Jump to content

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్

వికీపీడియా నుండి
Kingfisher Airlines
IATA
IT
ICAO
KFR
కాల్ సైన్
KINGFISHER
స్థాపన2003
మొదలు9 May 2005
Ceased operations
  • Oct 2012 (flights suspended)
  • Feb 2013 (licence revoked)
Hub
  • Kempegowda International Airport (Bengaluru)
  • Secondary hubs
    • Chhatrapati Shivaji International Airport (Mumbai)
    • Indira Gandhi International Airport (Delhi)
    Focus cities
    • Chennai International Airport
    • Pune International Airport
    Frequent flyer programKing Club
    Member loungeKingfisher Lounge
    Fleet size64
    Destinations{{{destinations}}}
    Parent companyUnited Breweries Group
    కంపెనీ నినాదంFly The Good Times
    ముఖ్య స్థావరంThe Qube, Mumbai, Maharashtra[1][2]
    ప్రముఖులు
    • Vijay Mallya (CMD)
    • Sanjay Aggarwal (CEO)(quit on 17 Feb 2014)
    • Prem Kumar Amritnagar (EVP)
    Website: flykingfisher.com (now defunct)

    కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ భారత్ ఆధారంగా పనిచేసిన ఓ ఎయిర్ లైన్ సముదాయం. ముంబయిలోని అంధేరీ(తూర్పు) ప్రాంతంలో దీని ప్రధాన కార్యాలయం ఉండేది. అదేవిధంగా రిజిష్టర్డ్ కార్యాలయం బెంగళూరులోని యు.బి.సిటీలో ఉండేది. ఇందులో చవక ధరల విమాన సంస్థ అయిన కింగ్ ఫిషర్ రెడ్ కు 50 శాతం వాటా ఉండేది. 2011 వరకు కూడా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ భారతదేశంలో రెండో అతి పెద్ద దేశీయ విమాన మార్కెట్లో వాటా కలిగి ఉండేది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సంస్థను తర్వాత మూసివేశారు.

    చరిత్ర

    [మార్చు]

    ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్య యాజమాన్యంలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ 2003లో ప్రారంభించబడింది. దీనికి మాతృ సంస్థ అయిన యునైటెడ్ బ్రేవరీస్ గ్రూపు నుంచి ఇది ఏర్పాటైంది. తన వాణిజ్య కార్యకలాపాలను కొత్తగా కొన్న నాలుగు ఎయిర్ బస్ A320-200 లతో మే 9, 2005 నుంచి ప్రారంభించింది. తొలి విమానం ముంబయి నుంచి ఢిల్లీ వరకు నడిచింది. తన అంతర్జాతీయ కార్యకలాపాలను సెప్టంబరు 3, 2008 లో బెంగళూరు నుంచి లండన్ కు ప్రారంభించింది. ఏది ఏమైనప్పటికీ ఈ సంస్థ కాల క్రమంలో అనేక ఆర్థిక ఇబ్బందులకు గురైంది. [3] అక్టోబరు 20, 2102 నాడు ఈ సంస్థకు సంబంధించిన విమాన ధ్రువీకరణ ను సస్పెండ్ చేస్తూ డి.జి.సి.ఎ. ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి ననుంచి ఎయిర్ లైన్ సంస్థ తన కార్యాకలాపాలను ఆపివేసింది. ఆతర్వాత డి.జి.సి.ఎ.కు సరైన వివరణ ఇవ్వడంలో సంస్థ విఫలమైంది. దీంతో.. ఫిబ్రవరి 2013లో దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడిపడానికి అనుమతి నిరాకరిస్తూ భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. [4] సంస్థ సి.ఈ.ఓ. ఫిబ్రవరి 17, 2014న వైదొలిగారు. [5]

    గమ్యాలు

    [మార్చు]

    కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలను రద్దు చేసేనాటికి మొత్తం దేశీయంగా 25 గమ్య స్థానాలకు విమానాలు నడిచేవి. అదేవిధగా అంతర్జాతీయ విమానాలను కూడా 10, ఏప్రిల్ 2012 నుంచి రద్దు చేశారు.

