భారతదేశ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మూస:Infobox Exchange

భారత జాతీయ వాటావిపణీ వినిమయము (భారత దేశ స్టాక్ ఎక్స్చేంజ్- ఎన్‌ఎస్‌ఈ ) భారత్‌లోని ముంబైలో ఉన్న స్టాక్‌ ఎక్స్ఛేంజి.హిందీ: [राष्ट्रीय शेअर बाज़ार Rashtriya Śhare Bāzaār] error: {{lang}}: text has italic markup (help) గుత్త పెట్టుబడుల విషయంలో ఇది ప్రపంచంలో 9వ అతి పెద్ద స్టాక్‌ ఎక్స్ఛేంజి. రోజువారీ టర్నోవర్‌; ఈక్విటీ, వ్యుత్పన్న లావాదేవీలు (డెరివేటివ్ ట్రేడ్ల) సంఖ్య వంటి విషయాల్లో భారత్‌లోకెల్లా అతి పెద్దది.[1] 2010 డిసెంబరు నాటికి ఎన్‌ఎస్‌ఈకి US$1.59 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌, 1,552కు పైగా లిస్టింగులున్నాయి.[2] భారత్‌లో మరెన్నో ఇతర ఎక్స్ఛేంజిలున్నా ఎన్‌ఎస్‌ఈ, బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజిలే రెండు అతి ముఖ్యమైన ఎక్చ్ఛేంజిలు. మెజారిటీ షేర్‌ లావాదేవీలు వాటిలోనే జరుగుతుంటాయి. ఎన్‌ఎస్‌ఈ కీలక సూచీ ఎస్‌ అండ్‌ పీ సీఎన్‌ఎక్స్‌ నిఫ్టీ. దీన్ని ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి నిఫ్టీ) గా పిలుస్తారు. ఇది 50 అతి పెద్ద స్టాక్స్‌ను మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా కొలిచే తూనిక.

భారత్‌లోని పలు ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక మధ్యవర్తిగదార్లు ఎన్‌ఎస్‌ఈకి సంయుక్త సొంతదార్లు. కానీ యాజమాన్యం, నిర్వహణ వేర్వేరుగా కొనసాగుతాయి.[3] ఎన్‌వైఎస్‌ఈ యూరోనెక్స్ట్‌, గోల్డ్‌మ్యాన్‌ శాక్స్ రూపంలో కనీసం రెండు విదేశీ కంపెనీలకు ఎన్‌ఎస్‌ఈలో వాటాలున్నాయి.[4]2006 నాటికి మొత్తం 2,799గా ఉన్న ఎన్‌ఎస్‌ఈ వీఎస్‌ఏటీ టెర్మినళ్లు దేశవ్యాప్తంగా 1,500 పైగా నగరాలకు అందుబాట్లో ఉన్నాయి.[5] వాటా లావాదేవీల సంఖ్య విషయంలో ఎన్‌ఎస్‌ఈ ప్రపంచంలో మూడో అతి పెద్ద వాటావిపణి.[6] ఇక వృద్ధి విషయానికి వస్తే 16.6 శాతం వృద్ధితో ఎన్‌ఎస్‌ఈ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద విపణి.[7]

మూలాలు[మార్చు]

ఎన్‌ఎస్‌ఈ బిల్డింగ్‌ ఎ ట్‌ బీకేసీ, ముంబై

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి ఆఫ్‌ ఇండియాను భారత ప్రభుత్వం తరఫున పలు ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు సంవర్ధన (ప్రమోట్) చేశాయి. 1992 నవంబరులో పన్ను చెల్లింపు కంపెనీగా ఇది ఏర్పాటైంది. 1993 ఏప్రిల్‌లో దీన్ని ప్రతిభూతి ఒప్పందాలు (సెక్యూరిటీస్‌ కాంట్రాక్ట్స్‌) (నియంత్రణ) చట్టం, 1956 ప్రక్రారం వాటా విపణిగా గుర్తించారు. టోకు వికలన విపణి (డెబిట్‌ మార్కెట్‌) (డబ్ల్యూడీఎం) లో 1994 జూన్‌లో కార్యకలాపాలు మొదలు పెట్టింది. ఎన్‌ఎస్‌ఈ మూలధన విపణి (ఈక్విటీలు) విభాగం 1994 నవంబరులో కార్యకలాపాలు మొదలు పెట్టింది. వ్యుత్పన్నముల (డెరివేటివ్) ‌ విభాగంలో కార్యకలాపాలు 2000 జూన్‌లో మొదలయ్యాయి.

