Jump to content

చర్చ:భారత జీవిత బీమా సంస్థ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
భారత జీవిత బీమా సంస్థ వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2021 సంవత్సరం, 20 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


శీర్షిక సవరణ

[మార్చు]

రవిచంద్ర గారూ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఉండాలనుకుంటాను.ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా అనే తరలింపు లేదా పేజీ సృష్టించి దారిమార్పు చేయాల్సిన అవసరం కూడా ఉంది.శీర్షికలు అవకాశం ఉన్నంతవరకు నిడివి తక్కువ ఉంటేనే బాగుంటుంది.పరిశీలించగలరు. 2021-03-10T13:03:46‎ యర్రా రామారావు

రవిచంద్ర , యర్రా రామారావు గార్లకు, భారతీయ జీవన బీమాసంస్థ / భారతీయ జీవిత బీమా సంస్థ అనే పేర్లు తెలుగులో వాడుకలోవున్నందున వాటిలో ఒక పేరుకు దారిమార్పు లేకుండా తరలించి వ్యాసంలో అవసరమనుకుంటే ప్రవేశికలో ఆంగ్ల పేరు, ఆంగ్ల సంక్షిప్తాక్షారలు LIC చేర్చటం మంచిది.--అర్జున (చర్చ) 08:46, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ ఇలాంటి స్పందనే ఏదో మీవద్దనుండి వస్తుందని ఉహించాను.నేను ముందు రాసిన అభిప్రాయానికి బదులుగా, మీరు తెలిపిన అభిప్రాయం నేను రాసి ఉండి ఉంటే, మీరు నేను పైన రాసిన అభిప్రాయం తెలిపిఉండేవారేమో అని భావిస్తున్నాను. మీ అబిప్రాయం చేప్పబోయే ముందు రాసిన వారి అభిప్రాయాలు గౌరవించి,దాని మీద ఎందుకు వద్దో, ఎందుకు మీరు చెప్పేది ఉండాలో అన్ని చర్చలలో తెలిపితే నేను సంతోషిస్తాను.అదే నేను ముందు రాసి ఉంటే మీరు అంగీకరించి ఉండే వారు కాదోమో!అన్ని వ్యాసాలలో పూర్తి తెలుగు శీర్షికలు ఉండే పద్దతి పాటిస్తే నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్లు ఎవ్వరూ ఉండరని నా అభిప్రాయం. దారి మార్పు చేస్తారా! తరలింపు చేస్తారా! అనేది నాకు అవసరంలేదు అసలు నేను లేవతీసిన చర్చశీర్షిక సృష్టింపులోని "ఇన్‌స్యూరెన్స్" అనే పదం గురించి.ఉండాల్సిన పదం "ఇన్సూరెన్స్" అని.ఇది వాడుకలో ఎక్కువుగా వాడతారు అని నేను చర్చ మొదలు పెట్టింది.గమనించగలరు.చర్చలలో పాల్గొనాలంటే పులినోట్లో తలకాయపెట్టినట్లు ఉండకూడదని నేను భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 09:28, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రామారావు గారు, అర్జునరావు గార్లకు, తెలుగు పేరైతే బాగుంటుందని నా అభిప్రాయం కూడా. గూగుల్ లో కొన్ని తెలుగు పదాలు శోధించి చూశాను. పదాలు వాటి శోధనా ఫలితాలు కింద ఇస్తున్నాను.
  1. భారత జీవిత బీమా సంస్థ లేదా భారత జీవన బీమా సంస్థ (65,900)
  2. భారతీయ జీవిత బీమా సంస్థ (60,700)
  3. భారతీయ జీవన బీమా సంస్థ (27,500)
వీటిలో భారత జీవిత బీమా సంస్థ అనే పదం అత్యంత ప్రాచుర్యమైనదిగా అనిపిస్తోంది. అలాగే భారత జీవన బీమా సంస్థ కు ఇంకా ఆంగ్లపదాలకు దారిమార్పు సృష్టిస్తే సరిపోతుందనుకుంటున్నాను. ఏమైనా అభ్యంతరాలుంటే తెలపండి. రవిచంద్ర (చర్చ) 09:31, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పై వాటిలో మొదటి రెండిటిలో మొదటిది అనగా 'భారత జీవిత బీమా సంస్థ' చాలా ఎక్కువుగా వాడే శీర్షిక అని నా అభిప్రాయం.అందరికి తెలిసిన శీర్షిక. యర్రా రామారావు (చర్చ) 09:49, 10 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు, కేవలం పాఠ్యం రూపంలో వివిధ కాలాలలో జరిగే చర్చలలో ఒకరి అభిప్రాయం ఇంకొకరు పూర్తిగా అర్ధం చేసుకోవటం చర్చ తొలి నాళ్లలో వెంటనే వీలవదు అని మీకు తెలియనిది కాదు. మీ వ్యాఖ్య, చర్చలు సామరస్య పూర్వకంగా కొనసాగటానికి, మనం అందరం స్వచ్ఛందంగా కృషి చేసే తెలుగు వికీపీడియా అభివృద్ధికి దోహద పడదు కావున బాధాకరం. అర్జున (చర్చ) 22:04, 11 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఎల్లైసీ రెండు పేర్లు వాడుతోంది - "లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా", "భారతీయ జీవన్ బీమా నిగం". తెలుగు పేరు గురించి వెతికాను గానీ, నాకేదీ కనబడలేదు. తెలుగు రాష్ట్రాల్లో అది ఇచ్చే ప్రకటనల్లో కనబడవచ్చు - చూద్దాం. అదేదైనా ఉంటే ఈ పేజీకి ఆ పేరే పెట్టాలి. ఆ సంస్థ తెలుగు పేరేదీ వాడకపోతే, ఇప్పుడున్న పేరునే కొనసాగించాలి. ఇక్కడ చర్చలో వచ్చిన మిగతా పేర్లన్నీ దానికి దారిమార్పులుగా ఉండాలి. ఇదీ నా అభిప్రాయం.
