చపాక్

వికీపీడియా నుండి
(చపాక్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చపాక్‌
దర్శకత్వంమేఘనా గుల్జార్
రచనఅతిక చోహన్
మేఘనా గుల్జార్‌
నిర్మాతఫాక్స్ స్టార్ స్టూడియోస్
దీపికా పదుకొనె
గోవింద్ సింగ్ సందు
మేఘనా గుల్జార్‌
తారాగణందీపికా పడుకోణె
విక్రాంత్ మాస్సే
విశాల్‌ దహియా
అంకిత్‌ బిష్ట్
ఛాయాగ్రహణంమలే ప్రకాష్
కూర్పునితిన్ బైద్
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ సంగీతం :
శంకర్-ఎహసాన్-లాయ్
తబ్బి
పాటలు:
శంకర్–ఎహసాన్ - లాయ్‌
నిర్మాణ
సంస్థలు
ఫాక్స్ స్టార్ స్టూడియోస్
క ప్రొడక్షన్స్
అవెర్న్స్ ప్రొడక్షన్స్
మ్రిగా ఫిలిమ్స్
పంపిణీదార్లుఫాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల తేదీ
10 జనవరి 2020 (2020-01-10)
సినిమా నిడివి
120 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్36 కోట్లు[2]
బాక్సాఫీసు55.44 కోట్లు[3]

చపాక్‌ 2020లో విడుదలైన హిందీ సినిమా. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కా ప్రొడక్షన్స్, అవెర్న్స్ ప్రొడక్షన్స్, మ్రిగా ఫిలిమ్స్ బ్యానర్ల పై ఫాక్స్ స్టార్‌ స్టూడియోస్‌, దీపికా పదుకోన్‌, గోవింద సింగ్‌ సాందు, మేఘనా గుల్జార్‌ నిర్మించిన ఈ సినిమాకు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించింది. దీపికా పడుకోణె, విక్రాంత్‌ మాసే, విశాల్‌ దహియా, అంకిత్‌ బిష్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2020 జనవరి 10న విడుదలైంది.

మాలతి (దీపికా పదుకోన్) స్కూల్లో అప్పుడప్పుడే అబ్బాయిలతో పరిచయాలు పెరిగే పరువంలోకి అడుగుపెడుతుంది. ఆమె స్నేహితుడు బబ్బూ (విశాల్‌ దహియా) ప్రేమిస్తున్నానని వెంటపడతాడు. దానికి ఆమె ఒప్పుకోదు. మాలతి తనకు నచ్చిన రాజేష్‌ (అంకిత్‌ బిష్ట్ ) తో సన్నిహితంగా ఉంటుంది. అది నచ్చని బబ్బూ ఒకసారి ఆమెను మందలిస్తాడు. కానీ ఆమె బెదరదు, దీంతో తన వదిన సాయంతో మాలతిపై యాసిడ్‌ దాడి చేయగా మాలతి ముఖం పూర్తిగా కాలిపోతుంది. మాలతీ తరువాత కుటుంబసభ్యులు, సన్నిహితులు ఇచ్చిన భరోసాతో సామజిక కార్యకర్తగా మారుతుంది. ఆ క్రమంలోనే అమోల్‌ (విక్రమంత్‌ మాసే) తో అనుబంధం పెరిగి ఆమెకు అతడిని ప్రేమిస్తుంది. అమోల్‌ మనసు మాలతి ప్రేమను గ్రహించిందా? వారిద్దరి జీవితాలు ఎలా మారాయి? ఆ తర్వాత ఏమైంది ? ఆమెపై దాడి చేసిన బబ్బూకి శిక్ష పడిందా ? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

[మార్చు]
  • దీపికా పడుకోణె
  • విక్రాంత్ మాస్సే
  • విశాల్‌ దహియా
  • అంకిత్‌ బిష్ట్
  • మధుర్జీత్ సెర్గి
  • దేవాస్ దీక్షిత్
  • ఆనంద్ తివారి
  • వైభవి ఉపాధ్యాయ
  • పాయల్ నాయర్
  • గీత అగర్వాల్
  • వరుణ్ కేతన్
  • భారతి గోల
  • అంజనా ఓం కశ్యప్
  • పల్లవి బత్రా
  • సన్నీ గిల్
  • సంజయ్ గుర్బాసాని
  • మీకీ మఖిజ
  • సాక్షి బెణిపూరి

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్లు: ఫాక్స్ స్టార్‌ స్టూడియోస్‌, క ప్రొడక్షన్స్, అవెర్న్స్ ప్రొడక్షన్స్, మ్రిగా ఫిలిమ్స్
  • నిర్మాతలు: ఫాక్స్ స్టార్‌ స్టూడియోస్‌, దీపికా పదుకోన్‌, గోవింద సింగ్‌ సాందు, మేఘనా గుల్జార్‌
  • కథ: అతికా చౌహాన్‌, మేఘనా గుల్జార్‌
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మేఘనా గుల్జార్‌
  • సంగీతం: శంకర్‌ – ఎహసాన్‌ – లాయ్‌
  • సినిమాటోగ్రఫీ: మలాయ్‌ ప్రకాష్‌
  • ఎడిటింగ్‌: నితిన్‌

మూలాలు

[మార్చు]
  1. "Chhapaak (2020)". British Board of Film Classification. Retrieved 4 January 2020.
  2. Pal, Deepanjana (11 January 2020). "Chhapaak and Tanhaji: It's not a contest". Hindustan Times. Retrieved 12 January 2020.
  3. "Chhapaak Box Office". Bollywood Hungama. Retrieved 8 February 2020.
  4. The New Indian Express (11 January 2020). "'Chhapaak' review: Deepika Padukone lifts Meghna Gulzar's stark drama". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=చపాక్&oldid=4337207" నుండి వెలికితీశారు