ఆవిష్కరణలు[మార్చు]

భారత క్యాపిటల్‌, ఆర్థిక మార్కెట్ల ఆధునికీకరణ ప్రయత్నాల్లో ఎన్‌ఎస్‌ఈ ముందంజలో నిలిచింది. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌ఈ తొలిసారిగా చేపట్టిన కార్యకలాపాలు:

 • భారత్‌లో షేర్లలో ట్రేడింగ్‌ చేసేందుకు తొలి జాతీయ, విద్యుదాణు అవధిత నిర్దేశ పట్టీ (ఎలక్ట్రానిక్‌ లిమిట్‌ ఆర్డర్‌ బుక్‌) (ఎల్‌ఓబీ) ఎక్స్ఛేంజి. ఎన్‌ఎస్‌ఈ విజయంతో ఇతర విపణి, కొత్త విపణి నిర్మాణాలు కూడా ఎన్‌ఎస్‌ఈ పద్ధతినే అనుసరించడం మొదలు పెట్టాయి.
 • జాతీయ ప్రతిభూతి సమాశోధనా సంస్థ పరిమితం|నేషనల్‌ సెక్యూరిటీస్‌ క్లియరింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో తొలి క్లియరింగ్‌ కార్పొరేషన్‌ను మొదలు పెట్టింది. భారత్‌లో అన్ని రకాల యాజమాన్య (ఈక్విటీ) విపణుల్లో (మార్కెట్లలో‌) (తర్వాత వ్యుత్పన్నాల (డెరివేటివ్) ‌ మార్కెట్లలో కూడా) వ్యవహారాలలో (ట్రేడ్లలో) సృజనాత్మకతకు తెర తీసి మైలురాయిగా నిలిచింది ఎన్‌ఎస్‌సీసీఎల్‌.
 • భారత్‌లో తొలి నిక్షేపణి (డిపాజిటరీ) అయిన జాతీయ ప్రతిభూతి నిక్షేపణీ పరిమితము (నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌) కు సహ సంవర్ధకునిగా (కో-ప్రమోటర్) వ్యవహరించింది.[8]
 • ఎస్‌ అండ్‌ పీ సీఎన్‌ఎక్స్‌ నిఫ్టీని ప్రవేశపెట్టింది.
 • 2000 ఫిబ్రవరిలో అంతర్జాల లావాదేవీలను కూడా మొదలు పెట్టింది. మధ్యవర్తీ సమాజంలో ఎన్‌ఎస్‌ఈని దీనివల్ల అత్యంత ప్రసిద్ధి పొందింది.
 • తొలి ఎక్స్ఛేంజి కావడం వల్ల భారత్‌లో ఎక్స్ఛేంజి ట్రేడెడ్‌ డెరివేటివ్‌లను, ముఖ్యంగా ఈక్విటీ సూచీపై 1996లో మొదలు పెట్టింది. ఈ విధానం మొదలైన నాలుగేళ్లకు, నియంత్రణపై చర్చ, రూపకల్పన అనంతరం ఈక్విటీ డెరివేటివ్‌లలో కూడా ట్రేడింగ్‌ చేపట్టేందుకు అనుమతి సాధించింది.
 • భారత్‌లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్స్‌) లో ట్రేడింగ్‌ చేసేందుకు అనుమతి ఉన్న ఏకైక ఎక్స్ఛేంజి.
 • సీఎన్‌బీసీాటీవీ18 సహకారంతో ఎన్‌ఎస్‌ఈ_సీన్‌బీసీాటీవీ18 పేరుతో మీడియా సెంటర్‌ను ఎన్‌ఎస్‌ఈ ప్రారంభించింది.
 • 1999లో ఏర్పాటైన ఎన్‌ఎస్‌ఈ.ఐటీ లిమిటెడ్‌ 'భారత జాతీయ వాటావిపణీ వినిమయము' నకు 100 శాతం సామంత సంస్థ. ఇది అనులంబనా విశేషజ్ఞ (వెర్టికల్ స్పెషలిస్ట్) ‌ సంస్థ. ఆద్యంత సమాచార సాంకేతికోత్పత్తులు (ఐటీ ప్రోడక్ట్స్), పరిష్కారాలు, సేవలను ఎన్‌ఎస్‌ఈ.ఐటీ అందిస్తుంది.

