భారత జీవిత బీమా సంస్థ
రకం | పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ LIC Act 1956 |
---|---|
పరిశ్రమ | ఆర్థిక సేవలు |
స్థాపన | 1 సెప్టెంబరు 1956 |
ప్రధాన కార్యాలయం | ముంబై |
కీలక వ్యక్తులు |
|
ఉత్పత్తులు | |
రెవెన్యూ | ₹5,60,78,439 lakh (US$70 billion) (2019)[1] |
₹2,70,348 lakh (US$340 million) (2019)[1] | |
₹2,68,849 lakh (US$340 million) (2019)[1] | |
Total assets | ₹31,11,84,727 lakh (US$390 billion) (2019)[1] |
యజమాని | భారత ప్రభుత్వం (100%) |
ఉద్యోగుల సంఖ్య | 114,000 (2020)[1] |
అనుబంధ సంస్థలు |
|
భారత జీవిత బీమా సంస్థ లేదా లైఫ్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారత ప్రభుత్వ బీమా, పెట్టుబడి సంస్థ. ఈ సంస్థకు 1956, సెప్టెంబరు 1 న బీమా రంగాన్ని జాతీయం చేయడం కోసం పార్లమెంటులో చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు అంకురార్పణ జరిగింది. సుమారు 245 బీమా సంస్థలు, ప్రావిడెంట్ సంస్థలను కలిసి లైఫ్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గా ఏర్పడింది.[2][3]
చరిత్ర
[మార్చు]1818 లో కోల్‌కత లో ప్రారంభమైన ఓరియంటల్ లైఫ్ ఇన్‌స్యూరెన్స్ కంపెనీ భారతదేశంలో జీవిత బీమాను అందించిన తొలి సంస్థ. భారతదేశంలో స్థిరపడ్డ యూరోపియన్లు వీరి ప్రధాన వినియోగదారులు. భారతీయుల బీమా చేయించుకోవాలంటే వీరు అధిక మొత్తంలో సొమ్ము వసూలు చేసేవారు.[4] సురేంద్రనాథ్ టాగూర్ హిందుస్థాన్ ఇన్‌స్యూరెన్స్ సొసైటీని స్థాపించాడు. ఇదే తర్వాత లైఫ్ ఇన్‌స్యూరెన్స్ కార్పొరేషన్ గా మారింది.[5]
1956 లో జాతీయీకరణ
[మార్చు]1955 లో పార్లమెంటు సభ్యుడైన ఫిరోజ్ గాంధీ ప్రైవేటు బీమా సంస్థల మోసాల గురించిన అంశాల్ని లేవనెత్తాడు. తర్వాత జరిగిన దర్యాప్తులో భారతదేశపు అత్యంత ధనిక వ్యాపారస్తుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా యజమానియైన రామకృష్ణ దాల్మియా రెండేళ్ల పాటు జైలుపాలయ్యాడు.[6] 1956 జూన్ 19 నాడు భారత పార్లమెంటు భారత జీవిత బీమా చట్టాన్ని ఏర్పాటు చేసింది. ఈ చట్టంతో భారత జీవిత బీమా సంస్థకు (LIC) అంకురార్పణ జరిగింది.
సంస్థ నిర్మాణం
[మార్చు]ఎల్.ఐ.సి నిర్వాహక బోర్డులో ఛైర్మన్ (ప్రస్తుతం ఎం. ఆర్. కుమార్), మేనేజింగ్ డైరెక్టర్లు ఉంటారు. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది. నిర్వాహక బోర్డు సభ్యులు, ఇంకా ఎక్జిక్యూటివ్ డైరెక్టర్లందరూ ఇక్కడి నుంచే పనిచేస్తారు. ఈ సంస్థకు దేశమంతటా 8 జోనల్ ఆఫీసులు ఉన్నాయి. ఇవి ఢిల్లీ, ముంబై, హైదరాబాదు, చెన్నై, కాన్పూర్, కోల్‌కత్, భోపాల్, పాట్నా.
ఇవీ చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Life Insurance Corporation Ltd. Financial Statements". licindia.in. Archived from the original on 2022-02-04. Retrieved 2021-03-10.
- ↑ Anushka. "LIC – Life Insurance Corporation Of India". My LIC India. Archived from the original on 2020-02-18. Retrieved 2020-02-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-12-27. Retrieved 2021-03-10.
- ↑ "History". LIC. Archived from the original on 16 December 2013. Retrieved 15 December 2013.
- ↑ "Lunch on lotus leaves". www.telegraphindia.com. Retrieved 19 December 2018.
- ↑ Shashi Bhushan, M.P. (1977). Feroze Gandhy: A political Biography. Progressive People's Sector Publications, New Delhi. pp.166, 179. See these excerpts