షర్మిలా ఠాగూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షర్మిలా ఠాగూర్
শর্মিলা ঠাকুর
లక్స్ గోల్డన్ రోజ్ అవార్డ్స్ కార్యక్రమంలో షర్మిలా ఠాగూర్
జననం
షర్మిలా ఠాగూర్

(1944-12-08) 1944 డిసెంబరు 8 (వయసు 79)
ఇతర పేర్లుబేగం అయేషా సుల్తానా
వృత్తిమోడల్, నటి
క్రియాశీల సంవత్సరాలు1959–1984
1991–2010
జీవిత భాగస్వామిమన్సూర్ అలీ ఖాన్ పటౌడి
పిల్లలుసైఫ్, సబా, సోహా
బంధువులుఠాగూర్ కుటుంబం,
పటౌడి కుటుంబం,
జ్ఞానాభిరామ్‌ బారువా


షర్మిలా ఠాగూర్ (బేగం ఆయేషా సుల్తానాగా ప్రసిద్ధి, జననం 1944 డిసెంబరు 8) ఒక భారతీయ చలనచిత్ర నటీమణి. హిందీ సినిమాల ద్వారా ఎక్కువగా పేరు సంపాదించిన ఈమెకు రెండు భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు, రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు లభించాయి. ఈమె ఇండియన్ ఫిల్మ్‌ సెన్సార్ బోర్డు అధ్యక్షురాలిగా అక్టోబరు 2004 - మార్చి 2011ల మధ్య పనిచేసింది. డిసెంబరు 2005లో ఈమెను యూనిసెఫ్ గుడ్‌విల్ ఎంబాసిడార్‌గా ఎన్నుకున్నారు.[2] ఈమె 2009లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు జ్యూరీ సభ్యురాలిగా వ్యవహరించింది. 2013లో ఈమెకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది.[3]

ఆరంభ జీవితం

[మార్చు]

షర్మిలా ఠాగూర్ డిసెంబరు 8, 1944న హైదరాబాదులో గీతీంద్రనాథ్ ఠాగూర్, ఇరా బారువా దంపతులకు జన్మించింది. [4] ఈమె తండ్రి గీతీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్‌లో జనరల్ మేనేజర్‌గా హైదరాబాదులో పనిచేసేవాడు.ఇతడు బెంగాలీ కుటుంబానికి చెందిన వాడు కాగా ఇతని భార్య అస్సామీ కుటుంబానికి చెందిన మహిళ., ఈ ఇరువురు నోబెల్ పురస్కారగ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్కు దూరపు బంధువులు.[5][6] ప్రఖ్యాత సినిమానటి దేవికారాణి, ప్రముఖ చిత్రకారుడు అవనీంద్రనాథ్ ఠాగూరులు కూడా షర్మిలకు దూరపు బంధువులవుతారు.

ఈమె తన తల్లిదండ్రుల ముగ్గురు సంతానంలో పెద్ద కుమార్తె. ఈమె చెల్లెళ్లు ఓయిండ్రిలా కుందా, రొమీలా సేన్‌లు. పెద్ద చెల్లెలు ఓయిండ్రిలా ఈ కుటుంబం నుండి మొట్టమొదటి సినిమా నటి. ఆమె తపన్ సిన్హా తీసిన కాబూలీవాలా సినిమాలో మిని అనే పాత్రలో బాలనటిగా ఒకే ఒక సినిమాలో నటించింది.[4][7] పెరిగి పెద్ద అయ్యాక అమె అంతర్జాతీయ బ్రిడ్జ్ క్రీడాకారిణిగా రాణించింది. ఇక రెండవ చెల్లెలు రొమీలా సేన్ బ్రిటానియా ఇండస్ట్రీస్ లో ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా పనిచేసింది.