విపణి విభాగాలు[మార్చు]

ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ మూలధన విపణిలో కింది ముఖ్య విభాగాలున్నాయి:

 • యాజమాన్య (ఈక్విటీ) విభాగం
 • విత్త భావి (ఫ్యూచర్స్) ‌, వైకల్ప (ఆప్షన్స్‌) విభాగం
 • చిల్లర ఋణ విపణి
 • టోకు ఋణ విపణి
 • భావి ముద్రా విపణి (కరెన్సీ ఫ్యూచర్స్)
 • ఉమ్మడి నిధి (మ్యూచువల్ ఫండ్)
 • వాటాల ఋణ దాన/గ్రహణ విభాగం.

అమెరికా డాలర్ భారత రూపాయి మారకంలో భావి ముద్రా విత్తాలను ఎన్‌ఎస్‌ఈ మొదలు పెట్టడంతో 2008 ఆగస్టులో భారత్‌లో ముద్రా-వ్యుత్పన్నాలు (కరెన్సీ డెరివేటివ్స్) రంగప్రవేశం చేశాయి. ప్రస్తుతం యూరో, పౌండ్‌, యెన్‌లలో కూడా ముద్రా భావి విత్తాలను ఎన్‌ఎస్‌ఈ మొదలు పెట్టింది. భారత్‌లో భావి వడ్డీ రేటులను (ఇంటెరెస్ట్ రేట్ ఫ్యూచర్స్) కూడా ఎన్‌ఎస్‌ఈ నే 2009 ఆగస్టు 31న మొదటిసారిగా ప్రారంభించింది. అంటే, ముద్రా భావి విత్తాలను మొదలు పెట్టిన తర్వాత సరిగ్గా ఏడాదికి!

సెబీ-ఆర్‌బీఐ కమిటీ సిఫార్సుల మేరకు 2009 ఆగస్టులో భావి వడ్డీ రేటులకు అనుమతులు పొందిన తొలి భారత వినిమయవిపణిగా ఎన్‌ఎస్‌ఈ అవతరించింది. 7 శాతం పదేళ్ల సీఓఐ బాండ్‌ (నేషనల్‌) ను త్రైమాసిక పక్వతా ప్రాతిపదిక (క్వార్టర్లీ మెచ్యూరిటీ బేసిస్) న భావి విత్త ఒప్పందాలు మొదలయ్యాయి. [9]

పనివేళలు[మార్చు]

సాధారణంగా ఎన్‌ఎస్‌ఈలో శని, ఆదివారాలు, ఎక్స్ఛేంజి (లేదా భారత ప్రభుత్వం) ప్రకటించిన అధికారిక సెలవు దినాలు మినహా ప్రతిరోజూ భారత కాలమానం ప్రకారం ఉదయం 9.15కు ట్రేడింగ్‌ మొదలవుతుంది. మధ్యాహ్నం 3.30 దాకా కొసాగుతుంది.[10] పనివేళలలో బీఎస్‌ఈ (బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజి) తో కలిసి ఉదయం 9.00 నుంచి సాయంత్రం 5.00కు మార్చాలని ఎన్‌ఎస్‌ఈ యోచిస్తోంది.

