ప్రసూన్ జోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రసూన్ జోషి
ప్రసూన్ జోషి (2014)
జననం (1971-09-16) 1971 సెప్టెంబరు 16 (వయసు 52)
వృత్తికవి, సినీ గీత -స్క్రీన్ ప్లే రచయిత, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్
క్రియాశీల సంవత్సరాలు1992–ప్రస్తుతం
పురస్కారాలుపద్మశ్రీ (2015)

ప్రసూన్ జోషి, భారతీయ కవి, సినీ గీత -స్క్రీన్ ప్లే రచయిత, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్, మార్కెటర్.[1] మెక్కాన్ వరల్డ్ గ్రూప్ ఇండియా సీఈఓ, గ్లోబల్ మార్కెటింగ్ సంస్థ మెక్కాన్ ఎరిక్సన్ అనుబంధ సంస్థ అయిన ఏపిఏసి (ఆసియా పసిఫిక్) ఛైర్మన్. 2017, ఆగస్టు 11 న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యాడు.

ప్రసూన్ 2007, 2008లో, 2014లో (భాగ్ మిల్కా భాగ్) మూడుసార్లు ఫిలింఫేర్ ఉత్తమ గేయ రచయిత అవార్డును అందుకున్నాడు. 2007లో తారే జమీన్ పర్, 2013లో చిట్టగాంగ్ సినిమాలకు రెండుసార్లు ఉత్తమ గీత రచయితగా జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా అందుకున్నాడు.[2] కళలు, సాహిత్యం, ప్రకటనల రంగాలలో ప్రసూన్ చేసిన సేవలకు 2015లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.[3] ఐజిఎన్సీఏ ట్రస్టీలలో ఒకరు, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ సొసైటీ ప్యానెల్ సభ్యుడు, మహాత్మా గాంధీ 150వ జయంతి స్మారక జాతీయ కమిటీలో ఎంపిక చేసిన 120 మంది సభ్యులలో ఒకడిగా ఉన్నాడు.[4][5][6]

జననం

[మార్చు]

ప్రసూన్ జోషి 1971, సెప్టెంబరు 16న ఉత్తరాఖండ్ రాష్ట్రం, అల్మోరా జిల్లాలోని అల్మోరా పట్టణంలో జన్మించాడు. తండ్రి డికె జోషి, రాష్ట్ర ఎడ్యుకేషన్ సర్వీస్ అదనపు డైరెక్టర్ గా పనిచేశాడు. తెహ్రీ, చమోలీ గోపేశ్వర్, రాంపూర్, మీరట్, ఢిల్లీ వంటి ప్రదేశాలలో గడిపారు.[7][8] తల్లి రాజకీయ శాస్త్రంలో లెక్చరర్ అయిన సుష్మా జోషి మూడు దశాబ్దాలకు పైగా ఆల్ ఇండియా రేడియోలో ప్రదర్శనలు ఇచ్చింది.[9][10]

బిఎస్సీ పూర్తిచేసిన ప్రసూన్, ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. ఘజియాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ నుండి ఎంబిఎలో చేరాడు.[11] ఎంబిఎ చదువుతున్న సమయంలో సంస్కృతి, కళల పట్ల తనకున్న ఆసక్తి కారణంగా ప్రకటనలలో తన వృత్తిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.[12]

సినిమారంగం

[మార్చు]
జావేద్ అక్తర్, ప్రసూన్ జోషి, గుల్జార్

రాజ్‌కుమార్ సంతోషి తీసిన లజ్జా సినిమాకు సినీగీత రచయితగా సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. యష్ చోప్రా తీసిన హమ్ తుమ్, ఫనా, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్, బ్లాక్,ఢిల్లీ 6 వంటి అత్యంత విజయవంతమైన బాలీవుడ్ సినిమాలలో పాటలు రాశాడు. 2006లో రంగ్ దే బసంతి సినిమాకు తొలిసారిగా మాటలు రాశాడు.[13]

సామాజిక థీమ్ వర్క్

[మార్చు]
 • టాటా జాగృతి గీతం[14]
 • డెట్టాల్ స్వచ్ఛ భారత్[15]
 • పోషణ గీతం[16]

