ఆరోగ్య సేతు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరోగ్య సేతు అప్లికేషన్ లోగో

ఆరోగ్య సేతు, ఇది భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 ట్రాకింగ్ మొబైల్ అప్లికేషన్.[1]

ప్రధాన ఉద్దేశాలు[మార్చు]

ఈ యాప్ ప్రధాన ఉద్దేశాలు: కోవిడ్-19, కరోనా వైరస్ గురించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం, భారతదేశంలోని ప్రజలకు ఆవశ్యకమైన ఆరోగ్య సేవల్ని అనుసంధానం చేయడం.‘ఆరోగ్య సేతు’. ప్రైవేటు భాగస్వామ్యంతో కేవలం 4 రోజుల్లోనే దీన్ని డిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల వివరాలు ఇందులో ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తుంటారు. ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించే ముందు ప్రజలు మొదట వారి మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. ఓటీపీ ఆధారంగా మొబైల్ నెంబర్ ధృవీకరణ చేయబడిన తర్వాత సైన్ ఇన్ చేయబడుతుంది. ఇందులో పేరు, వయస్సు, లింగం, వృత్తి, ప్రయాణ చరిత్ర మొదలైన వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.ఈ యాప్‌లో కరోనా హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. వినియోగదారులు దీని ద్వారా ఆయా రాష్ట్రాల తాజా కరోనా సమాచారం ఎప్పటికప్పుడు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా తెలుసుకోవచ్చు.ఈ యాప్ కోవిడ్-19 ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరిస్తూ, ఉత్తమ పద్ధతులు, సలహాలు ప్రజలందరితోనూ పంచుకుంటుంది. ఇది భారతప్రభుత్వ ఆరోగ్య శాఖ యొక్క ప్రయత్నాలకు అనువర్తనంగా ఉపయోగపడుతుంది.[2]

సాంకేతిక వివరాలు[మార్చు]

ఇది ఒక ట్రాకింగ్ యాప్: కరోన వైరస్ సంక్రామ్యతను ట్రాక్ చేయడం కొరకు స్మార్ట్ ఫోన్లలో వుండే, విశ్వంలో ప్రస్తుతం మనమున్న స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థ (GPS), బ్లూటూత్ ఫీచర్లను ఉపయోగిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్లలో ఆరోగ్య సేతు యాప్ అందుబాటులో ఉంది. బ్లూటూత్ సాంకేతికతను ఉపయోగించి, ఆరోగ్య సేతు భారతదేశం అంతటా తెలిసిన కేసుల డేటాబేస్ ద్వారా కోవిడ్-19 సోకిన వ్యక్తి సమీపంలో ఉంటే (ఆరు అడుగుల దూరం లోపు) ఆ వ్యక్తిని గుర్తించి హెచ్చరిస్తుంది. ఇంతేకాకుండా, మొబైలు ఫోను స్థాన సమాచారాన్ని ఉపయోగించుకుంటూ, అందుబాటులో ఉన్న దత్తాంశ రేఖాంశాల ఆధారంగా, మనం కోవిడ్-19 సోకిన ప్రాంతాలలో వున్నమా అనే విషయం గురించి కూడా హెచ్చరిస్తుంది.[2] ఎవరైనా ఒక వ్యక్తి అప్పటికే కరోనా పాజిటివ్‌గా నమోదైన వ్యక్తితో కాంటాక్ట్ అయినట్టయితే, సదరు వ్యక్తి వివరాలను ప్రభుత్వానికి వెంటనే చేరుస్తుంది. ఫోన్ లొకేషన్‌ను ఉపయోగించుకోవడం ద్వారా ఈ యాప్ తగిన సమాచారం అందిస్తుంది[3]

మే 26, 2020 న భారతప్రభుత్వం ఈ యాప్ యొక్క సోర్స్ కోడ్ ను గిట్ హబ్ ద్వారా అందరికీ లభ్యం అయ్యెలా చేసింది.[4] ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లపై ఉచితంగా లభింస్తుంది.

అందుబాటులొవున్న భాషలు[మార్చు]

ఆరోగ్య సేతు ప్రస్తుతం 12 భారతీయ భాషలలో అందుబాటులో ఉంది

  1. ఆంగ్లం
  2. హిందీ
  3. తెలుగు
  4. కన్నడం
  5. మలయాళం
  6. తమిళం
  7. పంజాబీ
  8. బెంగాలీ
  9. ఒరియా
  10. గుజరాతీ
  11. మరాఠీ
  12. అస్సామీస్

త్వరలో మరిన్ని భారతీయ భాషలలో అందుబాటులోకి రాబోతుంది.[5]


ప్రత్యేకతలు[మార్చు]