కొత్త పనివేళల విషయంలో సిస్టమ్‌ తనిఖీలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. కొత్తగా ప్రతిపాదించిన ఈ పనివేళలపై అభిప్రాయాలు, సలహాలు, ఫీడ్‌బ్యాక్‌లను ఎన్‌ఎస్‌ఈ దేశవ్యాప్తంగా ఉన్న బ్రోకర్ల నుంచి ఆహ్వానించింది. ఎలాగైనా ఆసియాలోకెల్లా అతి సుదీర్ఘమైన పనివేళలను ప్రవేశపెట్టాలని భావించింది. కానీ మధ్యవర్తుల నుంచి వచ్చిన గట్టి ప్రతిఘటన కారణంగా చివరికి 2009 నవంబరు 18న ఆ ప్రతిపాదనను విరమించుకుంది.

2009 డిసెంబరు 18 నుంచి పనివేళల ప్రారంభాన్ని ఉదయం 9.00 గంటలుగా మార్చనున్నట్టు 2009 డిసెంబరు 16న ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. కాబట్టి దానిమేరకు ఎన్‌ఎస్‌ఈ పనివేళలు భారత కాలమానం ప్రకారం ఉదయం 9.00 నుంచి సాయంత్రం 3.30గా ఉండాల్సింది.

అయితే, మధ్యవర్తుల నుంచి వచ్చిన గట్టి ప్రతిఘటన కారణంగా కొత్త ప్రకటనను 2010 జనవరి 4 దాకా వాయిదా వేయాలని 2009 డిసెంబరు 17న ఎన్‌ఎస్‌ఈ నిర్ణయించుకుంది.

2010 జనవరి 4 నుంచి ఎన్‌ఎస్‌ఈ కొత్త పనివేళలు భారత కాలమానం ప్రకారం ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 3.30.

మైలురాళ్లు[మార్చు]