సినిమాలు

[మార్చు]
 1. మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ (2019)
 2. విశ్వరూప్ II (2018)
 3. నీర్జా (2016)
 4. మార్గరీట విత్ ఎ స్ట్రా (2015)
 5. సత్యాగ్రహ (2013)
 6. భాగ్ మిల్కా భాగ్ (2013)
 7. ఇష్క్ ఇన్ పారిస్‌ (2012)
 8. తేరీ మేరీ కహానీ (2012)
 9. ఆరక్షన్ (2011)
 10. బ్రేక్ కే బాద్ (2010)
 11. సికందర్ (2009)
 12. లండన్ డ్రీమ్స్ (2009)
 13. ఢిల్లీ 6 (2009)
 14. గజిని (2008)
 15. తోడా ప్యార్ తోడా మ్యాజిక్ (2008)
 16. తారే జమీన్ పర్ (2007)
 17. ఫనా (2006)
 18. రంగ్ దే బసంతి (2006)
 19. బ్లాక్ (2005)
 20. రోక్ సాకో టు రోక్ లో (2004)
 21. ఫిర్ మిలేంగే (2004)
 22. హమ్ తుమ్ (2004)
 23. ఆంఖేన్ (2002)
 24. క్యోన్? (2003)
 25. లవ్ ఎట్ టైమ్స్ స్క్వేర్ (2003)
 26. లజ్జా (2001)
 27. భోపాల్ ఎక్స్‌ప్రెస్ (1999)

అవార్డులు

[మార్చు]

2015లో భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు.[17]

2007లో ఫనా సినిమాలో "చాంద్ సిఫారిష్" పాటకు, 2008లో తారే జమీన్ పర్ సినిమాలో "మా" పాటకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ గీత రచయిత అవార్డులను గెలుచుకున్నాడు.

2008లో తారే జమీన్ పర్‌, 2013లో చిట్టగాంగ్ సినిమాలకు రెండుసార్లు ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకున్నాడు.

అవార్డు సాధించిన 2014 సినిమా భాగ్ మిల్కా భాగ్‌కి స్క్రిప్ట్ కూడా రాశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ప్రసూన్ భార్య అపర్ణ భారతీయ శాస్త్రీయ, జానపద సంగీతాన్ని సంరక్షించడం, ప్రచారం చేయడంలో పని చేస్తుంది. ఇండియా మ్యూజిక్ సమ్మిట్‌కు సహ వ్యవస్థాపకురాలు. వీరికి వివాహమై దశాబ్దం దాటింది, వీరికి ఐశన్య అనే కుమార్తె ఉంది.[18][19]

మూలాలు

[మార్చు]
 1. Venkatesh, M. R. (2019-02-04). "How polarised responses miss nuanced precariousness of art and life". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2023-07-12.
 2. Prasoon Joshi for Kamal Haasan's Viswaroopam 2 – Times Of India
 3. "Humbled, motivated: Prasoon Joshi on winning Padma Shri". 26 January 2015.
 4. "Prasoon Joshi, Chandra Prakash Dwivedi in Trust of Indira Gandhi National Centre for the Arts". 17 December 2019.
 5. "Rajat Sharma, Prasoon in NMML society, Congmen out". 17 December 2019.
 6. "Kovind to preside over PM-headed panel on Gandhi 150th birth anniversary". 17 December 2019.
 7. Meet Prasoon Joshi, India's ad guru by Shyamal Majumdar.
 8. Prasoon Joshi Interview Archived 21 ఫిబ్రవరి 2010 at Archive.today creativeuttarakhand (Myor Pahad).
 9. Breakfast With Prasoon Joshi, The Economic Times, 3 May 2008.
 10. "prasoon-joshi-bollywood-mann-ke-manjeere". Economictimes.com. The Economic Times. Retrieved 2023-07-12.
 11. "Prasoon Joshi: 10 things to know about the new CBFC chief". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2023-07-12.
 12. Balakrishnan, Ravi. "How Prasoon Joshi is juggling between two demanding careers; advertising and films". The Economic Times. Retrieved 2023-07-12.
 13. Adman Prasoon Joshi has now turned dialogue-writer!
 14. "Around India in 18 days".
 15. "Indian Ocean jams with Dettol for 'Banega Swachh India'".
 16. "Vice President launches 'Bharatiya Poshan Anthem'". Business Standard India. Press Trust of India. 3 December 2019.
 17. "Padma Awards 2015". Press Information Bureau. Archived from the original on 28 January 2015. Retrieved 2023-07-12.
 18. "I find women more mature than men: Prasoon Joshi - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-07-12.
 19. "Bollywood's new bard on infusing poetry into lyrics". The Week (Indian magazine).

బయటి లింకులు

[మార్చు]