ఆరోగ్య సేతు పూర్వ రూపం కరోన కవచ్ - ప్రస్తుతం కరోనా కవచ్ నిలిపివేసి, దీని స్థానంలో ఆరోగ్య సేతు యాప్ ను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది[6],ఆరోగ్య సేతు ప్రారంభమైన మూడు రోజులలోనే యాభై లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.[7] ప్రారంభించిన కేవలం 13 రోజులలో 50 మిలియన్లకు పైగా, 40 రోజులలో 10 కోట్లకు పైగా ఇన్‌స్టాల్‌లతో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మొబైల్ యాప్ గా పేరుగాంచింది[8][9] ప్రపంచం లోనే అత్యధికంగా డౌన్లోడ్ చేసుకోబడ్డ ఆరోగ్యానికి సంబంధించిన యాప్ గా ఆరోగ్య సేతు గుర్తించబడింది.[10]
ఆరోగ్య సేతు పరిధి ఒక సాధారణ యాప్ కంటే ఎక్కువ. ఇది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (API) ద్వారా ఇతర కంప్యూటర్ ప్రోగ్రామ్ లకు, మొబైల్ అప్లికేషన్లుకు, వెబ్ సర్వీసులకు తన ఫీచరులును, డేటాను అందిస్తుంది.[5]

విమర్శలు[మార్చు]

భారతప్రభుత్వం ఎప్పుడైతే ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చెసుకోవడం తప్పనిసరి చేసిందో, అనేక విమర్శలు కూడా రావడం ప్రారంభమయ్యాయి. రాహుల్ గాంధి ఆరోగ్య సేతును ఒక అధునాతన నిఘా వ్యవస్థ గా అభివర్నించాడు.[11] 2020, మే నెల 5 వ తారీఖున, ట్విట్టర్‌లో ఇలియట్ ఆల్డెర్సన్ అనే పేరుతో చెలామణి అయ్యే ఫ్రెంచ్ నైతిక (యెథికల్) హ్యాకర్ రాబర్ట్ బాప్టిస్ట్, ఈ యాప్ లో భద్రతా సమస్యలు ఉన్నాయని పేర్కొన్నాడు.[12] దీనిని కొట్టిపడేసిన భారత ప్రభుత్వం, యాప్ డెవలపర్లకు బదులు చెపుతూ, మే నెల 6 వ తారీఖున ఇతను ప్రధానమంత్రి కార్యాలయం, భారత పార్లమెంట్, హోం ఆఫీస్ లలో ఎంత మంది అనారోగ్యంతో ఉన్నారు, ఎంతమందికి కోవిడ్-19 వ్యాధి సోకింది వంటి వివరాలను ఇస్తూ, ఆరోగ్య సేతు హ్యాకర్లకు తమకు కావాల్సిన ప్రాంతాలలో "ఎవరు అనారోగ్యంతో ఉన్నారు, ఎవరికి కోవిడ్-19 వ్యాధి సోకింది, ఎంతమంది ఈ యాప్ ద్వారా స్వీయ పరిశీలన చెసుకొన్నారు" వంటి విషయాలు తెలుసుకొవడం సాధ్యపడేలా చేస్తుంది అని నిరూపించాడు.[13]

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్. శ్రీకృష్ణ ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించడం పూర్తిగా చట్టవిరుద్ధం గా పేర్కొన్నాడు.[14]


మూలాలు[మార్చు]

  1. "Aarogya Setu App Download Link { Play Store } For Android Mobile & IOS, PC & Jio Phone, How to Use & Install India COVID 19 Tracker". Latest Education Updates (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-18. Retrieved 2020-04-20.
  2. 2.0 2.1 "Govt launches 'Aarogya Setu', a coronavirus tracker app: All you need to know". Livemint (in ఇంగ్లీష్). 2020-04-02. Retrieved 2020-04-05.
  3. "కరోనా అవగాహనా యాప్ ఆరోగ్య సేతు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Retrieved 2020-06-03.
  4. "Aarogya Setu". GitHub (in ఇంగ్లీష్). Retrieved 2020-05-30.
  5. 5.0 5.1 "Aarogya Setu App". Archived from the original on 2020-04-11. Retrieved 2020-04-05.
  6. "Govt discontinues Corona Kavach, Aarogya Setu is now India's go-to COVID-19 tracking app". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-05. Retrieved 2020-04-05.
  7. "Aarogya Setu App Crosses 5 Million Installs in 3 Days". NDTV Gadgets 360 (in ఇంగ్లీష్). Retrieved 2020-04-05.
  8. "Aarogya Setu beats 'Pokémon GO' record, crosses 50 million downloads in 13 Days". WION (in ఇంగ్లీష్). Retrieved 2020-04-23.
  9. Upadhyay, Harsh (2020-05-13). "Aarogya Setu app crosses 100 million downloads in 40 days". Entrackr (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-17.
  10. Agencies, BS Web Team & (2020-05-09). "Aarogya Setu most downloaded healthcare app in the world, says Amitabh Kant". Business Standard India. Retrieved 2020-05-17.
  11. "Rahul Gandhi terms Aarogya Setu a 'sophisticated surveillance system', RS Prasad hits back". Moneycontrol. Retrieved 2020-05-17.
  12. Banerjee, Prasid (2020-05-05). "French hacker finds security issue in Aarogya Setu, says Rahul Gandhi was right". Livemint (in ఇంగ్లీష్). Retrieved 2020-05-17.
  13. "Aarogya Setu Security Issue Exposed PMO, MHA Employee Data: Hacker". The Quint (in ఇంగ్లీష్). 2020-05-06. Retrieved 2020-05-17.
  14. "Mandating use of Aarogya Setu app illegal, says Justice B N Srikrishna". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-13. Retrieved 2020-05-17.

వెలుపలి లంకెలు[మార్చు]