రంగ్ దే బసంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


రంగ్ దే బసంతి
దస్త్రం:Rang de basanti.jpg
దర్శకత్వంరాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా
రచనప్రసూన్ జోషి
స్క్రీన్ ప్లేడి'సిల్వా
రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా
ఆమిర్ ఖాన్ (Climax)[1]
కథకమలేష్ పాండే
నిర్మాతరాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా
రోనీ స్క్రూవాలా
P. S. భారతి (Creative Producer)
తారాగణంఆమిర్ ఖాన్
సిద్ధార్థ్
అతుల్ కులకర్ణి
కునాల్ కపూర్
R.మాధవన్
వహీదా రెహ‌మాన్
ఛాయాగ్రహణంబినోడ్ ప్రధాన్
కూర్పుP. S.భారతి
సంగీతంఏ.ఆర్‌.రెహ్మాన్‌
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుUTV Motion Pictures
విడుదల తేదీ
26 జనవరి 2006 (2006-01-26)
సినిమా నిడివి
157 నిమిషాలు
దేశంభారత దేశం
భాషలుహిందీ
పంజాబీ
ఇంగ్లీష్
బడ్జెట్280 million[2]
బాక్సాఫీసుest.970 million[2][3]

రంగ్ దే బసంతి 2006 జనవరి 26 న విడుదలయిన ఒక హిందీ చలన చిత్రం.ఆమిర్ ఖాన్, సిద్ధార్థ్, అతుల్ కులకర్ణి, కునాల్ కపూర్, R.మాధవన్ లు ప్రధాన పాత్రలుగా రూపొదించబడ్డ ఈ చిత్రము సంచలన విజయాన్ని సాధించింది. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.ఈ సినిమా భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి, నేటి సమకాలీన పరిస్థితులను సమాంతరంగా చూపిస్తు సాగుతుంది.

చిత్ర కధ

[మార్చు]

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మెకెన్లై అనే అధికారి జైలరుగా పనిచేస్తుంటాడు.ఆ సమయంలో తాను చూసిన కొంతమంది స్వాతంత్ర్య సమర యొధుల గురించి తన డైరీలో రాసుకుంటాడు.ఆ డైరీని అతని మనుమరాలు దర్శకురాలైన సుయ్ మెకెన్లై ఆ డైరీని చదివి దానిని ఒక చిత్రంగా రూపొదించాలని భావిస్తుంది.కాని నిర్మాణ సంస్థలు సహకరించకపోవడంతో తానే నిర్మాతగా మారి ఆ చిత్రాన్ని రూపొందించడానికి భారత దేశానికి వస్తుంది.ఆమె తన స్నేహితురాలైన సోనియా (సొహా అలీ ఖాన్) సహాయంతో నటినటుల కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంపికలు నిర్వహిస్తుంది.కాని అవి ఒక విఫల ప్రయత్నంగా మిగులుతాయి.అదే సమయంలో మెకెన్లై, సోనియ స్నేహితులను కలుస్తుంది.వారిని తన చిత్రంలో నటించడానికి ఒప్పిస్తుంది.చివరిగా సినిమాలోనికి లక్ష్మణ్ పాండే ( అతుల్ కుల్కర్ణి) ని తీసుకుంటారు.అతడు ఒక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్త.అతడు పాశ్చాత్య దేశాల సంస్కృతిని వ్యతిరేకిస్తుంటాడు.చిత్ర నిర్మాణం మొదలయిన తరువాత ఆ పాత్రలు తమ నిజజీవితానికి దగ్గరగా ఉన్నాయని భావిస్తారు. అదే సమయంలో సోనియా, అజయ్ సింగ్ రాథోడ్ ( R.మాధవన్) తో వివాహం నిర్ణయమవుతుంది.అజయ్ సింగ్ రాథోడ్ భారత వైమానిక దళంలో విమాన లెఫ్టినెంట్ గా పనిచేస్తుంటాడు. అజయ్ సింగ్ రాథోడ్ ఒక MiG-21, యుద్ద విమాన ప్రమాదంలో మరణిస్తాడు.దర్యాప్తు చేపట్టిన రక్షణ మంత్రిత్వశాఖ దానిని పైలెట్ తప్పిదంగా చూపించి దర్యాప్తును ముగిస్తుంది.కాని అజయ్ సింగ్ రాథోడ్ అద్భుతమయిన పైలెట్ అని MiG-21 విమానాల వల్ల అనేక మంది వైమానిక ద్ళానికి చెందిన పైలెట్లు మరణిస్తున్నారని, సోనియా, అజయ్ సింగ్ రాథోడ్ తల్లి (వహీదా రెహ‌మాన్), సోనియీ స్నేహితులైన దల్జీత్ సింగ్ ఆమిర్ ఖాన్, కరణ్ సింఘానియా సిద్ధార్థ్, అస్లాం ఖాన్ (కునాల్ కపూర్), సుఖీ రామ్ (షార్మాస్ జోషి), లక్ష్మణ్ పాండే (అతుల్ కుల్ కర్ణి) లతో కలిసి ఇండియా గేట్ వద్ద అందోళనలు నిర్వహిస్తారు.ఆ సమయంలో పోలిసులు వారి మీద చేస్తారు.ఆ దాడి వల్ల అజయ్ సింగ్ రాథోడ్ తల్లి, అచేతన స్థితిలోకి చేరుతుంది.ఆ సమయంలో MiG-21, యుద్ద విమాన విడిభాగాల కోసం రక్షణమంత్రి తన వ్యక్తిగతస్వార్దంతో చవకైన విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుసుకుంటారు.అందువల్ల రక్షణమంత్రిని వారు హత్య చేస్తారు.ఈ ఒప్పందంలో కీలకమయిన వ్యక్తి తన తండ్రి అయిన రజత్ సింఘానియాఅనుపమ్‌ ఖేర్‌ అని తెలుసుకున్న కరణ్ సింఘానియా తన తండ్రినీ హత్య చేస్తాడు.కాని ప్రభుత్వ వర్గాలు రక్షణమంత్రిని తీవ్రవాదులు హత్య చేసారని ఆరోపిస్తుంది.ప్రజలకు నిజం తెలుపడానికి సుఖీ రామ్, కరణ్ సింఘానియా, అస్లాం ఖాన్, లక్ష్మణ్ పాండే లు ఆలిండియా రేడియో మీద దాడి చేసి అక్కడవున్నవారందరిని బయటకు పంపి తాము తీవ్రవాదులం కాదని, తాము ఎందువల్ల రక్షణమంత్రిని హత్య చేసారో తెలుపుతారు.కాని అదే సమయంలో వారున్న ప్రాంతాన్ని భధ్రత దళాలు చుట్టుముట్టి కాల్పులు జరుపుతాయి.ఆ దాడిలో లక్ష్మణ్ పాండే, అస్లాం ఖాన్, సుఖీ రామ్, దల్జీత్ సింగ్, కరణ్ సింఘానియాలు మరణిస్తారు.