 • 1992 నవంబరు: స్థాపన
 • 1993 ఏప్రిల్‌: వాటా వినిమయం (స్టాక్‌ ఎక్స్ఛేంజి) గా గుర్తింపు
 • 1993 మే: వ్యాపార ప్రణాళిక ఏర్పాటు
 • 1994 జూన్‌: టోకు ఋణ విపణి (హోల్‌సేల్‌ డెట్‌ మార్కెట్‌) విభాగం ప్రారంభం
 • 1994 నవంబరు: (యాజమాన్య) మూలధన విపణి -క్యాపిటల్‌ మార్కెట్‌ (ఈక్విటీస్‌) విభాగం ప్రారంభం
 • 1995 మార్చి: మదుపుదార్ల ఇక్కట్ల (ఇన్వెస్టర్ల గ్రీవెన్స్‌) విభాగం ఏర్పాటు
 • 1995 ఏప్రిల్‌: తొలి సమాశోధనా సంస్థ (క్లియరింగ్‌ కార్పొరేషన్‌) ఎన్‌ఎస్‌సీసీఎల్‌ ఏర్పాటు
 • 1995 జూన్‌: వ్యవహార (ట్రేడింగ్) సభ్యులందరికీ కేంద్రీకృత బీమా కవెసులుబాటు ప్రారంభం
 • 1995 జూలై: మదుపుదార్ల పరిరక్షణ నిధి ఏర్పాటు
 • 1995 అక్టోబరు: దేశంలో అతి పెద్ద వాటా వినిమయంగా ఆవిర్భావం
 • 1996 ఏప్రిల్‌: ఎన్‌ఎస్‌సీసీఎల్‌ ద్వారా సమాశోధనా నిమితి (క్లియరింగ్‌ సెటిల్మెంట్‌) ప్రారంభం
 • 1996 ఏప్రిల్‌: ఎస్‌ అండ్‌ పీ సీఎన్‌ఎక్స్‌ నిఫ్టీ స్థాపన
 • 1996 జూన్‌: నిమితి హామీ నిధి (సెటిల్మెంట్‌ గ్యారెంటీ ఫండ్) ‌ ఏర్పాటు
 • 1996 నవంబరు: దేశంలో తొలి నిక్షేపణి (డిపాజిటరీ) జాతీయ ప్రతిభూతి నిక్షేపణీ పరిమితం (నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌) ను ఎన్‌స్‌ఈ సహసంవర్ధన (కో-ప్రమోట్) చేసింది
 • 1996 నవంబరు: భారత సంగణక సమితి (కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా) ద్వారా ఉత్తమ ఐటీ వాడుక పురస్కారం (బెస్ట్‌ ఐటీ యూసేజ్‌ అవార్డు)
 • 1996 డిసెంబరు: అపదార్థ ప్రతిభూతి వ్యవహారాలు/నిమితి (డీమెటీరియలైజ్డ్‌ సెక్యూరిటీల ట్రేడింగ్‌/సెటిల్మెంట్‌) ప్రారంభం
 • 1996 డిసెంబరు: అగ్ర ఐటీ వాడకందారు (టాప్‌ ఐటీ యూజర్‌) గా డేటాక్వెస్ట్‌ అవార్డు
 • 1996 డిసెంబరు: సీఎన్‌ఎక్స్‌ నిఫ్టీ జూనియర్‌ ప్రారంభం
 • 1997 ఫిబ్రవరి: ప్రాంతీయ సమాశోధనా (క్లియరింగ్) విభాగం ఏర్పాటు
 • 1997 నవంబరు: భారత సంగణక సమితి (కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా) ద్వారా ఉత్తమ ఐటీ వాడుక పురస్కారం (బెస్ట్‌ ఐటీ యూసేజ్‌ అవార్డు)
 • 1998 మే: ఇండియా ఇండెక్స్‌ సర్వీసెస్‌ అండ్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎస్‌ఎల్‌) సహ సాహస సంవర్ధన (జాయింట్‌ వెంచర్‌ ప్రమోషన్‌)
 • 1998 మే: ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్‌: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌ఎస్‌ఈ.కో.ఇన్‌ ఏర్పాటు
 • 1998 మే: ఆర్థిక మార్కెట్లలో ఎన్‌ఎస్‌ఈ ప్రమాణన కార్యక్రమ (సర్టిఫికేషన్‌ ప్రోగ్రాం) ప్రారంభం
 • 1998 ఆగస్టు: సైబర్‌ - వార్షిక నమామేలితం పురస్కారం (కార్పొరేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌) 1998 అవార్డు
 • 1999 ఫిబ్రవరి: స్వయంప్రేరిత ఋణ దాన/గ్రహణ (ఆటోమేటెడ్‌ లెండింగ్‌ అండ్‌ బారోయింగ్‌) వ్యవస్థ ఏర్పాటు
 • 1999 ఏప్రిల్‌: చిప్‌ మేగజైన్‌ చిప్‌ వెబ్‌ అవార్డు
 • 1999 అక్టోబరు: ఎన్‌ఎస్‌ఈ.ఐటీ ఏర్పాటు
 • 2000 జనవరి: ఎన్‌ఎస్‌ఈ పరిశోధనా విభాగం ప్రారంభం
 • 2000 ఫిబ్రవరి: అంతర్జాల లావాదేవీలు ప్రారంభం
 • 2000 జూన్‌: వ్యుత్పన్న లావాదేవీలు -డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ (సూచికా భవిష్యాల - ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌) ప్రారంభం
 • 2000 సెప్టెంబరు: శూన్య పర్ణికా లబ్ధాంకం (జీరో కూపన్‌ ఈల్డ్‌ కర్వ్‌) ఏర్పాటు