    విమానాలు

    [మార్చు]

    కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ యొక్క ప్రధాన విమానాల్లో ఎ.టి.ఆర్ 42, ఎ.టి.ఆర్ 72, ఎయిర్ బస్ A320 కుటుంబానికి చెందినవి దేశీయంగా వినియోగించేవారు. అదేవిధంగా ఎయిర్ బస్ A330-200s రకాలను అంతర్జాతీయంగా వాడేవారు. 2009 జనవరి నాటికి సంస్థ విమానాల సగటు వయస్సు 2.3 సంవత్సరాలుగా ఉండేది. [6]

    సేవలు

    [మార్చు]

    ప్రస్తుతం కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ సంస్థ ఎలాంటి సేవలను అందించడం లేదు.

    అవార్డులు-విజయాలు

    [మార్చు]

    ఈ సంస్థ స్థాపించిన అనతి కాలంలోనే ఎన్నో విజయాలు సాధించి పలు అవార్డులు గెలుచుకుంది:

    • ఉత్తమ బోనస్ ప్రమోషన్
    • ఉత్తమ వినియోగదారుల సేవలు అందించినందుకు గానూ...
    • స్కై ట్రాక్స్ ప్రపంచ ఎయిర్ లైన్ అవార్డు-2010 కింద కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు మూడు గ్లోబల్ అవార్డులు దక్కాయి.
      • భారత్ లో ఉత్తమ ఎయిర్ లైన్ / మధ్య ఆసియా; ఉత్తమ క్యాబిన్ క్రూ- మధ్య ఆసియాగా పేరు ప్రఖ్యాతులు
    • భారత్/ మధ్య ఆసియాలో చవక ధరల ఉత్తమ ఎయిర్ లైన్ గా కింగ్ ఫిషర్ రెడ్ పేరుగాంచింది. వీటితో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు పొందింది. [7]

    ప్రమాదాలు-సంఘటనలు

    [మార్చు]
    • ముంబయిలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబరు10, 2009 నాడు విమానం ATR 72-212A VT-KAC రన్ వే లాండ్ అయిన తర్వాత అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో విమానం కొంత భాగం చెడిపోయినప్పటికీ అందులో ఉన్న 46 మంది ప్రయాణీకులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనిపై విచారణ జరిపిన పౌరవిమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్ ఈ ప్రమాదంలో తుది తుది నివేదిక విడుదల చేసింది. పైలట్ తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందని, అతి వేగంతో విమానాన్ని రన్ వే పై ల్యాండ్ చేయడం వల్ల విమానాన్ని అదుపు చేయలేక ప్రమాదం జరిగిందని ధ్రువీకరించారు.[8]

    విభాగాలు

    [మార్చు]
    • 2004లో ఏర్పాటైన ఎయిర్ లైన్స్
    • 2013లో ఏర్పాటైన ఎయిర్ లైన్స్
    • భారత్ లో పనిచేయని ఎయిర్ లైన్స్
    • ముంబయి ఆధారిత కంపెనీలు
    • మాజీ ఐ.ఎ.టి.ఎ. సభ్యులు
    • బాంబే స్టాక్ ఎక్చ్సేంజీలో నమోదైన కంపెనీల జాబితా

    మూలాలు

    [మార్చు]
    1. "Airline Membership". IATA. Archived from the original on 2015-07-11. Retrieved 2015-05-23.
    2. "KFA Office". KFA. Archived from the original on 2013-03-12. Retrieved 2015-05-23.
    3. India Today, Kingfisher in trouble: Vijay Mallya refuses to accept his business model is to be blamed for crisis, 19 November 2011, retrieved 4 December 2011
    4. "Kingfisher Fails to Renew License Causing Withdrawal of Flights". India Internal Flights.com.
    5. Kingfisher Airlines CEO Sanjay Aggarwal quits. Livemint (17 February 2014). Retrieved on 21 May 2014.
    6. "Kingfisher Airlines". Cleartrip. 23 May 2015.
    7. "Achievements and Awards". Flykingfisher.com. Archived from the original on 24 జూలై 2010. Retrieved 30 August 2010.
    8. "Report on Serious Incident to M/S Kingfisher Airlines ATR-72 Aircraft VT-KAC at Mumbai on 10.11.2009" (PDF). Directorate General of Civil Aviation. Archived from the original (PDF) on 16 జూలై 2011. Retrieved 25 November 2010.