ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్
తరహాభారతీయ రైల్వేలు అనుబంధ సంస్థ
స్థాపన
ప్రధానకేంద్రమున్యూఢిల్లీ, భారత దేశము
కార్య క్షేత్రంభారత దేశము
పరిశ్రమభారతీయ రైల్వేలు
సేవలుక్యాటరింగ్, టూరిజం మరియు ఆన్‌లైన్ టికెట్ సేవలు
మాతృ సంస్థభారతీయ రైల్వేలు
వెబ్ సైటుIRCTC website

ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) అనేది ఇండియన్ రైల్వేస్యొక్క అనుబంధ సంస్థ. ఈ సంస్థ రైళ్ళలో ఆహారము, తినుబండారములు, చల్లని పానీయములు, తదితర వస్తువుల సరఫరా, పర్యాటకము మరియు ప్రయాణీకులు ఆన్లైన్‌లో (అంతర్జాలం ద్వారా) టికెట్లు తీసుకోగలగడం ఇత్యాది సేవలకు సంబంధించిన కార్యములు నిర్వహిస్తుంది.

సేవలు[మార్చు]

రైళ్ళలో ఆహారము మరియు తదితర వస్తువుల సరఫరా[మార్చు]

IRCTC భారతదేశము మొత్తములో ఉన్న రైల్వే స్టేషన్‌లలో మరియు రైళ్ళలోనూ ఆహారము మరియు తదితర వస్తువుల సరఫరాకు బాధ్యత వహిస్తుంది. రైలు ఎంత దూరం ప్రయాణిస్తుంది మరియు సరాసరిన ప్రయాణీకులు ఎంత మంది వస్తారు అన్న విషయము మీద ఆధారపడి, "'ఆ"' రైలులోనే (IRCTC వారు) స్వంతముగా ఆహారము తయారు చేసే వీలు ఉన్న చిన్న గదిలో (ప్యాంట్రీ కార్) లేదా మార్గ మధ్యములో కొన్ని ఎంపిక చేయబడిన స్టేషన్‌ల ద్వారా కానీ ఈ సంస్థ ఆహారమును ప్రయాణీకులకు అందించేలా కానీ చూస్తుంది.

ఆన్లైన్‌లో టికెట్‌కు సంబంధించిన సేవలు[మార్చు]

IRCTC భారతదేశములో రైళ్ళ టికెట్‌కు సంబంధించిన సేవల రూపు రేఖలు మార్చేసిన ఘనతను సొంతం చేసుకుంది. ఇది తొలిసారిగా తన వెబ్ సైట్ ద్వారా ఇంటర్నెట్ / అంతర్జాలం ద్వారా రైల్ టికెట్‌ను ముందుగా తీసుకోగలిగేలా చేసింది. అలాగే GPRS లేదా SMS లను వాడుకుని మొబైల్ ఫోన్ల ద్వారా కూడా తీసుకోగలిగే వీలు కల్పించింది. టికెట్‌ను రద్దు చేయటం కానీ లేదా మార్పులు వంటివి కూడా ఆన్లైన్ లో చేసుకునే వీలు ఉంది.

E-టికెట్లతో పాటు, IRCTC ద్వారా I-టికెట్ లను కూడా తీసుకునే వీలు ఉన్నది, ఇవి మాములు టికెట్ల వంటివే, కాకపొతే ఇవి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోబడతాయి మరియు తపాలా ద్వారా పంపించబడతాయి. టికెట్ల యొక్క పిఏన్‌ఆర్ (PNR) స్టేటస్ (పరిస్థితి) కూడా ఈ మధ్యే ఇక్కడ అందుబాటులో ఉంచబడింది. IRCTC వెబ్‌సైట్ ద్వారా ముంబై యొక్క సబ్‌-అర్బన్ రైల్వేలో ఉన్న కంప్యూటర్లు రోజూ తిరిగే వారికి నెల అంతటకు సరిపోయేలా ఒకేసారి తీసుకునే వీలు మరియు టికెట్లను కూడా ఇస్తాయి.

IRCTC ఈ మధ్య బాగా ప్రయాణాలు చేసే వారికి కృతజ్ఞతగా "శుభ యాత్ర" అనే పేరుతో ఒక కార్యక్రమమును మొదలు పెట్టింది. దీని ద్వారా, ప్రయాణీకులు సంవత్సరమునకు ఒకసారి ఫీజు కట్టడం ద్వారా ఆ సంవత్సరము మొత్తము మీద కొన్న ప్రతి టికెట్ పైన తగ్గింపు పొందుతారు.[1]

పర్యాటక రంగం[మార్చు]

IRCTC మన దేశానికి చెందిన మరియు ఇతర దేశములకు చెందిన ప్రయాణీకులకు వారి ఆదాయ వ్యయములకు తగినట్లుగా మరియు అత్యంత సుఖకరమైన ప్రయాణ సౌకర్యములు కలిసికట్టుగా కూడా అందిస్తున్నది. అలాంటి వాటిలో ఆదాయ వ్యయములకు తగినట్లుగా అందించబడుతున్న సేవ కొరకు చూసే ప్రయాణీకులలో అత్యంత ఆదరణ పొందినది భారత్ దర్శన్ కార్యక్రమం, ఇందులో ప్రయాణీకులు భారతదేశములో ఉన్న ముఖ్యమైన దర్శనీయ స్థలములు అన్నిటికి వెళ్లి రాగలుగుతారు.[2] అత్యంత సుఖమైన ప్రయాణమును అందించేవి కూడా అందుబాటులో ఉన్నాయి, ఇవి ప్రత్యేకమైన విలాసవంతమైన రైళ్ళలో ఉంటాయి, అవి:

 • పాలెస్ ఆన్ వీల్స్
 • రాయల్ ఓరియంట్ ఎక్స్ ప్రెస్
 • గోల్డెన్ ఛారియట్
 • డెక్కన్ ఒడిస్సీ
 • రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్
 • బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్

మరియు మహారాజాస్' ఎక్స్‌ప్రెస్ యొక్క కార్యకలాపములో IRCTC ఒక భాగస్వామి.[3]

ఎవరైనా సరే రైల్ టూరిజం.కాం (railtourismindia.com.) [4] లోకి లాగ్‌ఆన్ అవ్వవచ్చు మరియు రైల్ టూర్ పాకేజ్, సెలవుల పాకేజ్, హోటళ్లు, అద్దె కార్లు, పర్యాటకుల రైలు వంటి వాటిని ఆన్లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. సంప్రదాయ పర్యాటకముతో పాటుగా, IRCTC సాహసములతో కూడిన పర్యాటక సేవలను కూడా అందిస్తోంది, వాటిలో నీళ్ళలో ఆడే ఆటలు, సాహసములు మరియు వన్య జీవితములో నడకలు మొదలైనవి కూడా ఉన్నాయి. ప్రత్యేక అవసరములకు అనుగుణముగా పర్యాటకమును రూపుదిద్దడము అనేది ఒక అదనపు ఆకర్షణగా నిలచింది.

పురస్కారాలు మరియు సాధనలు[మార్చు]

ఆన్లైన్ లోకి వచ్చిన కొద్ది సమయములోనే, IRCTC వెబ్సైట్ ఆసియా-పసిఫిక్ ప్రాంతములోనే, 2003లో దాదాపు ఆరు లక్షల నమోదు చేసుకున్న వినియోగదారులతో అతి పెద్ద మరియు త్వరగా అభివృద్ధి సాధిస్తున్న e-కామర్స్ వెబ్సైట్ అయింది.[5]

IRCTC సాధించిన మరికొన్ని పురస్కారములు ఇలా ఉన్నాయి:

 • భారత ప్రభుత్వము యొక్క పర్యాటక శాఖచే నేషనల్ టూరిజం అవార్డ్ ఆఫ్ ఎక్స్లెన్స్ ను పొందినది.
 • భారత ప్రభుత్వము మరియు హర్యానా ప్రభుత్వముల సంయుక్త ఆధ్వర్యములో 2007-08 సంవత్సరములకు నేషనల్ అవార్డ్ ఫర్ E-గవర్నెన్స్ ను పొందినది.
 • జీనియస్ ఆఫ్ ది వెబ్ అవార్డ్ 2007 ను "బెస్ట్ E-గవర్నెన్స్ PSU సైట్" అయినందుకు CNBC నుండి సొంతం చేసుకుంది.
 • ముంబైలో 9 నుండి 2008 ఫిబ్రవరి 11 వరకు జరిగిన ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ ఆఫ్ ఇండియా (TTF & OTM 2008) లో IRCTC టూరిజం ఆఫ్ వెస్ట్ జోన్ బెస్ట్ వాల్యూ లీజర్ ప్రొడక్ట్ విభాగములో గెలుపొందింది.
 • "మాములు ప్రజలకు అర్ధమయ్యేలా, అందుబాటులో ఉన్న అప్లికేషన్ " అయినందుకు 2007-08 సంవత్సరమునకు నేషనల్ అవార్డ్ ఫర్ E-గవర్నెన్స్ ను గెలుచుకుంది.
 • ముంబైలో 10 నుండి 2007 ఫిబ్రవరి 12 లో జరిగిన ట్రావెల్ అండ్ టూరిజం ఫైర్ ఆఫ్ ఇండియా (TTF & OTM 2007) లో IRCTC టూరిజం యూనిట్ మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ విభాగములో విజేతగా నిలచింది.
 • 2007 లో "బెస్ట్ E-గవర్నెన్స్ ప్రాజెక్ట్" కొరకు CSI-నిహిలేంట్ E-గవర్నెన్స్ వరించింది.
 • ICICI బ్యాంక్ యొక్క రీటైల్ ఎక్స్లెన్స్ అవార్డ్ ను 2005లో గెలుచుకుంది.
 • 2003 మరియు 2004 సంవత్సరములలో డేటాక్వెస్ట్ నుంచి పాత్ బ్రేకర్ అవార్డ్ ను సొంతం చేసుకుంది.
 • మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినీ రత్న కాటగిరీ -1 ను పొందింది.

సూచనలు[మార్చు]

 1. శుభ్ యాత్ర లాయల్టీ ప్రోగ్రాం
 2. భారత్ దర్శన్
 3. Gupta, Jayanta (2010-03-19). "Rs 1 lakh a night on Maharajas' Express". Times of India. Retrieved 2010-04-06. Cite news requires |newspaper= (help)
 4. [1]
 5. "At your doorstep". The Hindu. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]