కింగ్ ఫిషర్ రెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలోని ముంబయి ప్రధాన కేంద్రంగా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ విమానాలు కింగ్ ఫిషర్ రెడ్ పేరుతో నడిచేవి. కింగ్ ఫిషర్ రెడ్ అనేది ఒక బడ్జెట్ దేశీయ విమానయాన సంస్థ. కింగ్ ఫిషర్ రెడ్ మొదట్లో అందరూ డెక్కన్ పేరుతోనూ, ఎయిర్ డెక్కన్ పేరుతోనూ పిలిచేవారు. అతి చవక రేట్లతో నిర్వహించిన ఈ సంస్థను కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ భారత్ లోని ముంబయి కేంద్రంగా నిర్వహించింది.[1] కింగ్ ఫిషర్ రెడ్ కోసం సినీ బ్లిట్జ్ అనే సినిమా మ్యాగజైన్ ముద్రించిన ప్రత్యేక సంచికను విమానంలో ప్రయాణించేవారికోసం పరిమత సంఖ్యలో అందుబాటులో ఉంచేవారు. నష్టాల కారణంగా కింగ్ ఫిషర్ రెడ్ కార్యకలాపాలను ఆపివేయనున్నట్లు సంస్థ ఛైర్మన్ విజయ్ మాల్యా సెప్టెంబరు 28, 2001న ప్రకటించారు.[1][2]

చరిత్ర[మార్చు]

ఎయిర్ డెక్కన్ సంస్థను ప్రముఖ రాజకీయ వేత్త, రచయిత అయిన కెప్టెన్ జి.ఆర్. గోపీనాథ్ ప్రారంభించారు. ఇది భారత దేశంలో తొలి చవక ధరల విమానసంస్థ గా తన సేవలను ఆగస్టు 23, 2003లో బెంగళూరు నుంచి హుబ్లీకి ప్రారంభించింది.[3] సామాన్యుల విమాన సంస్థగా దీనికి పేరుంది. ఈ సంస్థ లోగో రెండు అరచేతులు కలిపి ఓ పక్షి ఎగురుతున్నట్లుగా ఉంటుంది. ఈ సంస్థ నినాదం “సింప్లీ-ఫ్లై” అని రాస్తారు. సామాన్యులు కూడా విమానాల్లో ఎగురవచ్చని ఈ సంస్థ నిరూపించింది. తన జీవిత కాలంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే ప్రతి భారతీయుని కల నెరవేర్చాలని కెప్టెన్ గోపీనాథ్ అంటుండేవారు. హుబ్లీ, మంగళూరు, మధురై, విశాఖపట్టణం వంటి రెండో శ్రేణి నగరాలకు బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో పాలిటన్ నగరాల నుంచి విమానాలను నడిపించిన తొలి విమాన సంస్థ ఇదే. ఎయిర్ డెక్కన్ ఆరంభమైన అతి కొద్ది కాలంలోని అద్భుత పురోగతి సాధించించి. అయితే ఈ సంస్థ నష్టాల భారిన పడడంతో 2007లో దీని నిర్వహణ బాధ్యతలను కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ తీసుకుంది. అప్పుడు దీనిని కింగ్ ఫిషర్ రెడ్ ఎయిర్ లైన్స్ గా పేరు మార్చారు. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ విమాన ప్రయాణ ఛార్జీలను బాగా తగ్గించారు. ఎంతగా తగ్గించారంటే భారత దేశంలో ఉన్నత శ్రేణి రైలు ప్రయాణ ఛార్జీలతో సమానంగా ఈ విమాన రేట్లునిర్ణయించి విమాన ప్రయాణికులకు సేవలందించారు. అయితే ఈ సంస్థ కాలక్రమంలో స్పైస్ జెట్, ఇండి గో ఎయిర్ లైన్, జెట్ లైట్ మరియు గో ఎయిర్ ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంది. ప్రస్తుతం దీని కార్యకలాపాలు ఆపివేశారు. [4]

గమ్యాలు[మార్చు]