తారగణం

[మార్చు]

చిత్ర నిర్మాణం

[మార్చు]

ఈ చిత్ర నిర్మాణాన్ని 2005, ఫిబ్రవరి 1 ప్రారంభించి క్రొత్త ఢిల్లీ, ముంబై, రాజస్తాన్, పంజాబ్ ల్లో చిత్రికరించారు.

విడుదల

[మార్చు]

రంగ్ దే బసంతి 2006 జనవరి 26 న విపరీతమయిన అంచనాల మద్య విడుదలయింది.దానికి కారణం, కొన్ని వివాదాస్పద సన్నివేశాలున్నయన్న వార్త బయటకు రావడం.భారత రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతలాను లేవనెత్తడంతో నాటి రక్షణ మంత్రి అయిన ప్రణబ్ ముఖర్జీ కి, ఇతర సైనిక ఉన్నతాధికారులకు ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటుచేసారు.వారి అభ్యంతరాలు తొలగడంతో చిత్రాన్ని 2006 జనవరి 26 విడుదల చేసారు. ఈ సినిమా విడుదలైన రోజు నుండే అద్భుత వసుళ్ళను సాధించి అప్పటి వరకు గల రికార్డులను చెరిపివేసింది.

పురస్కారాలు

[మార్చు]
పురస్కారం విభాగం Recipient (s) / Nominee (s) విజేత
53వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ఉత్తమ నేపథ్య గాయకుడు నరేష్ అయ్యర్‌
ఉత్తమ ఎడిటింగ్ P. S. భారతి
ఉత్తమ శబ్దగ్రహణం Nakul Kamte



ములాలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; think అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-01-28. Retrieved 2018-05-10.
  3. "Top Lifetime Grossers Worldwide (IND Rs)". Boxofficeindia.com. Archived from the original on 15 అక్టోబరు 2013. Retrieved 10 మే 2018.

బయటి లింకులు

[మార్చు]

మూస:Aamir Khan మూస:National Film Award Wholesome Entertainment మూస:IIFA Award for Best Movie మూస:FilmfareAwardBestFilm మూస:Indian submission for Academy Awards