ఈమె కలకత్తాలోని సెయింట్ జాన్స్ డయాసిస్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూలులోను, లోరెటో కాన్వెంటులోను చదివింది.[8] ఈమె తన 13వ యేటనే సినీరంగ ప్రవేశం చేయడంతో చదువు పట్ల ఏకాగ్రత నిలుపలేక పోయింది. తన తండ్రి సలహాతో చదువుకు స్వస్తి చెప్పి సినిమానటన వైపు తన దృష్టిని సారించింది.[9]

వృత్తి

[మార్చు]
2009లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అంతర్జాతీయ జ్యూరీలో షర్మిలా ఠాగూర్ కూడా ఒక సభ్యురాలు

షర్మిలా ఠాగూర్ నటిగా తన ప్రస్థానాన్ని 1959లో సత్యజిత్ రే తీసిన బెంగాలీ సినిమా అపుర్ సంసార్లో "అపర్ణ" పాత్రద్వారా ప్రారంభించింది. తరువాత ఈమె శక్తి సామంతా 1964లో తీసిన కాశ్మీర్ కీ కలీ చిత్రంలో కనిపించింది.

తరువాత శక్తి సామంతా ఈమెతో అనేక సినిమాలు తీశాడు. వాటిలో 1967లో వచ్చిన యాన్ ఈవినింగ్ ఇన్ ప్యారిస్ ఒకటి. ఈ చిత్రంలో షర్మిలా ఠాగూర్ బికిని దుస్తుల్లో కనిపిస్తుంది. ఒక భారతీయ సినిమా నటి బికిని ధరించి నటించడం ఇదే తొలి సారి.[10][11][12][13][14][15] ఈమె 1968లో ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ కవర్ పేజీకి బికిని వేసుకుని పోజు ఇచ్చింది.[13][16][17][18] కానీ ఈమె కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్ పర్సన్‌గా ఎన్నికైనప్పుడు భారతీయ సినిమాలలో కురచ దుస్తుల వినియోగం పెరిగినందుకు తన నిరసన వ్యక్తం చేసింది.[19]

ఈమె రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, నసీరుద్దీన్ షా మొదలైన నటుల సరసన నటించింది. 1975లో గుల్జార్ తీసిన మౌసమ్ చిత్రంలో ఈమె నటనకు ఉత్తమ నటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కింది. 2003లో గౌతం ఘోష్ తీసిన అభర్ అరణ్యె అనే బెంగాలీ చిత్రంలోని నటనకు ఉత్తమ సహాయనటి పురస్కారం లభించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]
ఖోయా ఖొయా చాంద్ సినిమా ప్రీమియర్ షోలో కూతురు సోహా అలీఖాన్‌తో షర్మిలా ఠాగూర్

ఈమె 1969, డిసెంబర్ 27వ తేదీన పటౌడీ నవాబు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడిని వివాహం చేసుకుంది. ఈమె ముస్లిం మతంలోనికి మారి తన పేరును ఆయేషా సుల్తానాగా మార్చుకుంది. వీరికి సైఫ్ అలీ ఖాన్ (జ.1970), సబా అలీఖాన్ (జ.1976),,[20] సోహా అలీఖాన్ (జ.1978) అనే ముగ్గురు పిల్లలు కలిగారు. మన్సూర్ అలీ ఖాన్ పటౌడి 2011, సెప్టెంబరు 22న తన 70వ యేట మరణించాడు.[21] ఈమె 2016 ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లో జరిగిన లాహోర్ లిటరేచర్ ఫెస్టవల్‌కు హాజరయ్యింది. అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంతి నవాజ్ షరీఫ్ ను కలిసింది.

పురస్కారాలు

[మార్చు]
పౌర సత్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
 • 1970 – ఫిల్మ్‌ఫేర్ ఉత్తమనటి పురస్కారం — ఆరాధన[23]
 • 1998 – ఫిల్మ్‌ఫేర్ జీవన సాఫల్య పురస్కారం[23]
ఆనందలోక్ అవార్డ్
 • 2010 -జీవన సాఫల్య పురస్కారం
స్క్రీన్ అవార్డులు
 • 2002 - జీవన సాఫల్య పురస్కారం
 • 2014 - సంస్కృతి కళాశ్రీ అవార్డు