 • 2000 నవంబరు: ఎన్‌ఎస్‌ఈ.ఐటీ లిమిటెడ్‌, ఐాఫ్లెక్స్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన డోటెక్స్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా దళారీ చౌక్ (బ్రోకర్‌ ప్లాజా) ఏర్పాటు
 • 2000 డిసెంబరు: డబ్ల్యూఏపీ ట్రేడింగ్‌ ప్రారంభం
 • 2001 జూన్‌: సూచికా వైకల్ప వ్యవహారాలు (ట్రేడింగ్‌ ఇండెక్స్‌ ఆప్షన్ల) ప్రారంభం
 • 2001 జూలై: నిరూఢ ప్రతిభూతి వైకల్పాలు (ఇండివిడ్యువల్ సెక్యూరిటీల ఆప్షన్ల) లో వ్యవహారాలు‌ ప్రారంభం
 • 2001 నవంబరు: నిరూఢ భావి ప్రతిభూతుల్లో (ఇండివిడ్యువల్ సెక్యూరిటీల్లో ఫ్యూచర్ల) లో వ్యవహారాలు‌ ప్రారంభం
 • 2001 డిసెంబరు: ప్రభుత్వ ప్రతిభూతుల కోసం ఎన్‌ఎస్‌ఈ వీఏఆర్‌ ప్రారంభం
 • 2002 జనవరి: వినిమయ వ్యవహారిత నిధులు (ఎక్స్ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) )
 • రంభం2002 మే: సంస్థాగత రూపాంతర (ఆర్గనైజేషన్‌ వైడ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌) విభాగంలో వార్టన్‌-ఇన్ఫోసిస్‌ వ్యాపార రూపాంతరణ బహుమతి (బిజినెస్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ అవార్డు) విజేత
 • 2002 అక్టోబరు: ఎన్‌ఎస్‌ఈ ప్రభుత్వ ప్రతిభూతుల సూచీ ప్రారంభం
 • 2003 జనవరి: చిల్లర ఋణవిపణుల్లో ట్రేడింగ్‌ ప్రారంభం
 • 2003 జూన్‌: ఇంటరెస్ట్‌ రేట్‌ ఫ్యూచర్ల ఏర్పాటు
 • 2003 ఆగస్టు: సీఎన్‌ఎక్స్‌ఐటీ సూచీలో ఫ్యూచర్లు, ఆప్షన్ల ప్రారంభం
 • 2004 జూన్‌: ఎస్‌టీపీ ఇంటర్‌ఆపరబిలిటీ ప్రారంభం
 • 2004 ఆగస్టు: లిస్టెడ్‌ కంపెనీలకు ఎన్‌ఎస్‌ఈ ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ఫేస్‌ ప్రారంభం
 • 2005 మార్చి: ఢిల్లీలోని ఈఎంపీఐ బిజినెస్‌ స్కూల్‌ ద్వారా 'ఇండియా ఇన్నొవేషన్‌ అవార్డు'
 • 2005 జూన్‌: బ్యాంక్‌ నిఫ్టీ సూచీలో ఫ్యూచర్లు, ఆప్షన్ల ప్రారంభం
 • 2006 డిసెంబరు: ఆసియా రిస్క్‌ మేగజైన్‌ ద్వారా 'డెరివేటివ్‌ ఎక్స్ఛేంజి ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డు
 • 2007 జనవరి: ఎన్‌ఎస్‌ఈాసీఎన్‌బీసీ టీవీ18 మీడియా సెంటర్‌ ఏర్పాటు
 • 2007 మార్చి: ఇండియాబాండ్‌వాచ్‌ డాట్‌కామ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్‌ఎస్‌ఈ, క్రిజిల్‌ ప్రకటన
 • 2007 జూన్‌: నిఫ్టీ జూనియర్‌, సీఎన్‌ఎక్స్‌ 100లో డెరివేటివ్‌ల ప్రారంభం
 • 2007 అక్టోబరు: నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 50లో డెరివేటివ్‌ల ప్రారంభం
 • 2008 జనవరి: 2008 జనవరి 1 న మినీ నిఫ్టీ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ప్రారంభం
 • 2008 మార్చి: ఎస్‌ అండ్‌ పీ సీఎన్‌ఎక్స్‌ నిఫ్టీ సూచీలో దీర్ఘకాలిక ఆప్షన్‌ కాంట్రాక్టుల ప్రారంభం
 • 2008 ఏప్రిల్‌: ఇండియా వీఐఎక్స్‌ ఏర్పాటు
 • 2008 ఏప్రిల్‌: సెక్యూరిటీస్‌ లెండింగ్‌, బారోయింగ్‌ స్కీమ్‌ ప్రారంభం
 • 2008 ఆగస్టు: కరెన్సీ డెరివేటివ్‌ల ప్రారంభం
 • 2009 ఆగస్టు: ఇంటరెస్ట్‌ రేట్‌ ఫ్యూచర్ల ప్రారంభం
 • 2009 నవంబరు: మ్యూచువల్‌ ఫండ్‌ సేవల వ్యవస్థ ప్రారంభం
 • 2009 డిసెంబరు: కార్పొరేట్‌ బాండ్ల సెటిల్మెంట్‌ ప్రారంభం
 • 2010 ఫిబ్రవరి: అడిషనల్‌ కరెన్సీ పెయిర్లపై కరెన్సీ ఫ్యూచర్ల ప్రారంభం
 • 2010 అక్టోబరు: 15 నిమిషాల ప్రత్యేక ప్రీ ఓపెనింగ్‌ ట్రేడింగ్‌ సెషన్‌ ప్రారంభం. దీని ద్వారా మార్కెట్‌ ఓపెన్‌ అవకముందే ఇన్వెస్టర్లు స్టాక్స్‌ కోసం బిడ్‌ వేయవచ్చు.[11]

