కొప్పెన్ క్లైమేట్ వర్గీకరణ Cwa ) ఉంటుంది. వేడి వేసవి, కొంతవరకు చల్లటి రుతుపవనాలు, చల్లని శీతాకాలాలు ఉంటాయి. జూన్ నుండి సెప్టెంబరు వరకు ఉండే వర్షాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి.

శీతోష్ణస్థితి డేటా - Satna (1981–2010, extremes 1901–2011)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 32.9
(91.2)
36.8
(98.2)
41.1
(106.0)
45.0
(113.0)
47.6
(117.7)
47.8
(118.0)
45.0
(113.0)
39.5
(103.1)
38.3
(100.9)
38.9
(102.0)
38.2
(100.8)
32.9
(91.2)
47.8
(118.0)
సగటు అధిక °C (°F) 24.0
(75.2)
27.2
(81.0)
33.2
(91.8)
38.9
(102.0)
41.7
(107.1)
39.1
(102.4)
33.1
(91.6)
31.6
(88.9)
32.0
(89.6)
32.5
(90.5)
29.4
(84.9)
25.9
(78.6)
32.4
(90.3)
సగటు అల్ప °C (°F) 9.2
(48.6)
12.1
(53.8)
16.9
(62.4)
22.4
(72.3)
27.0
(80.6)
27.9
(82.2)
25.8
(78.4)
25.1
(77.2)
24.3
(75.7)
20.0
(68.0)
14.2
(57.6)
9.8
(49.6)
19.6
(67.3)
అత్యల్ప రికార్డు °C (°F) 0.6
(33.1)
1.1
(34.0)
4.4
(39.9)
12.2
(54.0)
18.3
(64.9)
19.4
(66.9)
17.8
(64.0)
20.5
(68.9)
16.7
(62.1)
10.0
(50.0)
4.8
(40.6)
0.4
(32.7)
0.4
(32.7)
సగటు వర్షపాతం mm (inches) 17.5
(0.69)
25.7
(1.01)
12.0
(0.47)
7.7
(0.30)
14.2
(0.56)
133.2
(5.24)
308.4
(12.14)
307.7
(12.11)
207.4
(8.17)
36.1
(1.42)
6.6
(0.26)
6.8
(0.27)
1,083.2
(42.65)
సగటు వర్షపాతపు రోజులు 1.5 1.7 1.1 0.9 1.3 6.5 13.0 12.9 8.7 2.0 0.6 0.6 50.9
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 48 38 26 18 23 45 72 77 71 49 44 48 47
Source: India Meteorological Department[9][10]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

రోడ్లు

[మార్చు]

సత్నా నుండి మధ్యప్రదేశ్ లోని వివిధ నగరాలకు, ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని నగరాలకూ బస్సు సర్వీసులు ఉన్నాయి. ఈ నగరం రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారి ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. సాత్నా జాతీయ రహదారి-7 పై ఉంది. జాతీయ రహదారి -75 సాత్నా నడిబొడ్డు నుండి వెళుతుంది. ఇది నగరాన్ని, ఉత్తర మధ్య ప్రదేశ్ లోని ఇతర ముఖ్యమైన నగరాలు పన్నా, రేవా నగరాలకు కలుపుతుంది.

రైల్వేలు

[మార్చు]
సత్నా రైల్వే లైన్ వీక్షణ.

సత్నా జంక్షన్ [11] రైల్వే స్టేషన్ (ఐఆర్‌సిటిసి కోడ్ ఎస్‌టిఎ) జబల్పూర్ జంక్షన్ - అలహాబాద్ మార్గంలో పశ్చిమ-మధ్య రైల్వే విభాగంలో ఒక జంక్షన్ స్టేషను. ఇక్కడి నుండి ఇక మార్గం రీవాకు వెళుతుంది. ఇది ముంబై - హౌరాలను కలిపే రైలు మార్గం, హౌరా-అలహాబాద్-ముంబై మార్గంలో ఉంది. పశ్చిమ మధ్య రైల్వే వారి డీజిల్ లోకోషెడ్ నగరంలో ఉంది. సత్నా నుండి జబల్పూర్ జంక్షనుకు దూరం సుమారు 200 కిలోమీటర్లు, అలహాబాద్ సుమారు 186 కిలోమీటర్లు

నగర ప్రముఖులు

[మార్చు]

మూలలు

[మార్చు]
  1. 1.0 1.1 "Satna Info" (PDF). mohua.gov.in. Retrieved 23 November 2020.
  2. 2.0 2.1 "Census of India: Satna". www.censusindia.gov.in. Retrieved 9 October 2019.
  3. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 14 April 2019.
  4. "Falling Rain Genomics, Inc -Satna". Fallingrain.com. Retrieved 31 August 2011.
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  6. "Cement City of India". spantechnologies.in. SPAN Technologies. Retrieved 30 November 2016.
  7. "Cement Capital Of India". seac.co.in. seac. Archived from the original on 3 ఆగస్టు 2017. Retrieved 2 August 2017.
  8. "Cement Plants in Satna". edbc.co.in. edbc. Archived from the original on 2 ఆగస్టు 2017. Retrieved 2 August 2017.
  9. "Station: Satna Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 687–688. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 28 December 2020.
  10. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M129. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 28 December 2020.
  11. http://www.wcr.indianrailways.gov.in/uploads/files/1389008100508-Microsoft%20Word%20-%20STA.pdf

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సాత్నా&oldid=3988173" నుండి వెలికితీశారు