ఎల్‌ఐసీ ఐపీఓ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎల్‌ఐసీ ఐపీఓ - దేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్ఐసీ) ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఒ)కు 2022 మార్చి కల్లా వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ ఐపిఒ కోసం ముందస్తు అప్రూవల్స్‌ ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే ఎల్ఐసి ఐపీఓకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) అప్రూవల్ పొందింది. ఎల్ఐసీ తన డ్రాఫ్ట్ పేపర్ (డిఆర్‌హెచ్‌పి)ని కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వద్ద ఫైల్ చేసింది. ఈ ఐపీఓ ద్వారా ఎల్ఐసీలో 5 శాతం ఈక్విటీ వాటాను అమ్మాలని కేంద్రం భావిస్తోంది.[1]

ఈ ఐపీఓలో కొంత భాగం యాంకర్ ఇన్వెస్టర్లకు, ఎల్ఐసీ ఉద్యోగులు, పాలసీదారులు ఇందులో రాయితీతో షేర్లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సంస్థ ఐపిఒ పరిమాణంలో 10 శాతం పాలసీదారులకు రిజర్వ్ చేయబడింది. ఎల్‌ఐ స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సి పబ్లిక్‌ ఇష్యూలో పాలసీదార్లు పాల్గొనాలంటే, వారి శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) వివరాలను 2022 ఫిబ్రవరి 28 నాటికి నమోదు చేయించుకోవడం తప్పనిసరి.[2]

ఎల్‌ఐసీ ఐపీఓ వాయిదా[మార్చు]

2022 మార్చి 11న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూ ఉండొచ్చని మర్చంట్‌ బ్యాంకులు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. కానీ 2022 మార్చి 2న జరిగిన వర్చువల్‌ విధానంలో విలేకరులతో మాట్లాడుతూ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మినీ ఇపే పబ్లిక్‌ ఇష్యూ తేదీ గురించి తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఫలితంగా, ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల మధ్య కదలాడుతుండటం ఇందుకు నేపథ్యం.[3] అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ది హిందూ బిజినెస్ లైన్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.[4]

తేదీలు నిర్ణయం విషయంలో 2022 మార్చి ఎల్‌ఐసీ సంస్థకు, మదుపర్లకు మేలు చేసేలా మాత్రమే ఐపీఓ నిర్వహించాలన్నది తమ లక్ష్యమని ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే పేర్కొన్నారు.[5] ఎల్‌ఐపీ ఐపీఓ ప్రతిపాదన అనంతరం కోటి కొత్త డీమ్యాట్‌ ఖాతాలు తెరచుకున్నాయన్నారు.

తొలి పబ్లిక్‌ ఆఫర్‌ తేదీ ఖరారు[మార్చు]

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తొలి పబ్లిక్‌ ఆఫర్‌ 2022 మే 4న ప్రారంభమై 9న ముగియనుంది. మదుపర్లకు మే 12న షేర్లు కేటాయిస్తారు. 16న డీమ్యాట్‌ ఖాతాలో జమవుతుంది. మరుసటిరోజు మే 17న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లు నమోదవుతాయి.[6] ఈ ఐపీఓ ధరల శ్రేణిని రూ.902 నుంచి 949గా నిర్ణయించారు. మదుపర్లు కనీసం 15 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు మే 2న ఇష్యూ ప్రారంభం అవుతుంది. ఇష్యూ ధరలో పాలసీదార్లకు రూ.60, అలాగే ఎల్‌ఐసీ ఉద్యోగులకు రూ.40 మేర రాయితీ ఉంటుంది. పాలసీదార్లకు ఇష్యూ పరిమాణంలో 10 శాతం, ఉద్యోగులకు 15 లక్షల షేర్లను రిజర్వ్‌ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఐపీఓలో భాగంగా 3.5 శాతం వాటాలను విక్రయించాలని ఎల్‌ఐసీ బోర్డు నిర్ణయించింది. ఈ వాటాల విక్రయం ద్వారా మొత్తం రూ.21,000 కోట్ల వరకు నిధులు సమీకరించనున్నారు.[7]

ఆరంభం[మార్చు]

భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ఎల్‌ఐసీ ఐపీఓ 2022 మే 4న ఉదయం 10 గంటలకు మొదలైంది. మే 9 వరకు రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీవోలో డబ్బును పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. అయినా ఆరంభమైన మొదటి రెండు గంటల్లోనే మొత్తం మీద 28 శాతం ఇష్యూకు సరిపడా బిడ్లు దాఖలయ్యాయి.[8] వాటిలో పాలసీదారులకు కేటాయించిన కోటా మేరకు పూర్తి బిడ్లు దాఖలు అవగా ఉద్యోగుల కోటాలో 48 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో 31 శాతం బిడ్లు వచ్చాయి.

రూ.20వేల కోట్ల సమీకరణ[మార్చు]

ముగిసిన అలాట్ మెంట్ ప్రక్రియతో ఎల్ఐసీ ఐపీవో రూపంలో కేంద్ర ప్రభుత్వం 20,560 కోట్లు సమీకరించింది. 2022 మే 4న మొదలైన ఎల్ఐసీ ఐపీవో 9న ముగిసింది. ఒక్కో షేరు రూ.949కు కేటాయించారు. ఈ ఇష్యూలో భాగంగా 16.2 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, మూడు రెట్లు అధికంగా 47.8 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఈ మే 17న స్టాక్ ఎక్సేంజ్ ల్లో ఎల్ఐసీ లిస్ట్ కానుంది.[9]

ఇవీ చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News. "Budget 2022: త్వరలో ఎల్‌ఐసీ ఐపీఓ.. నిర్మలమ్మ వెల్లడి". Retrieved 2022-02-16.
  2. "ఎల్‌ఐసీ పాలసీదార్లూ.. 28లోగా పాన్‌ నమోదు చేయండి". EENADU. Retrieved 2022-02-16.
  3. "షేర్లలో 10 శాతం పాలసీదారులకే..." andhrajyothy. Retrieved 2022-03-03.
  4. "ఎల్‌ఐసీ ఐపీఓ వాయిదా?". andhrajyothy. Retrieved 2022-03-03.
  5. "LIC: ఎల్‌ఐసీ ఐపీఓ కోసం కోటి కొత్త డీమ్యాట్‌ ఖాతాలు". EENADU. Retrieved 2022-03-05.
  6. "17న ఎక్స్ఛేంజీల్లో ఎల్‌ఐసీ షేర్ల నమోదు". web.archive.org. 2022-04-27. Archived from the original on 2022-04-27. Retrieved 2022-04-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకు ధరల శ్రేణి ఎంతంటే?". web.archive.org. 2022-04-27. Archived from the original on 2022-04-27. Retrieved 2022-04-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "Vaartha Online Edition ముఖ్యాంశాలు - ప్రారంభమైన ఎల్ఐసీ ఐపీవో". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-05-04. Retrieved 2022-05-04.
  9. "Lic Ipo Allotment Today: LIC IPO allotment status: Here's how to check yours - The Economic Times". web.archive.org. 2022-05-13. Archived from the original on 2022-05-13. Retrieved 2022-05-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు[మార్చు]