కింగ్ ఫిషర్ రెడ్ కార్యకలాపాలు భారతదేశంలోని పలు గమ్యాస్థానాలతో పాటు కొన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా కొనసాగాయి. [5]

విమానాలు[మార్చు]

చవక ధరల కార్యకలాపాల నుంచిక కింగ్ ఫిషర్ రెడ్డి ఎయిర్ లైన్స్ వైదొలిగిన తర్వాత కొన్ని సంస్కరణలు తెచ్చారు. ఎయిర్ డెక్కన్ నుంచి తీసుకున్న ఎయిర్ బస్ A-320 , ATR-72 విమానాలను కింగ్ ఫిషర్ పూర్తి స్థాయి ధరల సర్వీసులుగా మార్చారు. [6]

ప్రమాదాలు మరియు సంఘటనలు[మార్చు]

ఎయిర్ డెక్కన్ తన సేవలను సెప్టెంబరు 24, 2003లో ఒడి దొడుకుల మధ్య ప్రారంభించిన నాడే ఆ సంస్థకు సంబంధించిన తొలి విమానం అగ్ని ప్రమాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు టేకాఫ్ అవుతున్న సమయంలో మంటలు చెలరేగాయి.[7][8] ఆ సమయంలో విమానంలో చాలా ముంది ప్రముఖులు ఉన్నారు. అప్పటి బి.జె.పి.అధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు, the then Minister of State for పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి , రాజీవ్ ప్రతాప్ రూఢీ, తెలుగుదేశం పార్టీ నేత కె.ఎర్రన్నాయుడు వంటి ప్రముఖులు విమానంలో ఉన్నారు. అయితే సకాలంలో మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. తిరిగి మార్చి 29, 2004 నాడు గోవా నుంచి బెంగళూరు వెళ్తుండగా టేకాఫ్ అయిన అరగంట తర్వాత ఎయిర్ డెక్కన్ విమానంలోని క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. [9] మార్చి 11, 2006 నాడు కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్లే ఎయిర్ డెక్కన్ విమానం బెంగళూరు లోని హెచ్ఎఎల్ విమానాశ్రయంలో దిగుతుండగా అదుపు తప్పి రన్ వే పై పడిపోయింది.[10] ఈ సమయంలో విమానంలో 40 మంది ప్రయాణికులు, 4గురు విమాన సిబ్బంది ఉన్నప్పటికీ ఎవరికీ ప్రమాదం జరగలేదు. అయితే ఈ విమానం పూర్తిగా దెబ్బతింది.

బయటి లింకులు[మార్చు]

విభాగాలు[మార్చు]

 • ముంబయిలోని కంపెనీ ఆధారితాలు
 • భారత దేశంలో పనిచేయని విమాన సంస్థలు
 • 2003లో స్థాపించిన విమాన సంస్థలు
 • 2001లో అనుమతి లభించని ఎయిర్ లైన్స్
 • పనిచేయని తక్కువ ధరల విమాన సంస్థలు

సూచనలు[మార్చు]

 1. "Kingfisher to exit low-cost airline operation". CNN IBN. 28 September 2011. Retrieved 28 September 2011.
 2. "Vijay Mallya grounds low-cost carrier Kingfisher Red". NDTV. 28 September 2011. Retrieved 28 September 2011.
 3. "About Air Deccan".
 4. "Deccan IPO scrapes through". Financialexpress.com. 24 May 2006. Retrieved 30 August 2010.
 5. "Kingfisher Red Airlines". Cleartrip.
 6. "Kingfisher to exit low-cost flying". Times of India. 29 September 2011. Retrieved 20 August 2012.
 7. Our Bureau / Hyderabad 25 September 2003 (25 September 2003). "Fire grounds Air Deccan". Business-standard.com. Retrieved 30 August 2010.
 8. "Major plane accident averted". Hinduonnet.com. 25 September 2003. Retrieved 30 August 2010.
 9. "Low-cost flight under a cloud". Hindu.com. 11 April 2004. Retrieved 30 August 2010.
 10. "Air Deccan aircraft skids off runway". Thehindubusinessline.com. 12 March 2006. Retrieved 30 August 2010.