సినిమాల జాబితా

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు దర్శకుడు పాత్ర భాష
1959 అపుర్ సంసార్ సత్యజిత్ రే అపర్ణ బెంగాలీ
1960 దేవి సత్యజిత్ రే దయామయి బెంగాలీ
1963 శేష్ అంక హరిదాస్ భట్టాచార్య మాలా బెంగాలీ
1963 నిర్జన్ సైకతె తపన్ సిన్హా రేణు బెంగాలీ
1963 ఛాయ సూర్జొ పార్థ ప్రతిమ్‌ చౌధురి ఘెంటూ బెంగాలీ
1964 కాశ్మీర్ కీ కలీ శక్తి సామంతా చంపా హిందీ
1965 వక్త్ యష్ చోప్రా రేణు ఖన్నా హిందీ
1965 డాక్ ఘర్ జుల్ వెల్లని అతిథి ప్రాత్ర హిందీ
1966 అనుపమ హిందీ ఉమా శర్మ హిందీ
1966 దేవర్ మోహన్ సెహ్‌గల్ మధుమతి / బన్వరియా హిందీ
1966 సావన్ కి ఘటా శక్తి సామంతా సీమా హిందీ
1966 నాయక్ సత్యజిత్ రే అదితి బెంగాలీ
1966 ఏ రాత్ ఫిర్ న ఆయేగీ బ్రిజ్ కిరణ్ / కిరణ్మయి హిందీ
1967 మిలన్ కి రాత్ ఆర్.భట్టాచార్య హిందీ
1967 An Evening in Paris Shakti Samanta Deepa Malik/Roopa Malik (Suzy) హిందీ
1967 Aamne Saamne Suraj Prakash Sapna Mathur / Sapna G. Mittal హిందీ
1968 Mere Hamdam Mere Dost Amar Kumar Anita హిందీ
1968 Humsaya Joy Mukherjee Leena Sen హిందీ
1969 Yakeen Brij Rita హిందీ
1969 Satyakam Hrishikesh Mukherjee Ranjana హిందీ
1969 Talash O. P. Ralhan Madhu / Gauri హిందీ
1969 Aradhana Shakti Samanta Vandhana Tripathi హిందీ
1970 Aranyer Din Ratri (Days and Nights in the Forest) Satyajit Ray Aparna బెంగాలీ
1970 Suhana Safar Vijay Sapna హిందీ
1970 My Love S. Sukhdev Sangeeta Thakur హిందీ
1970 Safar Asit Sen Neela Kapoor హిందీ
1971 సీమబద్ధ సత్యజిత్ రే తుతుల్ (సుదర్శన) బెంగాలీ
1971 Chhoti Bahu K.B. Tilak Radha హిందీ
1972 Amar Prem Shakti Samanta Pushpa హిందీ
1972 Dastaan B.R.Chopra Meena హిందీ
1972 Yeh Gulistan Hamara Atma Ram Soo Reni హిందీ
1973 Raja Rani Sachin Bhowmick Nirmala / Rani హిందీ
1973 Daag Yash Chopra Sonia Kohli హిందీ
1973 Aa Gale Lag Jaa Manmohan Desai Preeti హిందీ
1974 Aavishkar Basu Bhattacharya Mansi హిందీ
1975 Mausam Gulzar Chanda/Kajli హిందీ
1975 Chupke Chupke Hrishikesh Mukherjee Sulekha Chaturvedi హిందీ
1975 Faraar Shanker Mukherjee Mala/Asha హిందీ
1975 "Ek Mahal Ho Sapno Ka" Devendra Goel Aruna హిందీ
1977 Amanush Shakti Samanta Rekha హిందీ
1978 Besharam Deven Verma Rinku/Monica హిందీ
1979 Chuvanna Chirakukal Jayan Malayalam
1979 Dooriyaan Bhimsain Khurana హిందీ
1981 Kalankini Kankabati Uttam Kumar బెంగాలీ
1982 Namkeen Gulzar Nimki హిందీ
1982 Desh Premee Manmohan Desai Bharti హిందీ
1983 Protidan Prabhat Roy