ఇకపోతే యర్రా రామారావు గారు లేవదీసిన అసలు చర్చకు.. "ఇన్‌స్యూరెన్స్", "ఇన్సూరెన్స్" అనే రెండు పదాల్లో నేను మొదటిదాన్నే వాడుతూంటాను. దాన్ని ఎలా పలుకుతారో చూద్దామని నేను కొన్ని సైట్లు వెతికాను. అవన్నీ ఈ రెండూ కాకుండా, "ఇన్షూరెన్స్" అని పలుకుతున్నట్టు అనిపించింది. నా అభిప్రాఅయంలో "ఇన్‌స్యూరెన్స్" అనే మాటే అసలు మాటకు దగ్గరగా ఉన్నట్టు తోస్తోంది.
__చదువరి (చర్చరచనలు) 05:54, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కింది లింకులు చూదండి:
1, 2 చదువరి (చర్చరచనలు) 06:04, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ బొమ్మలను బట్టి చూస్తే అధికారికంగా అది తెలుగుపేరేదీ వాడుతున్నట్లు అనిపించడం లేదు. "భారతీయ జీవిత బీమా సంస్థ" అని "లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" అని కూడా తెలుగులో రాసుకుంటోంది. కాబట్టి నాకు అనిపిస్తున్నది - అధికారికంగా ఫలానా పేరు వాడుక్తోందని తెలిస్తే తప్ప, "లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" అనే పేరే ఉంచేస్తే బాగుంటుందని. __ చదువరి (చర్చరచనలు) 06:11, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ బొమ్మను బట్టి చూస్తే తమిళంలో కూడా "లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" అనే వాడుతున్నట్లు తోస్తోంది. (పదాల అమరికను బట్టి మాత్రమే చెబుతున్నాను, నాకు తమిళం రాదు)__ చదువరి (చర్చరచనలు) 06:14, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఓ.... పేజీని ఈసరికే తరలించారా! నేను గమనించనే లేదు. __ చదువరి (చర్చరచనలు) 06:06, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
భారత జీవిత బీమా సంస్థ సరైనది; వీరి కేంద్ర మరియు ఇతర కార్యాలయాల్లో కూడా ఇలాగే ఉన్నది.--Rajasekhar1961 (చర్చ) 06:09, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
@Rajasekhar1961 గారూ, బొమ్మేమైనా ఉన్నదా? ఎందుకంటే నేను పైన చూపిన ఫొటోల్లో అలా లేదు.__ చదువరి (చర్చరచనలు) 06:15, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
నేములో నేముంది? అని తొందరపడి తరలించేశానండీ చదువరి గారు.. :-) రవిచంద్ర (చర్చ) 07:23, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
:) ఏం పర్లేదులెండి. శబ్దాలంకారం బాగుంది.__ చదువరి (చర్చరచనలు) 07:56, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
శ్లేష మరీ బాగుంది. __ చదువరి (చర్చరచనలు) 08:01, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ లింకు లో చూడండి "భారతీయ జీవిత బీమా సంస్థ" అని ఉన్నది.-- K.Venkataramana -- 08:17, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారూ, మీరు ఫోటో ప్రూఫ్ చూపించారు కాబట్టి భారతీయ జీవిత బీమా సంస్థ అనే పేరుకు తరలించేద్దామా లేకా భారత జీవిత బీమా సంస్థ కు దారి మార్పు సృష్టిద్దామా అని ఆలోచిస్తున్నాను. రవిచంద్ర (చర్చ) 17:43, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చెన్నై ఎల్లైసీ భవనం

[మార్చు]

చెన్నై లోని ఎల్లైసీ భవనం చాలా ముఖ్యమైన ల్యాండ్‌మార్కు. బోలెడన్ని తెలుగు సినిమాల్లో అది కనిపిస్తుంది. అది చూస్తే అమనకు ఆ నగరం చెన్న్నై అని అర్థమైపోయేంతగా. ఆ భవనం బొమ్మపెట్టి దాని గురించి ఒక వాక్యం రయొచ్చు, ఈ వ్యాసంలో.అయితే, అసలు ముఖ్యమైన సమాచారమే స్వల్పంగా ఉంది, ఇలాంటి ట్రివియాలు, అల్పాలు, అనల్పాలను చేరిస్తే అదేదో సామెతను స్ఫురింపజేయవచ్చు. వ్యాసాని విస్తరించాక ఈ ముక్క చేర్చవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 05:59, 12 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]