సూచీలు[మార్చు]

ఇండియా ఇండెక్స్‌ సర్వీసెస్‌ అండ్‌ ప్రాడక్ట్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎస్‌ఎల్‌) పేరుతో సూచీ సేవల సంస్థను ఎన్‌ఎస్‌ఈ ప్రారంభించింది. దీని ప్రకారం ఈ కింద పేర్కొన్న పలు సూచీలను ప్రవేశపెట్టింది:[12]

 • ఎస్‌ అండ్‌ పీ సీఎన్‌ఎక్స్‌ నిఫ్టీ (స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ క్రిజిల్‌ ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌)
 • సీఎన్‌ఎక్స్‌ నిఫ్టీ జూనియర్‌
 • సీఎన్‌ఎక్స్‌ 100 (=ఎస్‌ అండ్‌ పీ సీఎన్‌ఎక్స్‌ నిఫ్టీ + సీఎన్‌ఎక్స్‌ నిఫ్టీ జూనియర్‌ )
 • ఎస్‌ అండ్‌ పీ సీఎన్‌ఎక్స్‌ 500 (=సీఎన్‌ఎక్స్‌ 100 +72 పరిశ్రమల్లోని 400 మంది దిగ్గజాలు)
 • సీఎన్‌ఎక్స్‌ మిడ్‌క్యాప్‌ (సీఎన్‌ఎక్స్‌ మిడ్‌క్యాప్‌ 200 స్థానంలో 2005 జూలై 1 8న ప్రవేశపెట్టారు)

ఎన్‌ఎస్‌ఈలోని వినిమయ వ్యవహారిత నిధులు[మార్చు]

ఎన్‌ఎస్‌ఈలో ఎన్నో ఎక్స్ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్లున్నాయి. ఇవి సాధారణంగా సూచీ ఫండ్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌లు. ఎన్‌ఎస్‌ఈలోని కొన్ని ప్రఖ్యాత ఈటీఎఫ్‌లు:

ధృవీకరణములు[మార్చు]

ఎన్‌ఎస్‌ఈ ఆన్‌లైన్‌ పరీక్షలు, సర్టిఫికేషన్లు కూడా నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాల కింద ఎన్‌ఎస్‌ఈ సర్టిఫికేషన్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ (ఎన్‌సీఎఫ్‌ఎం) ఉంది.[1] ఇది ప్రస్తుతం 19 మాడ్యూళ్లలో అందుబాటులో ఉంది. ఆర్థిక, క్యాపిటల్‌ మార్కెట్లకు సంబంధించిన వివిధ విభాగాలను ఇది కవర్‌ చేస్తుంది. ఎన్‌ఎస్‌ఈ శాఖలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీటిని కూడా చూడండి

వీటిని కూడా చూడండి[మార్చు]

ఉటంకింపులు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Coordinates: 19°3′37″N 72°51′35″E / 19.06028°N 72.85972°E / 19.06028; 72.85972 (National Stock Exchange) మూస:Stock market మూస:Economy of India related topics