బెంగాలీ

1983 Gehri Chot - Urf: Durdesh Ambrish Sangal (India), Ehtesham (Bangladesh) Shobha
1986 న్యూ ఢిల్లీ టైమ్స్ హిందీ
1984 Sunny Raj Khosla Sunny's mother హిందీ
1991 Mississippi Masala Mira Nair Kinnu English
1993 Aashiq Awara Umesh Mehra Mrs. Singh హిందీ
1999 Mann Indra Kumar Dev's grandmother హిందీ
2000 Dhadkan Dharmesh Darshan Dev's mother హిందీ
2002 Abar Aranye Goutam Ghose Ashim's wife - Aprana బెంగాలీ
2003 Shubho Mahurat Rituparno Ghosh Padmini Chowdhury బెంగాలీ
2005 Viruddh... Family Comes First Mahesh Manjrekar Sumitra Patwardhan హిందీ
2006 Eklavya: The Royal Guard Vidhu Vinod Chopra Suhasinidevi హిందీ
2007 Fool and Final Ahmed Khan Bhabi హిందీ
2008 Tasveer 8*10 Nagesh Kukunoor Savithri Puri హిందీ
2009 అంతహీన్ Aniruddha Roy Chowdhury Pishima బెంగాలీ
2009 Morning Walk Arup Dutta Neelima హిందీ
2009 Samaantar Amol Palekar Shama Vaze Marathi
2010 Break Ke Baad Danish Aslam Ayesha Khan హిందీ

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. "Birthday special: Things you may not know about Sharmila Tagore". Mid Day. Retrieved 25 April 2016.
 2. "Sharmila Tagore, for UNICEF". rediff.com. 8 December 2005.
 3. http://timesofindia.indiatimes.com/entertainment/hindi/bollywood/news/Sharmila-Tagore-Indias-emblem-at-Cannes/articleshow/4513271.cms
 4. 4.0 4.1 "TAGORE". iinet.net.au. Archived from the original on 2015-05-13. Retrieved 2017-04-25.
 5. "The Tagore connection!". The Times of India.
 6. Van Gelder, Lawrence (9 November 1990). "At the Movies". The New York Times.
 7. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2014-10-22. Retrieved 2017-04-25.
 8. Zaman, Rana Siddiqui (7 August 2009). "My First Break – Sharmila Tagore". Friday Review Delhi. Chennai, India: The Hindu. Archived from the original on 24 డిసెంబరు 2010. Retrieved 4 November 2010.
 9. "Was considered a bad influence on girls: Sharmila Tagore". Indian Expres6 May 2011. Retrieved 19 October 2014.
 10. "Soha Ali Khan wears a bikini for 'Mr Joe B Carvalho'". Mid-Day.com. November 16, 2013. Retrieved November 16, 2013.
 11. Stuff Reporter, "Being Sharmila, all through life Archived 2009-02-13 at the Wayback Machine", The Hindu, 2006-04-03
 12. Lalit Mohan Joshi & Gulzar, Derek Malcolm, Bollywood, page 20, Lucky Dissanayake, 2002, ISBN 0-9537032-2-3
 13. 13.0 13.1 Various writers, Rashtriya Sahara, page 28, Sahara India Mass Communication, 2002
 14. Manjima Bhattacharjya, "Why the bikini is badnaam", Times of India, 2007-11-25
 15. Avijit Ghosh, "Bollywood's unfinished revolution Archived 2012-10-23 at the Wayback Machine", The Times of India, 2006-07-02
 16. "Like mom Sharmila Tagore, Soha Ali Khan dons a bikini in Mr Joe B Carvalho". India Today. November 19, 2013. Retrieved November 19, 2013.
 17. B. K. Karanjia, Blundering in Wonderland, page 18, Vikas Publishing House, 1990, ISBN 0-7069-4961-7
 18. Sumita S. Chakravarty, National Identity in Indian Popular Cinema, 1947–1987, page 321, University of Texas Press, 1993, ISBN 0-292-75551-1
 19. Preeti Mudliar, "Without Cuts Archived 2009-01-13 at the Wayback Machine", Pune Newsline, 2005-04-11
 20. "To Saif with love: Soha & Saba". rediff.com.
 21. "India's legendary cricketer Tiger Pataudi passes away at 70". Retrieved 2011-09-22.
 22. "Padma Awards Announced". Government of India. 25 January 2013. Retrieved 10 October 2015.
 23. 23.0 23.1 23.2 23.3 ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Sharmila Tagore పేజీ

బయటి లింకులు

[మార్చు]